బంగారు బొమ్మలు

బంగారు బొమ్మలు 1977 లో వచ్చిన సినిమా. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో విబి రాజేంద్ర ప్రసాద్ [1] నిర్మించి దర్శకత్వం వహించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, మంజుల ప్రధాన పాత్రలలో నటించారు.[3] కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[4]

బంగారు బొమ్మలు
(1977 తెలుగు సినిమా)
Bangaru Bommalu.jpg
దర్శకత్వం వి.బి.రాజేంద్రప్రసాద్
నిర్మాణం వి.బి.రాజేంద్రప్రసాద్
కథ వి.బి.రాజేంద్రప్రసాద్
చిత్రానువాదం వి.బి.రాజేంద్రప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
మంజుల (నటి)
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
ఛాయాగ్రహణం ఎస్. వెంకటరత్నం
కూర్పు ఎ. సంజీవి
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

కథసవరించు

గోపి (అక్కినేని నాగేశ్వరరావు) తన గత జీవితం వెంటాడుతోంది. అతను ఒక ధనవంతుడి కుమార్తె అయిన రాణి (మంజుల) ని ప్రేమించి వేధించడం ప్రారంభిస్తాడు. గోపి ఆమెను చూసిన ప్రతిసారీ ఆమెను "రాధా" అని పిలుస్తూ ఉంటాడు. కొంతకాలం తర్వాత, రాణి గోపితో కలిసి ఒక గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అక్కడ వారి గతాన్ని వెల్లడిస్తానని అతడు ఆమెకు వాగ్దానం చేస్తాడు. ఆమె జ్ఞాపకాలు తిరిగి వస్తాయని, ఆమె ప్రతిదీ గుర్తుకొస్తుందనీ చెబుతాడు. ఇక్కడ, గోపి ఆమెకు వారి గతజన్మ ప్రేమ కథను చెబుతాడు.

గోపి ఒక జమీందారు (సత్యనారాయణ) కుమారుడు. అతను తన ప్రెస్టీజి గురించి చాలా పట్టింపుగా ఉంటాడు. రాధ ఆ ఇంట్లో పనిచేసే ఒక సాధారణ పనిమనిషి. గోపి, రాధ ప్రేమలో పడతారు. కానీ గోపి తండ్రి వారి ప్రేమ‌కు పూర్తిగా వ్యతిరేకం. చివరికి గోపిని తండ్రి ఇంట్లో నుండి తరిమివేస్తాడు. అతను రాధతో పాటు ఒక చిన్న గుడిసెలో నివసించడం ప్రారంభిస్తాడు. వారు భూస్వామి నుండి చాలా సమస్యలను ఎదుర్కొంటారు. వారు అన్ని అడ్డంకులనూ అధిగమిస్తారు. గోపి రాధలకు ఏమి జరుగుతుంది అనేది మిగతా కథ

తారాగణంసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

పాటలుసవరించు

ఆచార్య ఆత్రేయ రాసిన పాటలకు కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చాడు. SEA రికార్డ్స్ ఆడియో కంపెనీ ఈ పాటలను విడుదల చేసింది.[5]

ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "అయ్యయ్యో బంగారు బాబు" ఎస్పీ బాలు, పి.సుశీల 6:15
2 "ఆ సుబ్బయ్య సూరయ్య" ఎస్పీ బాలు 4:10
3 "నేను నేనుగా" ఎస్పీ బాలు, పి.సుశీల 5:03
4 "ఇధి పొగరుబోతు" ఎస్పీ బాలు, పి.సుశీల 4:42
5 "నేనీ దరినీ నువ్వా దరినీ" ఎస్పీ బాలు, పి.సుశీల 4:17

మూలాలుసవరించు

  1. "Bangaru Bommalu (Direction)". Spicy Onion.
  2. "Bangaru Bommalu (Banner)". Know Youfilms.
  3. "Bangaru Bommalu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2017-12-29. Retrieved 2020-08-24.
  4. "Bangaru Bommalu (Review)". Filmiclub.
  5. "Bangaru Bommalu (Songs)". Cineradham. Archived from the original on 2018-09-19. Retrieved 2020-08-24.