లక్నో లోక్‌సభ నియోజకవర్గం
లక్నో లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఈ లోక్‌సభ స్థానం 1991 నుండి బీజేపీ విజయం సాధిస్తూ వస్తుంది. ఇక్కడి నుండి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎనిమిది సార్లు పోటీ చేశాడు. ఆయన 1955లో జరిగిన ఉప ఎన్నికలో మొదటిసారి పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచి ఆ తర్వాత 1957, 1962లో రెండో స్థానంలో నిలిచి తర్వాత, 1991, 1996, 1998, 1999, 2004లో వరుసగా ఐదు సార్లు ఎంపీగా అక్కడి నుండి ఎన్నికయ్యాడు.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | గెలిచిన పార్టీ (2022) | ఓటర్ల సంఖ్య (2019) |
---|---|---|---|---|---|
171 | లక్నో వెస్ట్ | జనరల్ | లక్నో | సమాజ్ వాదీ పార్టీ | 4,12,201 |
172 | లక్నో నార్త్ | జనరల్ | లక్నో | బీజేపీ | 4,24,848 |
173 | లక్నో తూర్పు | జనరల్ | లక్నో | బీజేపీ | 4,48,016 |
174 | లక్నో సెంట్రల్ | జనరల్ | లక్నో | సమాజ్ వాదీ పార్టీ | 3,69,533 |
175 | లక్నో కంటోన్మెంట్ | జనరల్ | లక్నో | బీజేపీ | 3,85,769 |
మొత్తం: | 20,40,367 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | విజయ లక్ష్మి పండిట్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1955^ | శేరజ్వతి నెహ్రూ | ||
1957 | పులిన్ బిహారీ బెనర్జీ | ||
1962 | BK ధాన్ | ||
1967 | ఆనంద్ నారాయణ్ ముల్లా | స్వతంత్ర | |
1971 | షీలా కౌల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | హేమవతి నందన్ బహుగుణ | జనతా పార్టీ | |
1980 | షీలా కౌల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | మంధాత సింగ్ | జనతాదళ్ | |
1991 | అటల్ బిహారీ వాజ్‌పేయి | భారతీయ జనతా పార్టీ | |
1996 | |||
1998 | |||
1999 | |||
2004 | |||
2009 | లాల్‌జీ టండన్ | ||
2014 | రాజ్‌నాథ్ సింగ్ | ||
2019[1] |
మూలాలు
మార్చు- ↑ Business Standard (2019). "Lucknow Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.