బామ్మమాట బంగారుబాట

బామ్మమాట బంగారుబాట 1989 లో వచ్చిన కామెడీ చిత్రం. ఎ.వి.ఎమ్ ప్రొడక్షన్స్ లో [ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియన్ నిర్మించారు. రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇందులో భానుమతి రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, నూతన్ ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. చంద్రబోస్ సంగీతం అందించాడు. ఇది తమిళ చిత్రం పాట్టి సోలై తట్టాతే (1988) కు రీమేక్.[1] సమీక్షాపరంగా, వాణిజ్యపరంగా ప్రశంసలు పొందినప్పటికీ, ఈ చిత్రంలో ఒక పెద్ద ప్రమాదం జరిగి చేదు జ్ఞాపకం మిగిల్చింది. ఇందులో నూతన్ ప్రసాద్‌కు జరిగిన ప్రమాదంలో వెన్నెముక విరిగింది. దీంతో అతని నడుము నుండి కింది భాగం చచ్చుపడిపోయింది. అతను జీవితాంతం చక్రాల కుర్చీ ఉపయోగించాల్సి వచ్చింది.[2]

బామ్మమాట బంగారుబాట
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం ‌రాజశేఖర్
నిర్మాణం ఎం. శరవణన్
ఎం.బాలసుబ్రమణియన్
కథ రాజశేఖర్
చిత్రానువాదం రాజశేఖర్
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
నూతన్ ప్రసాద్
సంగీతం రాజ్ - కోటి
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం రంగా
కూర్పు విఠల్ లాస్నీ
నిర్మాణ సంస్థ ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథ మార్చు

సూరయ్య (నూతన్ ప్రసాద్) కేవలం పేరుకే గ్రామానికి అధిపతి. ప్రతీదీ అతని భార్య రాజ్యలక్ష్మి (భానుమతి) యే చూసుకుంటుంది. సూర్య ఖాళీగా, పోసుకోలు కబుర్లు చెబుతూ గ్రామంలో తిరుగుతూంటాడు. భార్య అంటే భయంతో అణగిమణగి ఉంటాడు.ఈ దంపతులకు ఒక కుమారుడు, కోడలు ఉన్నారు. వారు ఒక ప్రమాదంలో మరణిస్తారు. మనవడు కృష్ణ (రాజేంద్ర ప్రసాద్) ను వాళ్ళే గారాబంగా పెంచారు. కృష్ణ ఒక సాధారణ యువకుడు, అతను ఐదేళ్ళ పాటు శ్రమపడి డిగ్రీ సంపాదించి గ్రామానికి తిరిగి వస్తాడు. ఈ సందర్భంలో, అతను రైలులో సీతను (గౌతమి) కలుస్తాడు. సీతకు బలవంతంగా పెళ్ళి చెయ్యబోతే ఆమె పారిపోతున్నట్లు తెలిసి, ఆమెకు తన ఊళ్ళోని గోవిందు హోటల్లో ఆశ్రయం కల్పిస్తాడు. నాటకీయ పరిస్థితిలో సీత జీవితం ప్రమాదంలో పడినప్పుడు, అతను ఆమెను పోలీస్ స్టేషన్లో పెళ్ళి చేసుకుంటాడు. ఈ వార్త తెలుసుకున్న రాజ్యలక్ష్మి హతాశురాలై మనవడికి ఇల్లు వదిలి బైటికి పొమ్మని చెబుతుంది. కృష్ణ సీత నగరానికి వచ్చి తమ జీవితాన్ని స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తారు.

సూరయ్య నగరానికి వస్తాడు. విషయాలు అర్థం చేసుకుంటాడు. కృష్ణ తనకొక కొడుకు ఉన్నాడని అబద్ధం చెప్పినప్పుడు సలైన సరదా మొదలవుతుంది. శుభవార్త విన్న రాజ్యలక్ష్మి మునిమనవడీని చూసేందుకు నగరానికి వస్తుంది. కృష్ణ పిల్లలను ఇచ్చే అనసూయ (సిల్క్ స్మిత) నుండి అద్దెకు శిశువును తెచ్చుకుంటాడు. పరిస్థితిని మరింత దిగజార్చడానికా అన్నట్లు ఆమె ఒక ఆడ శిశువును ఇస్తుంది. అది అబ్బాయే అని అబద్ధం చెబుతుంది. ఆమె కూడా పనిమనిషిగా ఇంట్లోకి వచ్చి డబ్బు దోచుకోవాలని ప్లానేస్తుంది. రాజ్యలక్ష్మి ఇది గ్రహించి ఆమెకు ఒక పాఠం నేర్పుతుంది. చివరికి కథ మలుపులు తిరిగి సుఖాంతమౌతుంది.  

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఎస్. లేదు పాట పేరు గాయకులు పొడవు
1 "Delhi ిల్లీ కి రాజా ఐనా" భానుమతీ రామకృష్ణ 3:55
2 "మా పల్లె గోపాలుడ" ఎస్పీ బాలు, పి.సుశీల, భానుమతీ రామకృష్ణ 4:57
3 "చెన్నా పట్నం" ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ 3:46
4 "ప్రేమాతో" ఎస్పీ బాలు, ఎస్.జానకి 2:57
5 "సలాం సాదుగుడు" ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ 4:17
6 "ప్రేమాతో" (పాథోస్) ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:11

మూలాలు మార్చు

  1. Saravanan, M. (2013) [2005]. AVM 60 Cinema (in Tamil). Rajarajan Pathippagam. pp. 318–319.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. Narasimham, M. L. (2011-04-03). "Against all odds". The Hindu. Retrieved 2020-08-22.{{cite news}}: CS1 maint: url-status (link)