బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం
బంధవ్గార్హ జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉమారియా అనే ప్రాంతంలో ఉంది.
బంధవ్గార్హ జాతీయ ఉద్యానవనం | |
---|---|
IUCN category II (national park) | |
![]() ఈ ఉద్యానవనంలో ఉన్న పులి | |
ప్రదేశం | మధ్యప్రదేశ్, భారతదేశం |
సమీప నగరం | ఉమారియా |
విస్తీర్ణం | 1,536 కి.మీ2 (593 చ. మై.) |
స్థాపితం | 1968 |
సందర్శకులు | 108,000 |
పాలకమండలి | మధ్యప్రదేశ్ అటవీ శాఖ |
forest.mponline.gov.in/ |
చరిత్రసవరించు
ఈ ఉద్యానవనాన్ని 1968 లో స్థాపించారు. ఇది 1536 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యనవనాన్నికి చారిత్రక చరిత్ర ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని రేవా వంశానికి చెందిన మహారాజులు ఆట విడుపులు, వినోదాల కోసం వాడేవారు. 1947 లో రేవా రాష్ట్రాన్ని మధ్యప్రదేశ్‌లో విలీనం చేశారు. కానీ అప్పటి ఒప్పందం ప్రకారం రేవా మహారాజాలు వేట హక్కులను తమ ఆధీనంలో ఉండేది. 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఈ ఉద్యానవనం ప్రాజెక్ట్ టైగర్ కి ఎంపికైంది.[1]
జంతు సంపదసవరించు
ఈ ఉద్యానవనంలలో ఎక్కువగా పులుల సంరక్షణకు పేరుగాంచింది. ఇందులో 37 జాతుల క్షీరదాలు, 250 కి పైగా రకరకాల జాతుల పక్షులు, 80 రకాలకు పైగా సీతాకోకచిలుకలు, సరీసృపాలు ఉన్నాయి. వర్షాకాలంలో వివిధ జాతులకు చెందిన పలు పక్షులు ఈ ఉద్యానవనాన్నికి వలసకి వస్తాయి.
మరిన్ని విశేషాలుసవరించు
1968 లో 105 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. కానీ కాలక్రమేణా ఉమారియా, కట్ని అనే ప్రాంతాలను కలుపుకొని 850 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించింది.[2] ఈ ఉద్యానవనాన్నికి బంధవ్గార్హ అని నామకరణం చేయడానికి కారణం పూర్వం రాముడు లంకేయులపై నిఘా ఉంచడానికి తన సోదరుడు అయినటువంటి లక్మణుడికి ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఉద్యానవనాన్నికి బంధవ్గార్హ (బ్రదర్స్ ఫోర్ట్) అని నామకరణం చేశారు. ఈ ఉద్యానవనాన్ని మూడు భాగాలుగా తాలా, మాగ్ధి, ఖితౌలిగా విభజించారు. కానీ తాలా ప్రాంతంలో జీవవైవిధ్యం పరంగా, పులుల సంరక్షణ పరంగా పేరుగాంచింది.[3]
మూలాలుసవరించు
- ↑ Shahbaz Ahmad: Charger: The Long Living Tiger, Print World, Allahabad, 2001
- ↑ "Reintroduction of Gaur (Indian Bison) in Bandhavgarh National Park". Archived from the original on 2013-03-03. Retrieved 2019-10-02.
- ↑ L.K.Chaudhari & Safi Akhtar Khan: Bandhavgarh-Fort of the Tiger, Wild Atlas Books, Bhopal, 2003