బండ ప్రకాష్
బండ ప్రకాష్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16 నవంబర్ 2021న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. బండ ప్రకాష్ ఈ పదవిలో 01 డిసెంబర్ 2021 నుండి 30 నవంబర్ 2027 వరకు కొనసాగుతాడు.[2] ఆయన తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నాడు.
బండ ప్రకాష్ ముదిరాజ్ | |||
| |||
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 ఫిబ్రవరి 2023 - ప్రస్తుతం | |||
ఎమ్మెల్సీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 01 డిసెంబర్ 2021 నుండి 30 నవంబర్ 2027 | |||
ముందు | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, భారత జాతీయ కాంగ్రెస్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 3 ఏప్రిల్ 2018 - 04 డిసెంబర్ 2021 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ | 1954 అక్టోబరు 18||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | సత్యనారాయణ, శకుంతల | ||
జీవిత భాగస్వామి | అనిత | ||
సంతానం | 1 కుమార్తె |
జననం
మార్చుడా.బండ ప్రకాష్ 18-02-1954 న వరంగల్ లో సత్యనారాయణ, శాకుంతల దంపతులకు జన్మించాడు.ఆయన కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ నుండి 1996లో పి.హెచ్.డి పట్టా పొందాడు. ఆయన భార్య పేరు అనిత, ఆమె వృత్తిరీత్యా టీచర్, సామాజిక కార్యకర్తగా పనిచేస్తుంది.
రాజకీయ జీవితం
మార్చుబండ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి1981 నుండి 1986 వరకు వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశాడు. ఆయన 1981 నుండి 1984 వరకు వరంగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన 1981 నుండి 1986వరకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) పాలకమండలి సభ్యుడిగా ఉన్నాడు. ఆయన 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[3]
బండ ప్రకాష్ 2018లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచాడు. ఈ ఎన్నికలో బండా ప్రకాశ్‌కు అత్యధికంగా 33 ఓట్లు పోలయ్యాయి. ఆయన 2018 మార్చి 23న తెరాస తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[4] [5]బండ ప్రకాష్, 2018-2019 వరకు ప్రాచీన స్మారక కట్టడాలుపై రాజ్యసభలో సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. 2019లో రాజ్యసభలో కార్మిక చట్టాలు & సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. 2019 జూన్లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో రాజ్యసభలో టిఆర్‌ఎస్ పక్ష ఉపనాయకుడిగా బండ ప్రకాష్ నియమితులయ్యాడు.[6][7]
బండ ప్రకాష్ తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16 నవంబర్ 2021న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికై[8], శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి అయన పేరును 2023 ఫిబ్రవరి10న ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశాడు.[9][10]
రాజ్యసభలో లేవనెత్తిన పలు అంశాలు
మార్చుజులై 2019లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నాత్తరాల సమయంలో విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలో నూతన విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
2020 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మేడారం అభివృద్ధికి కేంద్రం రూ.1000 కోట్లు కేటాయించాలని, మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మూలాలు
మార్చు- ↑ Sakshi (11 April 2018). "ఉద్యమ నాయకుడు : బండా ప్రకాష్". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
- ↑ TNews Telugu (1 December 2021). "'ఎమ్మెల్యే కోటా' ఎమ్మెల్సీల పదవీకాలం షురూ". Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.
- ↑ Sakshi (10 October 2017). "67 మందితో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ ETV Bharat News (17 November 2021). "ఇదే తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రస్థానం". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
- ↑ సాక్షి, జనగాం / జయశంకర్ / మహబూబాబాద్ / వరంగల్ / వరంగల్ రూరల్ (24 March 2018). "బండా ప్రకాష్ @ఎంపీ". Sakshi. Archived from the original on 6 April 2021. Retrieved 6 April 2021.
- ↑ మన తెలంగాణ (14 June 2019). "టిఆర్‌ఎస్ పిపి నేతగా కెకె". Telangana తాజా వార్తలు. Archived from the original on 6 April 2021. Retrieved 6 April 2021.
- ↑ Hindustantimes Telugu (12 February 2023). "డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాశ్ ఎన్నిక". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
- ↑ Andhrajyothy (22 November 2021). "తెలంగాణ: ఆ ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
- ↑ V6 Velugu (10 February 2023). "డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్ పేరు ఖరారు". Archived from the original on 11 February 2023. Retrieved 11 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ HMTV (12 February 2023). "మండలి వైస్ చైర్మన్‌గా బండా ప్రకాశ్ ఏకగ్రీవ ఎన్నిక". Archived from the original on 16 February 2023. Retrieved 16 February 2023.