దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా

వెస్ట్ బెంగాల్ లోని జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 20 జిల్లాలలో దక్షిణ దినాజ్‌పూర్ (బెంగాలి:দক্ষিণ দিনাজপুর জেলা) ఒకటి. 1992 ఏప్రిల్ 1 పశ్చిమ మదీనాపూర్ లోని విభాగంగా ఉన్న ఈ ప్రాంతానికి జిల్లాహోదా ఇవ్వబడింది. తరువాత ఈ జిల్లా 2 ఉపవిభాగాలుగా (బాలూర్‌ఘాట్, గంగారాంపూర్) విభజించబడింది. 2011 గణాంకాలను అనుసరించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంల్ 20 జిల్లాలలో ఈ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.[2]

Dakshin Dinajpur జిల్లా
দক্ষিণ দিনাজপুর জেলা
పశ్చిమ బెంగాల్ పటంలో Dakshin Dinajpur జిల్లా స్థానం
పశ్చిమ బెంగాల్ పటంలో Dakshin Dinajpur జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రం[[పశ్చిమ బెంగాల్]]
డివిజనుJalpaiguri
ముఖ్య పట్టణంBalurghat
Government
 • లోకసభ నియోజకవర్గాలుBalurghat
 • శాసనసభ నియోజకవర్గాలుKushmandi, Kumarganj, Balurghat, Tapan, Gangarampur, Harirampur
విస్తీర్ణం
 • మొత్తం2,219 కి.మీ2 (857 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం16,70,931
 • జనసాంద్రత750/కి.మీ2 (2,000/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.86 per cent[1]
 • లింగ నిష్పత్తి950
ప్రధాన రహదార్లుNH 34
Websiteఅధికారిక జాలస్థలి
The Atreyee D. A. V. Public School in Balurghat

చరిత్ర

మార్చు

భారతదేశం విభజించబడిన సమయంలో మునుపటి దీనాజ్‌పూర్ జిల్లా పశ్చిమ దినాజ్‌పూర్, తూర్పు దినాజ్‌పూర్ జిల్లాలుగా విభజించబడింది. తూర్పు దీనాజ్‌పూర్‌గా ప్రస్తుతం పిలువబడుతున్న ఈ ప్రాంతం దినాజ్‌పూర్‌గా జిల్లా బంగ్లాదేశ్ తూర్పు పాకిస్థాన్‌లో భాగంగా మారింది. 1956లో " స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ " సిఫారసులకు అనుగుణంగా పశ్చిమ దినాజ్‌పూర్ జిల్లా బీహార్ రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాలను కలుపుకుని విస్తరించబడింది. 1992 ఏప్రిల్ 1 తారీఖున పశ్చిమ దినాజ్‌పూర్ జిల్లా ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలుగా విభజించబడింది. [3][4]

ఆర్ధికం

మార్చు

దక్షిణ దినాజ్‌పూర్ దీర్ఘకాలంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉంది. జిల్లాలో అత్యధిక భూభాగం వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. జిల్లాలో ఆట్రై నది, పునబాబా నది, టంగన్ నది, బ్రహ్మణి నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి పుష్కలమైన పంటను, చేపలను అందిస్తున్నాయి. జిల్లాలో బృహాత్తరమైన పరిశ్రమలు ఏవీ లేవు. కనుక ఇది పరిశ్రమ రహిత జిల్లాగా గుర్తించబడుతుంది. 2003 నవంబరు మాసంలో జిల్లాలో మొదటి మద్యతరహా పరిశ్రమ ప్రారంభం అయింది. బ్రాడ్ బాండ్ కనెక్షన్లు లేనప్పటికి పలు నగరాలలో ఇంటర్నెట్ లభిస్తుంది. ప్రయాణసదుపాయంగా జిల్లాలో రాష్ట్రీయ రహదారి (3కి.మీ పొడవు) ఒకటి, జాతీయరహదారి 34 ఉన్నాయి. బలూర్ఘాట్, ఎక్లఖి మద్య నూతనంగా రైలు మార్గం నిర్మించబడంది. 2004 డిసెంబరు 30 నుండి రైలు సేవలు లభిస్తున్నాయి.

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా ఒకటి [5] అని గుర్తించింది. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[5]

  
  
 

విభాగాలు

మార్చు

ఉపవిభాగాలు

మార్చు

జిల్లా 2 ఉపవిభాగాలుగా ( బాలూర్ఘాట్, గంగారాంపూర్) విభజించబడి ఉంది. బాలూర్ఘాట్ విభాగంలో 1 పురపాలకం, 4 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు (హిలి,బాలూర్ఘాట్, కుమర్గంజ్, తపన్) ఉన్నాయి.

  • గంగారాంపూర్ ఉపవిభాగంలో గంగారాంపూర్ పురపాలకం, 4 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు (గంగారాంపూర్, బంషీహరి, హరిరాంపూర్, కుష్మండి) ఉన్నాయి.

[6] జిల్లా కేంద్రంగా బాలూర్ఘాట్ ఉంది. జిల్లాలో 8 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. [7] జిల్లాలో 8 డెవెలెప్మెంటు బ్లాకులు, 2 పురపాలకాలు, 65 గ్రామపంచాయితీలు, 2317 గ్రామాలు ఉన్నాయి. [6][8] ఒక్కో ఉపవిభాగంలో పురపాలకం కాక అదనంగా కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకు ఉంది. కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకును గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలుగా విభజించబడ్డాయి. [9] మొత్తంగా జిల్లాలో 2 నగరప్రాంతాలు ( చక్ భ్రిగు), బైదినాథ్పర) ఉన్నాయి. ఇవి 2001 2 పురపాలకాకుగా చేయబడ్డాయి.

  • బాలూర్ఘాట్ : మున్సిపాలిటీ
  • హిల్స్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) కేవలం 5 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • బాలూర్ఘాట్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) మాత్రమే 11 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి. .
  • కుమర్గంజ్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) కేవలం 8 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • తపన్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) మాత్రమే 11 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.

గంగారాంపూర్ ఉపవిభాగం

మార్చు
  • గంగారాంపూర్ : మున్సిపాలిటీ
  • గంగారాంపూర్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) 11 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • బంసిహరి (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) 5 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • హరిరాంపూర్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) 6 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • కుష్మంది (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) 8 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు

జిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి: [10]

  1. కుష్మండి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (శాసనసభ నియోజకవర్గం ఏ 33.),
  2. గంగారాంపూర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 35),
  3. తపన్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (. శాసనసభ నియోజకవర్గం 36),
  4. కుమర్గంజ్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 37),
  5. బాలూర్ఘాట్ (విధాన సభ నియోజకవర్గం) (శాసనసభ నియోజకవర్గం ఏ 38.),

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు

మార్చు
  • షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు :- తపన్ నియోజకవర్గం.
  • కుష్మండి నియోజకవర్గం.
  • బాలూర్ పార్లమెంటరీ నియోజకవర్గం :- ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా నుండి ఒక శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి బాలూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి 6 శాసనసభ నియోజకవర్గాలు.

నియోజకవర్గ పునర్విభజన తరువాత

మార్చు

" డిలిమినేషన్ కమీషన్ " ఆదేశానుసారం జిల్లా 6 శాసనసభ నియోజకవర్గాలుగా విభజించబడడింది :[11]

  1. కుష్మండి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (శాసనసభ నియోజకవర్గం ఏ 37.),
  2. కుమర్గంజ్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 38),
  3. బాలూఘాట్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 39),
  4. తపన్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 40),
  5. గంగారాంపూర్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 41),
  6. హరిరాంపూర్ (విధాన సభ నియోజకవర్గం) (శాసనసభ నియోజకవర్గం ఏ 42.).

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు

మార్చు
  • షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు :- తపన్, కుష్మండి, గంగారాంపూర్ నియోజకవర్గాలు.
  • బాలూర్ఘాట్ పార్లమెంటరీ నియోజకవర్గం :- ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా నుండి ఒక శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి. బాలూర్‌ఘాట్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి 6 శాసనసభ నియోజక వర్గాలు.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,670,931 వీరిలో ముస్లిములు 24.01%,[2]
ఇది దాదాపు. గునియా బిసౌ దేశ జనసంఖ్యకు సమానం.[12]
అమెరికాలోని. ఇడహో నగర జనసంఖ్యకు సమం.[13]
640 భారతదేశ జిల్లాలలో. 295వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 553 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.16%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 954 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.86%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు

మార్చు

జిల్లాలో బెంగాలీ బాధ ప్రధానంగా ఉంది. ప్రజలలో అత్యధికంగా హిందువులు, ముస్లిములు ఉన్నారు.

విద్య

మార్చు

జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజి ఒకటి ఉంది అయినప్పటికీ మెడికల్ కాలేజి మాత్రం లేదు. బలూర్ఘాట్, గంగారాంపూర్ వద్ద మంచి స్కూల్స్ ఉన్నాయి. జిల్లా అంతటా పలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. బాలూర్ఘాట్ వద్ద బాలికలకు ప్రత్యేకగా ప్రభుత్వ నిధి సహాయ కళాశాల, లా కాలేజ్, బి.ఇ.డి కాలేజ్ ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. "Uttar Dinajpur Website". Government of India Portal. Retrieved 2008-11-10.
  4. "Historical Perspective". Official website of South Dinajpur district from Government of India Portal. Archived from the original on 2008-04-16. Retrieved 2008-11-10.
  5. 5.0 5.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. 6.0 6.1 "Directory of District, Sub division, Panchayat Samiti/ Block and Gram Panchayats in West Bengal, March 2008". West Bengal. National Informatics Centre, India. 2008-03-19. Archived from the original on 2009-02-25. Retrieved 2008-11-08.
  7. "Census of India 2001, Final Population Totals, West Bengal, Rural Frame". West Bengal. Directorate of census operations. Retrieved 2008-11-09.
  8. "District Profile". Official website of the South Dinajpur district. Archived from the original on 2009-02-02. Retrieved 2008-11-09.
  9. "Population, Decadal Growth Rate, Density and General Sex Ratio by Residence and Sex, West Bengal/ District/ Sub District, 1991 and 2001". West Bengal. Directorate of census operations. Retrieved 2008-11-09.
  10. "General election to the Legislative Assembly, 2001 – List of Parliamentary and Assembly Constituencies" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2008-11-18.
  11. "Press Note, Delimitation Commission" (PDF). Assembly Constituencies in West Bengal. Delimitation Commission. Retrieved 2008-11-18.
  12. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  13. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Idaho 1,567,582

వెలుపలి లింకులు

మార్చు