ఫ్లూ వైరస్ (లక్ష రెట్లు పెంచి చూపిన బొమ్మ)

ఫ్లూ లేక ఇన్‌ఫ్లుయోంజా

మార్చు

ఇది ఒక వైరస్ వల్ల కలిగే జబ్బు . దీనివల్ల ప్రాణ హాని కలుగదు కాని రకరకాల వ్యాధులకు ఇది దారి తీయవచ్చు. ఇది పూర్తిగా అంటువ్యాధి. ఇన్‌ఫ్లుయోంజా క్రిములు శరీరంలోకి ప్రవేశించి రెండు మూడు రోజులలోనే అపరిమితంగా వృద్ధిపొందుతాయి. ఆ క్రిములు వెలిగ్రక్కే విషం శరీరంలో హెచ్చు తుంది. అందువల్ల శరీరావయవాలన్నీ క్రుంగిపోతాయి.

వ్యాధి లక్షణాలు

మార్చు

వ్యాధి క్రిములు శరీరంలో ప్రవేశించిన రెండు, మూడు రోజులలో జ్వరం వస్తుంది. కాళ్ళు చేతులు, గొంతు, రొమ్ము ... శరీరం అంతటా నొప్పులు ఉంటాయి. దగ్గినప్పుడు నొప్పి ఉంటుంది. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. దగ్గినప్పుడు కళ్లె తెగిపడదు. నాలుగైదు రోజుల తర్వాత క్రమంగా వ్యాధి తగ్గుముఖం పడుతుంది.

Be care full

చికిత్స

మార్చు

పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఒళ్ళు నొప్పులూ, తల నొప్పి తగ్గడానికి వైద్యుని సలహామేరకు మందులువాడలి. శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి కాబట్టి విటమిన్ సి వాడితే మంచిది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి, ఆ ఉప్పు నీటితో పుక్కిలించవచ్చు. మరుగుతున్న నీటిలో టించర్ అయోడిన్ కలిపి ఆవిరిపట్టడం మంచిది. ఆ ఆవిరిని పీల్చడంవల్ల బాధ తగ్గుతుంది. నీలగిరి తైలం ( యూకలిప్ట్‌స్ ఆయిల్) వాడవచ్చు.

వ్యాధి నిరోధక మార్గాలు

మార్చు

ఈ వ్యాధితో బాధపడుతున్న రోగి తుమ్మినప్పుడు ఆ రోగక్రిములు గాలిలో ప్రవేశించి ఆ గాలి పీల్చినవాళ్ళందరికీ ఈ వ్యాధి సోకుతుంది. గొంతులోనుంచి, ముక్కులోనుంచి వెలువడే స్రావంలో సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి. కనుక మాట్లాడేటప్పుడు జేబు రుమాలు నోటికి అడ్డంగా పెట్టుకోవడం చాలా అవసరం. రోగస్థులు ఎక్కడపడితే అక్కడ ముక్కు చీదడం, ఉమ్మివేయడం లాంటి దురలవాట్లు మానుకోవాలి.

మందులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఫ్లూ&oldid=4360176" నుండి వెలికితీశారు