బలరాంపూర్ లోక్సభ నియోజకవర్గం
బలరాంపూర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఐదు అసెంబ్లీ స్థానాలతో శ్రావస్తి లోక్సభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పాటైంది.
బలరాంపూర్ లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°24′0″N 82°12′0″E |
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 1957లో సాధారణ ఎన్నికల్లో మూడు స్థానాల్లో పోటీ చేశారు. అతను మథురలో నాల్గవ స్థానంలో, లక్నోలో రెండవ స్థానంలో నిలిచి మొదటిసారిగా బలరాంపూర్ లోక్సభ సభ్యుడిగా గెలిచాడు. ఆయన 1962లో బలరాంపూర్ & లక్నో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయి 1967లో బలరాంపూర్ నుంచి పోటీ చేసి గెలిచాడు.[1]
ఎన్నికైన సభ్యులు మార్చు
సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1952 | ఏర్పడలేదు | |
1957 | అటల్ బిహారీ వాజ్పేయి [2] | భారతీయ జనసంఘ్ |
1962 | సుభద్ర జోషి | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | అటల్ బిహారీ వాజ్పేయి | భారతీయ జనసంఘ్ |
1971 | చంద్ర భల్ మణి తివారీ | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | నానాజీ దేశ్ముఖ్ | జనతా పార్టీ |
1980 | చంద్ర భల్ మణి తివారీ | భారత జాతీయ కాంగ్రెస్ |
1984 | మహంత్ దీప్ నారాయణ్ వాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | ఫాసి-ఉర్-రెహ్మాన్ మున్నాన్ ఖాన్ | స్వతంత్ర |
1991 | సత్య దేవ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
1996 | సత్య దేవ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
1998 | రిజ్వాన్ జహీర్ | సమాజ్ వాదీ పార్టీ |
1999 | రిజ్వాన్ జహీర్ | సమాజ్ వాదీ పార్టీ |
2004 | బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
2008 | లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో శ్రావస్తి లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడింది. |
మూలాలు మార్చు
- ↑ The New Indian Express (18 August 2018). "Balrampur: Vajpayee started out as an MP from this constituency". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ NDTV (17 August 2018). "Atal Bihari Vajpayee Started Out As A Lawmaker From This Constituency". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.