బరాన్ (సినిమా)
బరాన్ 2001, జనవరి 31న విడుదలైన ఇరాన్ చలనచిత్రం. మజీద్ మజీదీ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హుస్సేన్ అబిదిని, జహ్రా బహ్రామీ, మహమ్మద్ అమీర్ నాజీ, అబ్బాస్ రహీమీ, గులాం అలీ బక్షీ తదితరులు నటించగా అహ్మద్ పేజ్మాన్ సంగీతం అందించాడు. ఇరాన్ లో వేల సంఖ్యలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వలసదార్ల దుర్భర జీవితాల్ని ఈ చిత్రం ద్వారా మానవ ప్రపంచానికి చూపించడం జరిగింది.[1]
బరాన్ | |
---|---|
దర్శకత్వం | మజీద్ మజీదీ |
రచన | మజీద్ మజీదీ |
నిర్మాత | మజీద్ మజీదీ, ఫువాద్ నాస్ |
తారాగణం | హుస్సేన్ అబిదిని, జహ్రా బహ్రామీ, మహమ్మద్ అమీర్ నాజీ, అబ్బాస్ రహీమీ, గులాం అలీ బక్షీ |
సంగీతం | అహ్మద్ పేజ్మాన్ |
పంపిణీదార్లు | మిరామాక్స్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | జనవరి 31, 2001 |
సినిమా నిడివి | 94 నిముషాలు |
దేశం | ఇరాన్ |
భాషలు | పర్షియన్ భాష, అజెరి |
నటవర్గం
మార్చు- హుస్సేన్ అబిదిని
- జహ్రా బహ్రామీ
- మహమ్మద్ అమీర్ నాజీ
- అబ్బాస్ రహీమీ
- గులాం అలీ బక్షీ
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: మజీద్ మజీదీ
- నిర్మాత: ఫువాద్ నాస్
- సంగీతం: అహ్మద్ పేజ్మాన్
- పంపిణీదారు: మిరామాక్స్ ఫిల్మ్స్
పురస్కారాలు
మార్చు- 2001 మాంట్రియల్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అమెరికన్ అవార్డు గ్రాండ్ ప్రిక్స్ వారి ఉత్తమ చిత్రం అవార్డు[2]
- 2001 గిజోన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ దర్శకుడు అవార్డు
- 2001 మాంట్రియల్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం విభాగంలో ఒయుమెనికల్ స్పెషల్ అవార్డు[3]
- 2001 ఉత్తమ విదేశీ ఫిల్మ్ శాటిలైట్ అవార్డులకు ఎంపికైనది
- 2001లో 19వ ఫజ్ర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం పురస్కారాలు
మూలాలు
మార్చు- ↑ సినిమా స్క్రిప్ట్ & రివ్యూ బ్లాగ్ (27 January 2016). "దేశం దాటిన ప్రేమ". Retrieved 9 September 2018.
- ↑ Awards 2001 Archived 16 సెప్టెంబరు 2009 at the Wayback Machine. Festival des Films du Monde.
- ↑ Awards 2001 Archived 16 సెప్టెంబరు 2009 at the Wayback Machine. Festival des Films du Monde.