బసవరాజు రాజ్యలక్ష్మి

బసవరాజు రాజ్యలక్ష్మి తెలుగు కవయిత్రి. జననం 1904లో. ఆమె ప్రముఖ కవి బసవరాజు అప్పారావు భార్య. అప్పారావుగారు చనిపోయిన తరవాత ఆమె గుంటూరు శారదానికేతనములో శేషజీవితము గడిపేరు.

రచన రంగంలో మార్చు

రాజ్యలక్ష్మి సౌదామిని కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు.[1] అప్పారావు గారు - నేను పేరుతో ఆత్మకథ రచించారు.

ఉదాహరణలు మార్చు

సూర్యుండు పడమటా కుంకేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
చంద్రకాంతం పూలు పూచేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
ఆవు లంబా యనుచు అరిచేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
బీరల్ల పూవుల్లు పూచేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
అరుణోదయమ్ము వేళను
ఆకసమున బారె పిట్ట
లానందముగను బాడుచు
మంగళగీతములతోను!

పారిజాత పూవులన్ని
పడిపోయెను పాదులలో
పుణ్య భరతభూమి పైన
పూలక్షతలు చల్లినటుల!

నే నిటులే గడుపుచుంటి
నీవు లేని జీవితమ్ము,
నొంటిగా విసిగివేసట
నావికుడు లేని నావవలె![2]

రచనలు మార్చు

  • దురదృష్టము కావ్యము

మూలాలు మార్చు

  1. రాజ్యలక్ష్మి ఆత్మకథ "అప్పారావు గారు - నేను"
  2. చైతన్యదేహళి:ఇరవైయవ శతాబ్దపు తెలుగు కవితాసంపుటి(సం:డా.కల్లూరి శ్యామల; ప్ర:నేబుట్ర)

ఇవి కూడా చూడండి మార్చు

బసవరాజు అప్పారావు

వర్గాలు మార్చు