బాబూరావు పచర్నే
బాబూరావు కాశీనాథ్ పచర్నే (1951 - 11 ఆగస్ట్ 2022) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు షిరూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
బాబూరావు పచర్నే | |||
| |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | అశోక్ రావుసాహెబ్ పవార్ | ||
---|---|---|---|
తరువాత | అశోక్ రావుసాహెబ్ పవార్ | ||
నియోజకవర్గం | షిరూర్ | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | పోపట్రావ్ గవాడే | ||
తరువాత | అశోక్ రావుసాహెబ్ పవార్ | ||
నియోజకవర్గం | షిరూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుబాబూరావు పచర్నే స్వతంత్రగా రాజకీయాల్లోకి వచ్చి 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షిరూర్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బాబూరావు గావాడే పోపాత్రావ్ హరిబా చేతిలో 678 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి బాబూరావు గావాడే పోపాత్రావ్ హరిబా చేతిలో 8,027 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
బాబూరావు పచర్నే 2004లో భారతీయ జనతా పార్టీ లో చేరి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షిరూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి బాబూరావు గావాడే పోపాత్రావ్ హరిబా పై 9,560 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2009లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి బాబూరావు గావాడే పోపాత్రావ్ హరిబా చేతిలో 7,567 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]
బాబూరావు పచర్నే తిరిగి భారతీయ జనతా పార్టీ లో చేరి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షిరూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి బాబూరావు గావాడే పోపాత్రావ్ హరిబాపై 10941 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి బాబూరావు గావాడే పోపాత్రావ్ హరిబా చేతిలో 41504 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]
మరణం
మార్చుబాబూరావు పచర్నే 71 ఏళ్ల వయసులో క్యాన్సర్ తో పాడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2022 ఆగస్ట్ 11న మరణించాడు.[6][7][8]
మూలాలు
మార్చు- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Shirur Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "गोपीनाथ मुंडेंचे निकटवर्तीय होते". 11 August 2022. Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "Maharashtra: Former BJP MLA Baburao Pacharne dies" (in ఇంగ్లీష్). Deccan Herald. 11 August 2022. Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "Former BJP MLA Baburao Pacharne passes away at 71". 11 August 2022. Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.