బజార్‌హత్నూర్ మండలం
బజార్‌హత్నూర్ మండలం , తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] బజార్‌హత్నూర్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలం మొత్తం 31 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.
బజార్‌హథ్నూర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, బజార్‌హథ్నూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°25′05″N 78°16′19″E / 19.41803°N 78.27198°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | బజార్‌హథ్నూర్ |
గ్రామాలు | 28 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 28,911 |
- పురుషులు | 14,546 |
- స్త్రీలు | 14,365 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.78% |
- పురుషులు | 70.48% |
- స్త్రీలు | 38.43% |
పిన్‌కోడ్ | 504304 |
గణాంక వివరాలు
మార్చు2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 28,911 - పురుషులు 14,546 - స్త్రీలు 14,365. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 252 చ.కి.మీ. కాగా, జనాభా 28,911. జనాభాలో పురుషులు 14,546 కాగా, స్త్రీల సంఖ్య 14,365. మండలంలో 6,195 గృహాలున్నాయి.
వ్యవసాయం, పంటలు
మార్చుబజార్ హథ్నూర్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10887 హెక్టార్లు, రబీలో 412 హెక్టార్లు. ప్రధాన పంటలు, జొన్నలు, ప్రత్తి.<soya bean's>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 67</ref>
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుగమనిక:నిర్జన గ్రామాలు 3 పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.