బాబు దేవీదాస్ రావు

బాబు దేవీదాస్ రావు కవిగా, పండితుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, వ్యాసకర్తగా పరిశోధకుడిగా, ఉపన్యాసకుడిగా, విమర్శకుడిగా, బహుముఖీయ ప్రజ్ఞగలవారు. M.A, B.O.L, చదివి గ్రేడ్1 తెలుగు  ఉపాధ్యాయులుగా పదవీ  విరమణ చేసారు. ఆంధ్రం, సంస్కృతం, మరాఠీ, హిందీ, భాషలలో వీరికి ప్రావీణ్యం ఉంది. జ్యోతిషం, సాముద్రికము,  ఆయుర్వేదములలో  వీరికి ప్రవేశము ఉంది.

బాబు దేవీదాస్ రావు
బాబు దేవీదాస్ రావు
జననంబాబు దేవీదాస్ రావు
నాగర్‌కర్నూలు జిల్లా రాచాలపల్లి
నివాస ప్రాంతంఆత్మకూరు
ప్రసిద్ధికవి, రచయిత
మతంహిందూ

జీవిత విశేషాలు

మార్చు

 వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందినవారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు.  మనోరమాబాయి, రామరావు దేశముఖ్ సల్ గర్ కల్ వీరి తల్లిదండ్రులు. 01-05-1952 [1] న రాచాలపల్లిలో జన్మించారు (ఈ గ్రామం గతంలో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ఉండేది. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలో చేరింది). బహుభాషా కోవిదుడైన వీరి తండ్రి ద్వారా భారత రామాయణాది పురాణేతిహాసాల్లోనూ శిక్షణ పొందారు. ప్రాథమిక విద్యాభ్యాసం మాధారంలో జరిగింది. విశ్వనాథ, శేషేంద్ర శర్మ రచనలతో స్ఫూర్తి పొంది, పద్య రచనలో, నేర్పునును పొంది, అనేక భక్తి శతకాలతో పాటు, వేదాంత రచనలు చేశారు. దిన, వార, మాస సాహిత్య పత్రికలలో అనేక పరిశోధన, సాహిత్య వ్యాసాలను వెలువరించారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

రచనలు

మార్చు

శతకాలు

మార్చు
  1. రేణుకా శతకము
  2. ఈశ్వరీ శతకము
  3. శ్రీ రామచంద్రుడా శతకము,
  4. శంకరా ! సద్గురూ
  5. శంభో ! మహాదేవ
  6. శ్రీ రాజరాజేశ్వరీ !

పద్యకృతులు

మార్చు
  1. శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రమ్
  2. శ్రీ మాత్రే నమః
  3. అక్షరార్చన
  4. వసంత గీతము, సత్యభామా ! 
  5. శ్రీ చిద్గగన చంద్రిక
  6. అమలిన శృంగార కావ్యము
  7. శ్రీ రామాయణోపనిషత్తు

పరిశోధన

మార్చు
  1. పాలమూరు చరిత్ర (శాసనాధారాలతో పరిశీలన)   
  2. సమగ్ర జీవిత చరిత్ర-
  3. మోక్షగుండం విశ్వేశ్వరయ్య
  4. శ్రీ రాఘవేంద్రులు

పరిష్కరణ

మార్చు

ఉమా మహేశ్వరవ్రత కథ

వ్యాఖ్యానాలు

మార్చు
  1. భజగోవిందం సంగ్రహ వ్యాఖ్య.
  2. విష్ణుసహస్రనామార్థ సంగ్రహము
  3. లలితా సహస్ర నామార్థ సంగ్రహము

వేదాంత రచనలు

మార్చు
  1. వేద విజ్ఞానము
  2. బ్రహ్మ విద్య
  3. బ్రహ్మ జిజ్ఞాస
  4. ఆర్ష సంస్కృతి

బాలసాహిత్యం

మార్చు

నెహ్రూజీ వ్యక్తిత్వం

పురస్కారాలు సన్మానాలు

మార్చు

పాలమూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు (1995) గా అవార్డు అందుకున్నారు. శ్రీశ్రీశ్రీ పుష్పగిరి శంకరాచార్యల వేదశాస్త్ర రక్షణ పరిషత్ సన్మానం, కొండాలక్ష్మణ బాపుజీ  అవార్డు పొందారు.

బిరుదులు

మార్చు

కవిపరమేశ్వర,  ఆర్షవిద్యా నిష్ణాత

మూలాలు

మార్చు
  1. ఈశ్వరీ శతకము -డి.ఎస్. బాబు దేవీదాస్ రావు, చివరి పేజి రచయిత పరిచయం , జాతీయ సాహిత్య పరిషత్ , ఆత్మకూరు 2013