బల్‌బీర్ సింగ్ బాల్మీకి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో ఇస్రానా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

బల్‌బీర్ సింగ్ బాల్మీకి

పదవీ కాలం
25 అక్టోబర్ 2019 – 8 అక్టోబర్ 2024
ముందు క్రిషన్ లాల్ పన్వార్
తరువాత క్రిషన్ లాల్ పన్వార్
నియోజకవర్గం ఇస్రానా

వ్యక్తిగత వివరాలు

జననం (1974-03-05) 1974 మార్చి 5 (వయసు 50)[1]
న్యూఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు చంద్గి రామ్[1]

రాజకీయ జీవితం

మార్చు

బల్‌బీర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009, 2014 ఎన్నికలలో ఇస్రానా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి క్రిషన్ లాల్ పన్వార్ చేతిలో ఓటమిపాలయ్యాడు. బల్బీర్ సింగ్ 2019 ఎన్నికలలో ఇస్రానా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి క్రిషన్ లాల్ పన్వార్ పై 20,015 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి క్రిషన్ లాల్ పన్వార్ చేతిలో 13895 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "MLA Details". haryanaassembly.gov.in. 17 July 2018. Retrieved 5 February 2021.
  2. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Israna". Retrieved 29 October 2024.