బట్టమేక పిట్ట
బట్టమేక పిట్ట ప్రధాన స్థావరం నంద్యాల జిల్లాలోని రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈరకం పక్షులు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 150 మాత్రమే ఉన్నాయి. గతంలో ఈ సంఖ్యగా అధికంగా వుండేదని, అయితే వేటగాళ్ల ఉచ్చులకు బలై వాటిసంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. 1979లో బాంబేరిసెర్చ్ వారు పరిశోధించి బట్టమేక పక్షి ప్రాధాన్యతను గుర్తించారు. ప్రముఖ పక్షి శాస్తవ్రేత్త, నోబుల్ అవార్డు గ్రహిత సలీంఅలీ 1980లో రోళ్లపాడు వద్ద బట్టమేక పక్షిని సంరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. 1988లో ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించి 600 హెక్టారుల భూమిని దీని కొరకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అలగనూరు గ్రామంవద్ద ఉన్న సుంకేసుల సమీపంలో 800 ఎకరాల భూమిని కేటాయించి వాటి సంరక్షణకు సిబ్బందిని నియమించారు.
బట్టమేక పిట్ట Great Indian bustard | |
---|---|
At Naliya grasslands, Kutch, India | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | A. nigriceps
|
Binomial name | |
Ardeotis nigriceps (Vigors, 1831)
| |
Points where the species has been recorded. Once widespread, the species is today found mainly in central and western India. | |
Synonyms | |
Choriotis nigriceps |
లక్షణాలు
మార్చుబట్టమేకపిట్ట పక్షి ఒక మీటరు పొడవు, సుమారు 15 నుండి 20 కిలోల బరువు ఉండి, పొడవాటి మెడకలిగి వుంటుంది. వీటిసంతతి చాలా అరుదుగా వృద్ధిచెందుతూ కేవలం ఏడాదికి ఒక గుడ్డు మాత్రమేపెట్టి దట్టమైన పొదల్లో 27 రోజుల పొదుగు తుంది. బట్టమేకపిట్ట మనుషుల పొలుపులేని ఏకాంత వ్యవసాయయోగ్యమైన పొలాల్లో, బీళ్ళల్లో నివాసం ఉంటుంది. దీని జీవితకాలం షుమారు 12 సంవత్సరాలు. బట్టమేకపిట్ట పక్షులు రైతులకు ఉపయోగకరంగా వుంటు పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను తిని, పంటలను సంరక్షిస్తుంటాయి. ఒంటరి పక్షులు బీళ్ళల్లో, కొన్నిసార్లు చెల్లాచెదురుగా అక్కడక్కడా 20లేదా 30పక్షుల గుంపు మేస్తూ కనిపిస్తాయి. ధాన్యపుగింజలు, వివిధ పంటలకోత తర్వాత మిగిలిన మోములు, వేళ్ళు, పొలాల్లో మిడతలు, పురుగులు, జెర్రులు, బల్లులు, తొండలువగైరా వీటి ఆహారం. ఈ పక్షులు చాలా హుందాగా పరిగెత్తి గాలిలోకిలేచి, స్థిమితంగా, లయబద్ధంగా విశాలమైన రెక్కలు కదుల్చుతూ గగనవిహారం చేస్తాయి.
మగపక్షి ఆడపక్షి జతకట్టి సంచరించడం వంటివి లేవు. మొగది దొరికిన ఆడపక్షితో కలుస్తుంది. భూమిలో కాస్త గుంటగా ఉన్న చోట ఆడపక్షి గుడ్డుపెట్టి ఒంటరిగానే పొదుగుతుంది. సాధారణంగా మార్చి సెప్టెంబరు మధ్యకాలంలో గుడ్డు పెడుతుంది, ఒకే అండం, అరుదుగా రెండు గుడ్లు పెట్టవచ్చు.
విస్తరణ
మార్చుబట్టమేక పక్షిజాతి అంతరించి పోతున్నదని గ్రహించక మాంసంకోసం వేటగాళ్ళు వలలుపన్ని సులభంగా వేటాడి నిర్మూలించడంవల్ల, ఈ పక్షులు ఎగిరే దారుల్లో విద్యుత్ టవర్లు, తీగలు, గాలిమరలు, అంతటా విస్తరించడంవల్ల, వీటి నివాస ప్రదేశాలను అడవులు, బీడుభూములు వ్వవసాయ క్షేత్రాలుగా మార్చడం వంటి కారణాలవల్ల గత 50 ఏళ్లలో వీటి సంఖ్య గణనీయంగా క్షీణించి, ఇప్పుడు దేశంలోని అభయక్షేత్రాలలో 150 పక్షులు మాత్రమే మిగిలాయి.
ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ బర్డ్ ప్రిసర్వేషన్ సంస్థ 1960 లో, టోకియోలో జరిపిన సమావేశంలో ప్రతిదేశం ఒక జాతీయ పక్షిని ఎంపిక చేసుకోవాలని చేసిన సూచనకు సలీమ్అలి మనదేశ పక్షిగా బట్టమేక పిట్టపేరు ప్రతిపాదించారు. బస్టర్డ్ ను బేస్టర్డ్ గా పలుకుతారని, మరేవో కుంటిసాకులను చూపి నెమలిని మన జాతీయ పక్షిగా ఎంపిక చేశారు.
బట్టమేకపిట్ట పూర్వం పశ్చిమబెంగాల్, ఈశాన్య భారతంలో తప్ప. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మొదలయిన 12 రాష్ట్రాల్లో కనబడేవని తెలిసింది. ఈ పక్షిజాతి విస్తృతమైనది; ఇందులో కొన్ని ఉపజాతులు ఉన్నాయి.
విశేషాలు
మార్చు- ఇది రాజస్థాన్ రాష్ట్రపక్షి
చిత్రమాలిక
మార్చు-
ఎడారి జాతీయ ఉద్యానవనం
-
స్టువర్ట్ బేకర్స్ గేమ్-బర్డ్స్ ఆఫ్ ఇండియా
-
మైలాబ్రిస్ పుస్తులాటా, ఆహారంలో బీటిల్స్ ఒకటి
-
థామస్ హార్డ్విక్స్ ఇలస్ట్రేషన్స్ ఆఫ్ ఇండియన్ జువాలజీ నుండి (1830–1835)
-
తక్కువ ఫ్లోరికాన్ చిన్న వాటితో పోల్చితే జాతుల గుడ్లు
మూలాలు
మార్చు- ↑ BirdLife International (2013). "Ardeotis nigriceps". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.