బండి రవీందర్‌ వరంగల్‌జిల్లాకు చెందిన సీనియర్‌ జర్నలిస్టు, హెచ్‌ఎంటివి రీజినల్‌ కోఆర్డినేటర్‌.[1] తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నరు.[2]

జీవిత విశేషాలు మార్చు

రవీందర్ వరంగల్ జిల్లా చిట్యాల మండలం బావుసింగ్ పల్లిలో ఆగస్టు 3 1976 న జన్మించారు. ఆయన విశాలాంద్ర దినపత్రికలో తన జర్నలిస్టు కెరీర్ 1996 ను ప్రారంభించారు.తరువాత ఆయన అంచెలంచెలుగా ఎదిగి హన్మకొండలో స్టాఫ్ రిపోర్టరుగా పనిచేసారు. ఆయన ఆంధ్రజ్యోతి దినపత్రిక, న్యూస్ ఛానెల్(టి.వి.9) లో కూడా పనిచేసి హెచ్.ఎం.టి.వి రీజనల్ కోఆర్డినేటరుగా కూడా పనిచేసారు. హన్స్ ఇండియా పత్రికకు శాఖ్యా మేనేజరుగా కూడా పనిచేసారు. ఆయన వ్యక్తిత్యం ఈ తరం జర్నలిస్టుకకు మార్గదర్శకంగా నిలుస్తుంది.ఈయన నిబద్ధత గల పాత్రికేయుడు. ఆయన తెలంగాణా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఆయన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కు సభ్యునిగా కూడా ఉన్నారు. డిసెబరు 2013 న "కాకతీయ వంశ రహస్యం" అనే పుస్తకాన్ని ప్రచురించారు.

మరణం మార్చు

ఆయనకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధి ఉందని తేలడంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించుకుని హన్మకొండ బాలసముద్రంలోని తన ఇంటి వద్దే గత 10రోజులుగా ఉంటున్న బండి రవీందర్‌కు మే 1 2014 గురువారం ఉదయం అకస్మాత్తు గా పల్స్‌ పడిపోయి శ్వాస ఆగిపోవడంతో హుటాహుటిన సమీపం లోని లైఫ్‌లైన్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో డాక్టర్లు చికిత్స నిర్వహించినా ఫలితం లేకపోవడంతో మృతిచెందారు.[3] బండి రవీందర్‌కు భార్య(చంద్రకళ), ఇద్దరు కుమారులు(అఖిల్, నిఖిల్) ఉన్నారు.

మూలాలు మార్చు

  1. సీనియర్‌ జర్నలిస్టు బండి రవీందర్‌ ఆకస్మిక మృతి[permanent dead link]
  2. "జర్నలిస్ట్‌ బండి రవీందర్‌ ఇకలేరు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-02.
  3. Senior HMTV journalist Bandi Ravinder passes away

ఇతర లింకులు మార్చు