బఖ్తియార్ ఖల్జీ టిబెట్ దండయాత్ర
13వ శతాబ్దంలో కుతుబుద్దీన్ ఐబక్ సైన్యాధ్యక్షుడైన బఖ్తియార్ ఖల్జీ టిబెట్‌ను ఆక్రమించుకునేందుకు దండయాత్ర చేసాడు.[2][3]
బఖ్తియార్ ఖల్జీ టిబెట్ దండయాత్ర | |||||||
---|---|---|---|---|---|---|---|
ఖల్జీ సైన్యం టిబెట్‌పై చేసిన దండయాత్రలో గట్టి వ్యతిరేకతను, ఎదురుదాడినీ ఎదుర్కొన్నాడు. | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
ఖల్జీ వంశం దేశీ ముస్లిములు | టిబెట్ తెగలు | ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
* బఖ్తియార్ ఖల్జీ | టిబెట్ తెగల నాయకులు | ||||||
బలం | |||||||
10,000 (సుమారు.)[1] | తెలియదు | ||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
కొన్ని వేలు; కొన్ని వందల మంది సైనికులు మాత్రమే మిగిలారు | తెలియదు, కానీ బఖ్తియార్ సైన్యం కంటే తక్కువే |
టిబెట్, భారతదేశాల మధ్య జరిగే లాభదాయకమైన వాణిజ్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే కోరిక అతన్ని ఈ దండయాత్రకు ప్రేరేపించింది. సైన్యాలకు అత్యంత విలువైన గుర్రాలు టిబెట్‌లో లభిస్తాయి. టిబెట్‌ను జయించి, ఈ గుర్రాల వాణిజ్యాన్ని నియంత్రించాలని ఖల్జీ ఆశించాడు. ముసల్మాన్ సైన్యం టిబెట్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలను దోచుకోవడం ప్రారంభించింది. అక్కడి ప్రజలు ముస్లిం సైన్యాన్ని తిప్పికొట్టడానికి ముందుకు వచ్చి, వారితో తలపడ్డారు. తెల్లవారుజాము నుండి సాయంత్రం ప్రార్థన సమయం వరకు జరిగిన భీకర యుద్ధంలో పెద్ద సంఖ్యలో ముసల్మాన్ సైనికులు మరణించారు, గాయపడ్డారు.[4]
నేపథ్యం
మార్చుకుతుబుద్దీన్ ఐబక్ సైన్యాధిపతి బఖ్తియార్ ఖల్జీ, బీహార్‌ను, బెంగాల్లో సేన వంశ పాలకుల రాజధాని నదియాను స్వాధీనం చేసుకున్నాడు.[3] అతను తరువాత టిబెట్‌ను జయించాలని ఆశపడ్డాడు. చారిత్రికంగా, బెంగాల్‌కు టిబెట్‌తో 'టీ-హార్స్ రూట్' లో వాణిజ్య సంబంధాలున్నాయి. ఇది అస్సాం, సిక్కిం, భూటాన్ గుండా చైనా, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలకు వెళ్ళే వాణిజ్య మార్గం. పై ప్రాంతాలు బంగారు, వెండి గనులకు నిలయం.[3] టిబెట్‌లో గుర్రాలు లభిస్తాయి.[5] టిబెట్ చరిత్రలో విచ్ఛిన్న యుగం, టిబెట్ సామ్రాజ్య పతనం జరుగుతున్న సమయం లోనే ఈ దండయాత్ర జరిగింది.
ఈ యాత్రలో ఖల్జీకి, బెంగాల్ ఉత్తరాన హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉన్న గిరిజన అధిపతి అలీ మెచ్ సహాయం చేశాడు.[6] అతను కొత్తగా ఇస్లాం మతంలోకి మారాడు. అతను ఖల్జీ సైన్యానికి ప్రయాణంలో మార్గదర్శకుడిగా సహాయం చేశాడు.[7][8]
దండయాత్ర
మార్చుఉత్తర దిశగా చేసిన ప్రయాణంలో ఖల్జీ, కమ్రుద్ (కామ్రూప్) రాయ్‌ను[9] తనతో చేరమని ఆహ్వానించాడు, కాని అతను నిరాకరించాడు. ఉత్తర బెంగాల్, సిక్కింలోని తీస్తా నది గుండా 15 రోజుల పాటు నడిచిన[10] సైన్యం 16వ రోజున టిబెట్‌లోని చుంబీ లోయకు చేరుకుని టిబెటన్ గ్రామాలను దోచుకోవడం ప్రారంభించింది.[10] ఖల్జీ సైన్యానికి కఠినమైన హిమాలయ పర్వత కనుమలు కొత్త. వారు బెంగాల్‌లోని తేమతో కూడిన మైదాన పరిస్థితులకు అలవాటు పడి ఉన్నారు. టిబెటన్లు ఖల్జీ సైన్యాన్ని ఒక ఉచ్చులోకి లాగారు. తురుష్క సైన్యానికి భారీ ప్రాణనష్టం కలిగించారు. ఖల్జీ వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నారు. కానీ, టిబెటన్లు పారిపోతున్న ముసల్మాను సైన్యంపై కనికరం చూపలేదు. గెరిల్లా తరహా దాడులు చేసారు. ఖల్జీ చాలా ఘోరంగా ఓడిపోయాడు. ఆకలితో అలమటిస్తున్న సైనికులు, తమ స్వంత గుర్రాలను చంపుకు తిన్నారు.
బెంగాల్‌కు తిరిగి వెళ్ళేటప్పుడు, ఖల్జీ సైన్యం తీస్తా నదిపై సమీపంలో ఉన్న పురాతన రాతి వంతెనను దాటింది.[10] వంతెనకు ఉన్న ఆర్చీలను కామ్‌రూప్ దళాలు ధ్వంసం చేశాయని ఖల్జీ సైనికులు గమనించారు. దాంతో లోతైన నదిని దాటడం కష్టమైంది. దేవ్‌కోట్ వద్ద నదిని దాటేందుకు చేసిన ప్రయత్నంలో ఖల్జీ సైన్యం అనేక మంది సైనికులను గుర్రాలనూ కోల్పోయింది. టిబెట్‌పైకి దండయాత్రకు 10,000 మంది సైసికులు వెళ్ళగా, తిరిగి వచ్చింది 100 మంది మాత్రమే.[10][9] నదిని దాటిన తర్వాత, అలీ మెచ్, భక్తియార్ ఖిల్జీని తిరిగి దేవ్‌కోట్ (ప్రస్తుత దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్)కి నడిపించాడు. [10]
అనంతర పరిణామాలు
మార్చుటిబెట్, కామ్రూప్ పరాజయాల తర్వాత బఖ్తియార్ ఖల్జీకి ఏమి జరిగిందనే విషయమై రెండు కథనాలు ఉన్నాయి. బెంగాల్‌కు పారిపోయే సమయంలో అనారోగ్యం, గాయాల కారణంగా అతను మరణించినట్లు ఒక కథనం చెబుతోంది.[8] బెంగాల్‌లోని దేవ్‌కోట్‌కు తిరిగి వచ్చిన తర్వాత అలీ మర్దాన్ ఖల్జీని హత్య చేసాడని మరొక కథనం పేర్కొంది.[10]
ఇవి కూడా చూడండి
మార్చు- టిబెట్‌కు బ్రిటిష్ యాత్ర
- రాజా పృథు
మూలాలు
మార్చు- ↑ Debajyoti Burman (1947). Indo-Muslim Relations: A Study in Historical Background. Jugabani Sahitya Chakra. p. 67.
- ↑ Khan, Muhammad Mojlum (21 October 2013). The Muslim Heritage of Bengal: The Lives, Thoughts and Achievements of Great Muslim Scholars, Writers and Reformers of Bangladesh and West Bengal (in ఇంగ్లీష్). Kube Publishing Ltd. p. 19. ISBN 9781847740625. Archived from the original on 22 March 2024. Retrieved 31 July 2021.
- ↑ 3.0 3.1 3.2 Farooqui Salma Ahmed (2011). A Comprehensive History of Medieval India: Twelfth to the Mid-Eighteenth Century. Pearson Education India. p. 53. ISBN 978-81-317-3202-1.
- ↑ H G Raverty (1873). Tabakat I Nasiri. p. 572.
- ↑ P. K. Mishra (1999). Studies in Hindu and Buddhist Art. Abhinav Publications. p. 101. ISBN 978-81-7017-368-7.
- ↑ Siddiq, Mohammad Yusuf (2015). Epigraphy and Islamic Culture: Inscriptions of the Early Muslim Rulers of Bengal (1205–1494). Routledge. p. 36. ISBN 9781317587460. Archived from the original on 22 March 2024. Retrieved 19 November 2016.
- ↑ Siddiq, Mohammad Yusuf (2015). Epigraphy and Islamic Culture: Inscriptions of the Early Muslim Rulers of Bengal (1205–1494). Routledge. p. 36. ISBN 9781317587460. Archived from the original on 22 March 2024. Retrieved 19 November 2016.
- ↑ 8.0 8.1 Nadwi, Abu Bakr Amir-uddin (2004). Tibet and Tibetan Muslims. Translated by Sharma, Parmananda. Dharamsala: Library of Tibetan Works and Archives. pp. 43–44. ISBN 9788186470350. Archived from the original on 22 March 2024. Retrieved 26 September 2020.
- ↑ 9.0 9.1 William John Gill; Henry Yule (9 September 2010). The River of Golden Sand: The Narrative of a Journey Through China and Eastern Tibet to Burmah. Cambridge University Press. p. 43. ISBN 978-1-108-01953-8. Archived from the original on 22 March 2024. Retrieved 20 October 2016.
- ↑ 10.0 10.1 10.2 10.3 10.4 10.5 Nitish K. Sengupta (1 January 2011). Land of Two Rivers: A History of Bengal from the Mahabharata to Mujib. Penguin Books India. pp. 63–64. ISBN 978-0-14-341678-4. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Sengupta2011" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు