బాబు గోగినేని
బాబు గోగినేని హైదరాబాదుకు చెందిన ప్రముఖ హేతువాది, మానవవాది . ఏప్రిల్ 14, 1968న జన్మించిన 'రాజాజీ రామనాథబాబు గోగినేని' తొలుత హైదరాబాదులోని అలయన్స్ ఫ్రాన్సైస్ లో ఫ్రెంచ్ భాషా బోధకునిగా, ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రానికి అధిపతిగా పనిచేశాడు. 10 సంవత్సరాలు అంతర్జాతీయ మానవత, నైతిక సంఘమునకు (International Humanist and Ethical Union) అధ్యక్షునిగా పనిచేశాడు[4]. ఈ సంఘములో 40 దేశాలకు సభ్యత్వమున్నది. లండన్ ప్రముఖ కార్యస్థానము. బాబు అధ్యక్షునిగా ఉన్న 9 సంవత్సరములలో పలు మానవ హక్కుల ఉద్యమాలు నడిపి అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. న్యూయార్క్ టైమ్స్, సి యన్ యన్, బిబిసి బాబు కార్యకలాపాలని విస్తృతముగా ప్రచురించేవి.
బాబు గోగినేని | |
---|---|
జననం | 1968 ఏప్రిల్ 14 హైదరాబాదు, తెలంగాణ |
విద్య | బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, నిజాం కళాశాల ఎం.ఎ (సోషియాలజీ) ఎం.ఎ(హ్యూమన్ రైట్స్), పాండిచ్చేరి విశ్వవిద్యాలయం |
విద్యాసంస్థ | నిజాం కళాశాల, హైదరాబాదు |
వృత్తి | ఎగ్జిక్యూటివ్ డైరక్టరు, ఇంటర్నేషనల్ హూమనిస్టు అండ్ ఎధికల్ యూనియన్[3] |
క్రియాశీల సంవత్సరాలు | 1988 నుండి ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మానవవాది, మానవ హక్కుల కార్యకర్త, నాస్తికుడు |
జీవిత భాగస్వామి | సహానా |
పిల్లలు | అరుణ్ గోగినేని (కుమారుడు) |
తల్లిదండ్రులు |
|
బాబు విజ్ఞానము, మానవ హక్కులు, లౌకిక వాదము, ప్రజాస్వామ్యము, అస్పృశ్యత, విదేశీ భాషలు మున్నగు పలు అంశాలపై పెక్కు దేశాలలో ఉపన్యాసములు ఇచ్చాడు. బాబు వ్రాసిన వ్యాసాలు వివిధ సమస్యలపై తార్కిక దృష్టితో నిండి ఉంటాయి[5].
మెక్సికో విశ్వవిద్యాలయములో ప్రతిష్ఠాత్మక స్ప్రింగ్ ఉపన్యాసము ఇచ్చాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయములో వాద ప్రతివాద పోటీలో గెలుపొందిన కూటమిలో సభ్యుడు. పాకిస్తాన్ ప్రభుత్వము యూనస్ షేఖ్ పై ధార్మిక నింద చేశాడనే అపనింద వేసి 2000 అక్టోబరు 4న మరణ శిక్ష విధించగా బాబు IHEU తరుఫున న్యాయపోరాటము చేయగా 2003లో షేఖ్ విడుదల కావింపబడ్డాడు.
పదవులు
మార్చు- అంతర్జాతీయ హేతువాద, మానవతావాద సంఘాల సమాఖ్య (ఐహెచ్ఈయూ) డైరెక్టర్
- జనరల్ సెక్రటరీ - సౌత్ ఆసియా హ్యూమనిస్ట్ నెట్‌వర్క్
- ట్రస్టీ - ఇండియా రినైసెన్స్ ఇనిస్టిట్యూట్
- సెక్రటరీ - ఇండియన్ రాడికల్ హ్యూమనిస్టు అసోసియేషన్
- జనరల్ సెక్రటరీ - రేషనలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
- సంపాదకుడు - ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ న్యూస్
- సభ్యుడు - అడ్వయిజరీ బోర్డు - ఓస్లో కొలిషన్ ఫర్ ద ఫ్రీడం ఆఫ్ రెలిజియన్ అండ్ బిలీఫ్ .
- సెక్రటరీ - IHEU కమిటీ ఆన్ యూనివర్సల్ వాల్యూస్ .
- సెక్రటరీ - IHEU కమిటీ ఆన్ రెలిజియస్ అబ్యూస్ ఆఫ్ చిల్డ్రన్ .
- సభ్యుడు, మేనేజిమెంట్ కౌన్సిల్ - ఇంటర్నేషనల్ హిస్టోరికల్ కోర్ట్.
- UN ఎక్స్‌పర్ట్ ఆన్ ఎడ్యుకేషన్ - మేడ్రిడ్ కాన్ఫరెన్స్ ఆన్ ఫ్రేడం ఆఫ్ రెలిజియస్ ఆర్ బిలీఫ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్
మూలాలు
మార్చు- ↑ Smith, Warren Allen (2000). Who's who in hell: a handbook and international directory for humanists, freethinkers, naturalists, rationalists, and non-theists. Barricade Books. ISBN 9781569801581.
- ↑ "Misimi - Monthly magazine". Misimi (in Telugu). 1 November 2000.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)[permanent dead link] - ↑ "wiki biography".
- ↑ http://www.iheu.org/node/216
- ↑ బాబు వ్యాసాలు: http://www.iheu.org/taxonomy/term/161
ఇతర లింకులు
మార్చు- Jim Herrick (The Editor of International Humanist News, 1992 - 1999), speaks to Babu Gogineni on his appointment as Executive Director of IHEU in 1997
- Why Brights are "nice" Guys"
- https://www.youtube.com/watch?v=8l63dR0-Neg
- https://www.youtube.com/watch?v=Qm6L9bM2970
- https://www.youtube.com/watch?v=GrPQchfICB8
- https://www.youtube.com/watch?v=Qm6L9bM2970
- https://www.youtube.com/watch?v=bruGbTYO4uI(జ్యోతిష్యుల గురించి బాబు గోగినేని )
- https://www.youtube.com/watch?v=lfhMgE260Hs(ప్రాణిక్ హీలింగ్ గురించి బాబు గోగినేని )