బానోతు హరిప్రియ నాయక్

బానోతు హరిప్రియ నాయక్, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారత్ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నది.[1][2] 33 సంవత్సరాల వయస్సులో తెలంగాణ శాసనసభకు ఎన్నికై శాసనసభ్యుల్లో అతిపిన్న వయస్కురాలిగా నిలిచింది.[3]

బానోతు హరిప్రియ నాయక్
బానోతు హరిప్రియ నాయక్

నియోజకవర్గం ఇల్లందు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 01 మే 1985
దాస్య తండా, టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు సీతారాం బాదావత్ - దర్జన్‌
జీవిత భాగస్వామి హరిసింగ్ నాయక్
పూర్వ విద్యార్థి జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం

జీవిత విశేషాలు

మార్చు

హరిప్రియ నాయక్ 1985, మే 1న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని దాస్య తండాలో[4] బాదావత్‌ సీతారాంనాయక్‌, దర్జన్‌ దంపతులకు జన్మించింది.[5] తండ్రి సింగరేణి కొలీరీస్ కంపెనీలో పని చేసేవాడు. ఇంటర్మీడియట్ చదివిన తరువాత 2002లో హరిసింగ్ నాయక్ తో వివాహం జరిగింది.[6][7] భర్త ప్రోత్సాహంతో, బి. టెక్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, తర్వాత హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జెఎన్‌టియుహెచ్) నుంచి 2010 కంప్యూటర్ సైన్స్‌లో ఎం.టెక్‌ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[7][8] 2006లో హరి సింగ్ విద్యా సంస్థలను ప్రారంభించాడు. ఇందులో నాలుగు ప్రైవేట్ పాఠశాలలు, నాలుగు జూనియర్ కళాశాలలు ఉన్నాయి.[7]

రాజకీయ జీవితం

మార్చు

తన కుటుంబంలో పెద్దగా రాజకీయ నేపథ్యం ఉన్నవారు లేకపోయినా, చిన్నతనం నుంచే హరిప్రియా నాయక్ కు నాయకత్వ లక్షణాలు ఉండేవి. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసిన హరిప్రియ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య చేతిలో ఓడిపోయింది. అప్పటినుండి ఇల్లెందు రాజకీయాలలో చురుకుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసింది. 2018లో కాంగ్రెస్ పార్టిలో చేరి, ఆ పార్టీ తరపున పోటీచేసి కోరం కనకయ్య పై హరిప్రియ 2,600 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. 2019, జనవరి 17న ఇల్లందు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసింది.[9][10] ఆమె 2019లో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరింది.[11][12]

నిర్వహించిన పదవులు

మార్చు
  1. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం కార్యదర్శి
  2. చత్తీస్‌ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ ఏఐసీసీ పరిశీలకురాలు
  3. ఇల్లందు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే

మూలాలు

మార్చు
  1. ఈనాడు, తాజా వార్తలు. "తెలంగాణ ఫలితాలు: జిల్లాల వారీగా వివరాలు ఇలా." Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  2. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (12 December 2018). "అసెంబ్లీకి ఎన్నికైన తొమ్మిదిమంది మహిళలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  3. Eenadu (9 November 2023). "అభ్యర్థులు వారే.. గుర్తులు మారె." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  4. Eenadu (7 November 2023). "టేకులపల్లి చట్టసభల చుట్టం". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
  5. "Member's Profile - SMT. HARIPRIYA BANOTH". Telangana Legislature. Archived from the original on 9 సెప్టెంబరు 2021. Retrieved 9 September 2021.
  6. Sakshi (26 May 2019). "సేవలోనూ 'సగం'". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  7. 7.0 7.1 7.2 "సేవలోనూ 'సగం'" [One half in service]. Sakshi. 26 May 2019.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "Telangana election results: Pretty in pink". The New Indian Express. 12 December 2018.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. 10టివీ (17 January 2019). "దైవ సాక్షిగా: ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  10. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (17 January 2019). "ముందుగా మహిళా ఎమ్మెల్యేలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  11. The News Minute (11 March 2019). "Another blow for Telangana Congress as MLA B Haripriya defects to TRS". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  12. Namasthe Telangana (27 October 2023). "అనాథల అమ్మ 'హరిప్రియ'.. ఎమ్మెల్యేగా ఐదేండ్లలో ఆమె చేసిన అభివృద్ధి ఇదీ". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.