ప్రధాన మెనూను తెరువు

కొవ్వు ఆమ్లం

(ఫ్యాటి ఆమ్లములు నుండి దారిమార్పు చెందింది)
Three dimensional representations of several fatty acids

కొవ్వు ఆమ్లాలు, ఫ్యాటీ అసిడ్లు లేదా ఫ్యాటి ఆమ్లాలు (Fatty acids) నూనెలలో, కొవ్వు (fat) లలో వుండును. కొవ్వులు ఎక్కువగా జంతుసంబంధిత ఉత్పాదనలు. అనగా టాలో (tallow=జంతు కొవ్వు, లాడ్ (lard=పందికొవ్వు) . నూనెలు అనేవి వృక్షసంబంధిత మైనవి. ఈ ఫ్యాటి ఆమ్లములు మరియు గ్లిసెరొల్ సంయోగం చెందటం వలన నూనెలు (oils), కొవ్వులు (fats) ఏర్పడును. మూడు ఫ్యాటి్‌ ఆసిడులు మరియు ఒక గ్లిసరోల్ సంయోగం చెందటం వలన ఒక ట్రైగ్లిసెరైడ్‌ + 3 నీటి బిందువులు ఏర్పడును[1].

ట్రైగ్లిసెరైడ్‌లోని మూడు కొవ్వు ఆమ్లములు ఒకే రకమునకు చెందినవి అయినచో వాటిని సింపుల్ ట్రైగ్లిసెరైడ్ (simple glyceride) అని, రెండు లేదా మూడు రకాల (different kinds) ఫ్యాటి్‌ ఆసిడ్ల సంయోగము వలన ఏర్పడినచో మిశ్రమ గ్లిసెరైడ్ (Mixed glyceride) అంటారు.

ప్రతిరోజు 10 గ్రాముల ఫ్యాటి ఆసిడ్ లను ఎదో రూపములో తీసుకొవడం అవసరం. ముఖ్యంగా అసంతృప్త కొవ్వు ఆమ్లాలులను (unsaturared fatty acids) ఆధిక మొత్తంలో కలిగివున్న వాటిని ఆహారంలో తీసుకొనవలెను. ఈ ఆమ్లాలు కొవ్వులలో అధిక మొత్తంలో వుండటం వలన వీటికి "ఫ్యాటి ఆసిడ్" లనే పేరు వచ్చింది.

నిర్మాణంసవరించు

ఫ్యాటి ఆసిడ్‌లు కార్బన్ (Carbon, హైడ్రోజన్ (hydrogen, ఆక్సిజన్ (oxygenల) మూలకాల సమ్మేళనం వలన ఏర్పడును. ఫ్యాటి ఆసిడ్‌లు కార్బోక్షిల్ ఆసిడ్ గ్రూప్‌నకుచెందినవి. ఫ్యాటి ఆసిడ్ లో ఒక COOH (carboxyl) వుండటం వలన ఈ ఫ్యాటి అసిడ్లను మోనో కార్బొక్షిల్ అసిడ్ లు అని కూడా అంటారు[2] . హైడ్రొకార్బోను శృంఖలం (Hydrocarbon chain) యొక చివర హెడ్రొక్షిల్ గౄప్ (COOH), మరో చివర CH3 వుండటం వలన ఫ్యాటి ఆమ్లములు ఏర్పడును. ఇవి సాధారణంగా ఏటువంటి శాఖలు (branches) లు లేకుండగా సరళముగా (straight) గా వుండును. కొమ్మలు (branches) వున్న ఫ్యాటి ఆసిడ్ లను కూడా కొన్ని నూనెలలో గుర్తించడం జరిగింది. మనం వాడే వంటనూనెలలో శాఖరహిత (un branched) ఫ్యాటీ ఆమ్లములే వుండును.

ఫ్యాటి ఆసిడ్ లలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు[3] (Saturated fatty acids) మరియు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు[4] (unsaturated fatty acids) లని రెండు రకములు. సంతృప్త ఫ్యాటి ఆసిడ్ హెడ్రొకార్బను గొలుసులో ఏటువంటి ద్విబంధాలు వుండవు. అసంతృప్త ఫ్యాటి ఆసిడ్ లలో ద్విబంధాలు వుండును. కార్బను వెలన్సి (valancy) విలువ 4. అనగా కార్బను పరమాణువు (Atom) ఏక కాలములో 4 పరమాణువులతో బంధాలను (Bonds) ఏర్పరచ గలదు. ఫ్యాటి ఆసిడ్ లలో ప్రతి కార్బను ఇరుపక్కల మిగతా రెండు కార్బనులతోను, మిగతా రెండు పక్కల రెండు hydrogen పరమాణువులతోను సంయోగం చెంది వుండును. ఫ్యాటి ఆసిడ్లలో కార్బనుల సంఖ్య 4 నుంచి మొదలుకొని 30 కార్బనుల వరకు వుండును. 30 కన్న ఎక్కువ కార్బనులున్న ఫ్యాటి ఆసిడులు వున్నప్పటికి, అంత ఏక్కువ ప్రమాణంలో లేవు.

సంతృప్త కొవ్వు ఆమ్లాలుసవరించు

ఫ్యాటి ఆమ్లములోని కార్బను-కార్బను మధ్య ద్విబంధం లేకున్నచో సంతృప్త ఫ్యాటి ఆమ్లములు/సంతృప్త కొవ్వు ఆమ్లాలు (Saturared fatty acids) అనియు అంటారు.

18 కార్బనులు శృంఖలంలో కలిగివున్న సంతృప్త కొవ్వు ఆమ్లం (స్టియరిక్ ఆమ్లం)

 
 
CH3- (CH2) 16-COOH. (C18H36O2) ) ద్విబంధాలు లేవు

ఏకద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలుసవరించు

కార్బను-కార్బను మధ్య ద్విబంధం (Double bond) వున్నచో అసంతృప్త ఫ్యాటి ఆమ్లాలు/అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (Unsaturared fatty acids) అంటారు. ఒక ద్విబంధం వున్నచో ఏక ద్విబంధ అసంతృప్త (monounsaturated) కొవ్వు ఆమ్లం అంటారు[5] .శాక నూనెలలో ఉండు కొవ్వు ఆమ్లాల హైడ్రోకార్బను గొలుసులో సాధారణంగా కొమ్మలు/శాఖలు ఉండవు. 16 కార్బనులను కలిగి, ఒకద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం-పామిటోలిక్ ఆమ్లం

 
CH3 (CH2) 5CH=CH (CH2) 7COOH.పామిటొలిక్ ఆమ్లం

ఏకద్విబంధమున్న కొవ్వు ఆమ్లాలను ఎక్కువ శాతంలోఉన్న కొన్ని నూనెలను దిగువున పెర్కోనడం జరిగినది[5]

ఏకద్విబంధమున కొవ్వుఆమ్లాలు రక్త వత్తిడిని తగ్గిస్తుంది.HDL కొలెస్ట్రాలును రక్తంలో పెంచుతుంది.విటమివు E ను కలిగిఉండును[6]

రెండు ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలుసవరించు

18 కార్బనులను కలిగిన, రెండు ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వుఆమ్లం- లినొలిక్ ఆమ్లం

 

ఫ్యాటి ఆమ్లములోని కార్బను- కార్బను మధ్య ద్విబంధం లేకున్నచో సంతృప్త ఫ్యాటి ఆమ్లములని (Saturared fatty acids) అనియు, కార్బను-కార్బను మధ్య ద్విబంధం (Double bond) వున్నచో అసంతృప్త ఫ్యాటి ఆమ్లములని (Unsaturared fatty acids) అంటారు. ఒక ద్విబంధం వున్నచో ఏక ద్విబంధ అసంతృప్త (monounsaturated) ఫ్యాటి ఆసిడ్ అనియు, ఒకటీ కన్న ఎక్కువ బంధాలున్నచో బహుళ బంధ (poly unsaturated) ఫ్యాటి ఆసిడ్ లని అంటారు. ఫ్యాటి ఆసిడ్ లోని కార్బనుల సంఖ్యని బట్టీ అమ్లముల పేర్లు వుండును.

మనం వాడే నూనెలలో 10-18 కార్బనులున్న సంతృప్త ఫ్యాటి ఆసిడులు, 16-18 కార్బనులున్న అసంతృప్త ఫ్యాటి ఆమ్లములు ఉన్నాయి. వంట నూనెలలో లారిక్, మిరిస్టిక్, పామిటిక్ మరియు స్టియరిక్ సంతృప్త ఫ్యాటి ఆసిడ్ లు వుండును, మరియు ఎక ద్విబంధమున్న ఒలిక్ ఆసిడ్, ద్వి ద్విబంధాలున్న లినొలిక్ ఆసిడులు అధిక మొత్తములో ఉన్నాయి. ఫ్యాటి ఆమ్లములు సాధారణంగా కార్బనులను సరిసంఖ్యలో (even) కలిగి వుండును. కాని అతి తక్కువ మొత్తములో బేసి (odd) సంఖ్యలో కార్బనులను కలిగి వుండును. లారిక్, మిరిస్టిక్, పామిటిక్. స్టొయరిక్, ఒలిక్ మరియు లినొలిక్ ఆసిడ్ లనేవి వాడుక పేర్లు.

హైడ్రోకార్బను శృంఖలంలో కొమ్మలు(శాఖలు)కలిగిన కొవ్వుఆమ్లాలుసవరించు

హైడ్రోకార్బను శృంఖలంలో కొమ్మలు (శాఖలు) కలిగిన కొవ్వుఆమ్లం

 
(7R, 11R) -3, 7, 11, 15-Tetramethylhexadecanoic acid.పైథానిక్ ఆమ్లం

కొవ్వు ఆమ్లంయొక్క హైడ్రోకార్బను శృంఖలంలో కొమ్మలను కలిగిన కొవ్వుఆమ్లాలు, భిన్నమైన చక్రియ సౌష్టవాలున్న కొవ్వుఆమ్లాలను ఎక్కువగా జలచరజీవుల కొవ్వులలో, బాక్టిరియలలో, అంతకన్నసూక్ష్మదేహనిర్మాణమున్న జీవులలో గుర్తించడం జరిగినది [7].

నామకరణంసవరించు

అయితే ఫ్యాటి ఆసిడులను సాంకేతికంగా 'జెనెవా' (Geneva) నామ విధానం ప్రకారం పిలుస్తారు. జెనెవా నామవిధానము ప్రకారము ఫ్యాటి ఆసిడులోని కార్బనుల సంఖ్యను ముందు పదముగా (గ్రీకు పదము) వుంచెదరు. ఊదాహరణకు 12, 14, 16 మరియు 18 కార్బనులను కలిగివున్న ఫ్యాటి ఆసిడుల కార్బనుల సంఖ్యను సూచిస్తూ వరుసగా డొడెక్ (dodec), టెట్రాడెక్ (tetradec), హెక్సాడెక్ (hexadec), మరియు ఆక్టాడెక్ (octadec) లను ముందు పదముగా వుంచెదరు. సంతృప్త ఫ్యాటి ఆసిడ్ (saturated fatty acid) అయినచో పేరు చివర అనొయిక్ (anoic) అనే పదంను, అసంతృప్త ఫ్యాటి ఆసిడు (unsaturated) అయినచో ఇనొయిక్ (enoic) అనేపదమును చేర్చి పిలిచెదరు[8] . జెనెవా నామవిధానము ప్రకారము 12 కార్బనులు వున్న లారిక్‌ఆసిడ్ ను డొడెకనొయిక్ (dodecanoic) అని, 14 కార్బనులు వున్న మిరిస్టిక్‌ ఆసిడును టెట్రడెకనొయిక్ (tetradecanoic) ఆసిడు అనియు, 16 కార్బనులున్న పామిటిక్ ఆసిడును హెక్సాడెకనొయిక్ (hexadecanoic) ఆసిడ్ అనియు, మరి 18 కార్బనులు వున్న ఒలిక్`ఆసిడ్ ను ఆక్టాడెకనొయిక్ (octade canoic) ఆసిడ్ అని పిలుస్తారు. పైన పెర్కొన్న ఆసిడ్ లన్ని సంతృప్త ఫ్యాటి ఆసిడులు. అసంతృప్త ఫ్యాటిఆమ్లములు అయినచో ఏకద్విబంధమువున్న ఒలిక్ ఆసిడ్ ను అక్టాడెకెనొయిక్ (octadecenoic) అనియు, రెండు ద్విబంధములున్న లోనొలిక్ ఆసిడ్ ను అక్టడెకడైనొయిక్ (octadecadienoic) ఆసిడ్ అనియు, మూడు ద్విబంధాలున్న లినొలెనిక్ ఆసిడును ఆక్టాడెక ట్రయినొయిక్ (octadecatrienoic) అని పిలుస్తారు[9].

అసంతృప్త కొవ్వు ఆమ్లాలుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

సంతృప్త కొవ్వు ఆమ్లాలుసవరించు

ఆవశ్యక కొవ్వు ఆమ్లాలుసవరించు

మూలాలుసవరించు