నంద్యాల జిల్లా
నంద్యాల జిల్లా ఇది ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022లో భాగంగా పాత కర్నూలు జిల్లాలో కొంత భూభాగంతో కొత్తగా ఏర్పడిన జిల్లా.[1] జిల్లా కేంద్రం నంద్యాల. జిల్లాలో ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన, ప్రపంచంలోకెల్లా పెద్దదైన, వన్యమృగ సంరక్షణ కేంద్రం (శ్రీశైలం - నాగార్జునసాగర్) ఉంది. శ్రీశైల క్షేత్రం, మంత్రాలయం, మహానంది అహోబిలం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు. కృష్ణా నదిపై ఇక్కడ నిర్మించబడ్డ శ్రీశైలం ఆనకట్ట దేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. లక్షలాది ఎకరాలకు నీరందించడమే కాక, విద్యుదుత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ప్రధాన వనరుగా ఉంది. చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు నదులు నంద్యాల జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు. నల్లమల కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. Map
నంద్యాల జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
జిల్లా | |||||||
Coordinates: 15°30′N 78°30′E / 15.5°N 78.5°E | |||||||
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ | ||||||
కేంద్రం | నంద్యాల | ||||||
పరిపాలన విభాగాలు |
| ||||||
Government | |||||||
• జిల్లా కలెక్టరు | Dr. కే.శ్రీనివాసులు | ||||||
విస్తీర్ణం | |||||||
• మొత్తం | 9,154 కి.మీ2 (3,534 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• మొత్తం | 16,87,541 | ||||||
• జనసాంద్రత | 180/కి.మీ2 (480/చ. మై.) | ||||||
Time zone | UTC+5:30 (IST) |
పేరు వ్యుత్పత్తి
మార్చునంద్యాల అనే పేరు "నంది ఆలయం" అనే పదం నుండి వచ్చింది. ఇక్కడా తొమ్మిది నంది దేవాలయాలు ఉన్నాయి, వాటి ఆధారం గా నవ నందుల నంద్యాల గా పేరు వచ్చింది , కృష్ణ దేవ రాయలు కాలం నుండి ఈ దేవాలయాలకు ప్రాముఖ్యత ఉంది.
చరిత్ర
మార్చుపూర్వం 14వ శతాబ్దంలో నందనమాహరాజు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చుట్టు నవ నందులని నిర్మించాక ఈ స్థలానికి "నంది ఆలయం" అను పేరు వచ్చింది. కాళక్రమమైన ఈ స్థలానికి "నంద్యాల" అను వచ్చింది. జిల్లా పాత కర్నూలు జిల్లా నుండి ఏర్పడినందున కర్నూలు జిల్లా చరిత్రే దీనికి ఆధారం.
భౌగోళిక స్వరూపం
మార్చునంద్యాల జిల్లా 15° 27' 49 ఉత్తర అక్షాంశాలు, 78° 28' 43 తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. జిల్లా సగటు ఎత్తు సముద్ర మట్టంపై 100 అడుగులు. ఈ జిల్లాకు ఉత్తరాన కృష్ణా నది, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో వైఎస్‌ఆర్, అనంతపురం జిల్లాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా, తూర్పున ప్రకాశం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా కేంద్రం నంద్యాల నుండి రాష్ట్ర రాజధాని అమరావతి 260 కి.మీ. దూరంలో ఉంది.[2]
ఖనిజాలు
మార్చుబేతంచెర్ల ప్రాంతంలో సున్నపు రాయి విరివిగా లభిస్తుంది.
పశుపక్ష్యాదులు
మార్చుజిల్లాలోని రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంతరించిపోతున్న బట్టమేక పక్షులకు ఆవాసము.
జనాభా గణాంకాలు
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 17.818 లక్షలు,, విస్తీర్ణం 9682 చ.కి. కి.మీ.ఉంది.
వాతావరణం
మార్చుజిల్లా వాతావరణం సాధారణంగా ఆరోగ్యకరమైనది. వర్షపాతం చాలా అరుదు, భారీ మంచుతో గాలి తేలికగా ఉంటుంది. సంవత్సరం జిల్లా సాధారణ వర్షపాతం 724.9 మి.మీ. 2019-20లో 784.1 మి.మీ వర్షపాతం నమోదైంది.[3]
నదులు
మార్చుజిల్లా ప్రధాన నదులు కృష్ణ, కుందేరు. కుముద్వతి అని కూడా పిలువబడే కుందేరు ఎర్రమలస్‌కు పశ్చిమాన పుంజుకుని కుందేరు లోయలోకి దూసుకెళ్లి దక్షిణ దిశలో ప్రవహిస్తుంది. ఇది మిడ్తూరు, గడివేముల, నంద్యాల, గోస్పాడు, కోయిలకుంట్ల, దొర్నిపాడు, చాగలమర్రి మండలాల గుండా కడప జిల్లాలోకి ప్రవేశిస్తుంది.[3]
భూమి వినియోగం
మార్చుజిల్లా మొత్తం భౌగోళిక వైశాల్యం 9.154 లక్షల హెక్టార్లు. 2019-20 గణాంకాల ప్రకారం అటవీ ప్రాంతం 3.017 లక్షల హెక్టార్లు. ఇది మొత్తం భౌగోళిక ప్రాంతంలో 32.95%. విత్తిన నిఖర విస్తీర్ణం 3.37 లక్షల హెక్టార్లు, ఇది మొత్తం భౌగోళిక ప్రాంతంలో 36.87%.[3]
పరిపాలన విభాగాలు
మార్చురెవెన్యూ డివిజన్లు
మార్చుజిల్లాలో ఆత్మకూర్, నంద్యాల, డోన్ అనే మూడు రెవెన్యూ డివిజన్లున్నాయి. ఇవి 29 మండలాలుగా విభజించబడ్డాయి.
మండలాలు
మార్చుఆత్మకూరు డివిజన్ లో 10 మండలాలు, డోన్ డివిజన్ లో 6 మండలాలు, నంద్యాల డివిజన్ లో 13 మండలాలున్నాయి.
- ఆత్మకూర్ డివిజన్
- డోన్ డివిజన్
- నంద్యాల డివిజన్
నగరాలు, పట్టణాలు
మార్చురాజకీయ విభాగాలు
మార్చులోక్సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గాలు (7)[1]
- ఆళ్లగడ్డ
- డోన్
- నందికొట్కూరు
- నంద్యాల
- పాణ్యం (పాక్షికం) కొంత భాగం కర్నూలు జిల్లాలో ఉంది.
- బనగానపల్లె
- శ్రీశైలం
నీటిపారుదల
మార్చుజిల్లా స్థూల పంటల విస్తీర్ణం 1.88 లక్షల హెక్టార్లు. 2019-20లో కాలువలు, ట్యాంకులు, బావులు, ఇతర వనరుల ద్వారా సాగునీరు అందిస్తారు.
పర్యాటక ఆకర్షణలు
మార్చు- బెలూం గుహలు
- మంత్రాలయం
- అహోబిలం
- శ్రీశైల క్షేత్రం
- మహానంది
- యాగంటి
- రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
- సరస్వతి దేవి దేవాలయం, కొలను భారతి
- శ్రీ దుర్గాభోగేశ్వరస్వామి దేవస్తానం,భోగేశ్వరం
- హటకేశ్వరాలయం, హటకేశ్వరం
- చౌడేశ్వరీమాత ఆలయం,నందవరం
- మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి
చిత్రమాలిక
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ Hand Book of statistics - Nandyal district (PDF). District collector, Government of Andhra Pradesh. 2022-04-04.
- ↑ 3.0 3.1 3.2 "చరిత్ర". Nadyala district, Government of Andhra pradesh. Retrieved 2022-06-03.