జీవ ద్రవ్యరాశి

జీవ ఇంధనం అనేది జీవ ద్రవ్యాలనుండి ఉత్పత్తి కావింపబడు ఇంధనం.
(బయోమాస్ నుండి దారిమార్పు చెందింది)

జీవ ద్రవ్యరాశి (Biomass) అనగా మొక్కలు, జంతువుల శరీరాల్లోని పదార్థాలు. బయోమాస్ అనేది జీవావరణ శాస్త్రంలో, శక్తి ఉత్పత్తి పరిశ్రమలో ఒక ప్రాథమిక పదం. జీవులు చనిపోయినపుడు వాటిలోని జీవ ద్రవ్యరాశిని గృహావసరాలకు ఇంధనంగా ఉపయోగించవచ్చు. సేంద్రీయ వ్యర్థాలైన చనిపోయిన మొక్కలు, జంతు పదార్థాలు, జంతువుల పేడ, వంటగది వ్యర్థాలను బయోగ్యాస్ అనే వాయు ఇంధనంగా మార్చవచ్చు. సేంద్రీయ వ్యర్థం బయోగ్యాస్ డైజెస్టర్లలోని బ్యాక్టీరియా ద్వారా కుళ్ళిపోయి బయోగ్యాస్‌ను విడుదల చేస్తుంది, ఇది మిక్కలిగాగా మీథేన్, కార్బన్ డయాక్సైడ్ ల మిశ్రమం. జీవావరణ శాస్త్రంలో, జీవపదార్ధం అంటే జీవముతోవుండే పదార్థం యొక్క రాశి. ఇది ఇచ్చిన ప్రాంతంలో లేదా జీవసంబంధమైన సంఘం లేదా సమూహంలోని మొత్తం జీవన పదార్థం. బయోమాస్‌ను ఇచ్చిన ప్రాంతానికి (చదరపు మీటరు లేదా చదరపు కిలోమీటరు) బరువు లేదా పొడి బరువు ద్వారా కొలుస్తారు. శక్తి పరిశ్రమలో, ఇది ఇంధనంగా లేదా పారిశ్రామిక ఉత్పత్తికి ఉపయోగపడే జీవ పదార్థంగా సూచింపబడుతుంది. బయోమాస్‌లో జీవ ఇంధనంగా వాడటానికి పెరిగిన మొక్కల పదార్థాలు ఉన్నాయి, ఇంకా ఫైబర్స్, రసాయనాలు లేదా వేడి ఉత్పత్తికి ఉపయోగించే మొక్కలను లేదా జంతు పదార్థాలను కూడా కలిగి ఉంటుంది. బయోమాస్‌లో బయోడిగ్రేడబుల్ వ్యర్ధాలు కూడా ఉంటాయి, వీటిని కూడా ఇంధనంగా కాల్చవచ్చు. ఇది భౌగోళిక ప్రక్రియల ద్వారా బొగ్గు లేదా పెట్రోలియం వంటి పదార్ధాలుగా రూపాంతరం చెందిన సేంద్రియ పదార్థానికి మినహాయింపు. దీనిని సాధారణంగా పొడి బరువుతో కొలుస్తారు.

వరి పొట్టు