బర్నాలా జిల్లా
పంజాబ్ రాష్ట్రం లోని జిల్లాల్లో బర్నాలా ఒకటి. బర్నాలా పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. 2006 కి ముందు బర్నాలా జిల్లా, సంగ్రూర్ జిల్లాలో భాగంగా ఉండేది.
బర్నాలా జిల్లా | |
---|---|
పంజాబ్ జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
స్థాపన | 2006 |
ముఖ్య పట్టణం | బర్నాలా |
విస్తీర్ణం | |
• Total | 1,423 కి.మీ2 (549 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 5,95,527 |
• జనసాంద్రత | 420/కి.మీ2 (1,100/చ. మై.) |
భాషలు | |
Time zone | UTC+5:30 (IST) |
Website | http://barnala.gov.in/ |
బర్నాలా జిల్లాకు ఉత్తరాన లుధియానా జిల్లా, వాయవ్య దిశలో మోగా జిల్లా, పశ్చిమాన భటిండా జిల్లా, మిగతా అన్ని వైపులా సంగ్రూర్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలో 2 తహసీళ్ళు, 3 బ్లాకులూ ఉన్నాయి.
2011 జనగణన నాటికి రాష్ట్రంలోకెల్లా అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా ఇదే. [2]
జిల్లా పరిపాలన
మార్చు- డిప్యూటీ కమిషనర్ (డిసి), అయ్యేయెస్ అధికారి. జిల్లాలో పరిపాలన మొత్తం ఈ అధికారి చేతిలో ఉంటుంది.
- జిల్లా శాంతిభద్రతలు, తత్సంబంధిత సమస్యలను నిర్వహించే బాధ్యత సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) కు ఉంటుంది.
- జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డిపిఆర్‌ఓ) . రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల బాధ్యత ఈ అధికారి నిర్వహిస్తారు.
- డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ), భారత అటవీ సేవకు చెందిన అధికారి, జిల్లాలోని అడవులు, పర్యావరణం, వన్యప్రాణుల సంబంధిత వ్యవహారాలను నిర్వహిస్తాడు
మౌలిక వసతులు
మార్చువిద్య
మార్చుజిల్లాలో కింది ప్రభుత్వ కళాశాలలున్నాయి
- గురు గోబింద్ కాలేజి, బర్నాలా
- ఎల్‌బిఎస్ కాలేజి, బర్నాలా
- ఎస్.డి. కాలేజి, బర్నాలా
- యూనివర్సిటీ కాలేజి, ధిల్వాన్
వైద్యం
మార్చుకింది ప్రభుత్వ వైద్యశాలలున్నాయి
- ప్రజా వైద్యశాల, బర్నాలా
- ప్రజా వైద్యశాల, తాపా
పిడబ్ల్యుడి, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పశుసంవర్ధక వంటి ప్రతి అభివృద్ధి శాఖ వ్యవహారాలను ఆ శాఖ జిల్లా అధిపతి చూసుకుంటారు. ఈ అధికారులు వివిధ రాష్ట్ర సేవలకు చెందినవారు.
జనాభా వివరాలు
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1951 | 1,88,189 | — |
1961 | 2,42,368 | +28.8% |
1971 | 2,92,463 | +20.7% |
1981 | 3,62,663 | +24.0% |
1991 | 4,40,772 | +21.5% |
2001 | 5,26,931 | +19.5% |
2011 | 5,95,527 | +13.0% |
2011 జనగణన ప్రకారం బర్నాలా జిల్లా జనాభా 5,95,527, [2] సాలమన్ దీవుల దేశానికి [4] లేదా యుఎస్ రాష్ట్రమైన వ్యోమింగ్‌కు ఇది సమానం. [5] జనాభా పరంగా ఇది భారతదేశ జిల్లాల్లో 527 వ స్థానంలో ఉంది. జిల్లాలో జనాభా సాంద్రత 419. 2001-2011 దశాబ్దంలో జనాభా జనాభా వృద్ధి రేటు 13.16%. బర్నాలా జిల్లా లింగ నిష్పత్తి 876. అక్షరాస్యత రేటు 68,9%.
ఏరియా టెలిఫోన్ కోడ్: 01679 పోస్టల్ కోడ్: 148101
వాహన రిజిస్ట్రేషను కోడ్: పిబి 19
ప్రముఖ వ్యక్తులు
మార్చు- రామ్ సరూప్ ఆంఖి - పంజాబీ నవలా రచయిత, కవి
- సుర్జీత్ సింగ్ బర్నాలా - పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, తమిళనాడు గవర్నరుగా పనిచేసిన రాజకీయ నాయకుడు
- కరం సింగ్ - పరమ వీర చక్ర ను జీవించి ఉండగా పొందిన మొదటి వ్యక్తి
మూలాలు
మార్చు- ↑ "District at a Glance". Archived from the original on 2014-11-29. Retrieved 2020-11-02.
- ↑ 2.0 2.1 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ http://www.census2011.co.in/census/district/607-barnala.html
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Solomon Islands 571,890 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 19 October 2013. Retrieved 2011-09-30.
Wyoming 563,626