గౌతమి (నటి)
సినీ నటి
తాడిమల్ల గౌతమి, తెలుగు, తమిళ సినిమా నటి. ఈమె విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగా సినిమాలలో నటించే అవకాశమొచ్చింది. ఈమె ఏసుక్రీస్తు జీవితగాథను చిత్రీకరించిన దయామయుడు సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈమె గురు శిష్యన్ సినిమాతో తమిళ సినిమా రంగములో ప్రవేశించినది. ఇందులో రజనీకాంత్ సరసన నటించినది. ఈమె 1998, జూన్ 4న చెన్నైలోని తాజ్ కోరమాండల్ హోటల్లో సందీప్ భాటియాను వివాహమాడినది.
గౌతమి | |
---|---|
![]() | |
జననం | తాడిమల్ల గౌతమి 1968 జూలై 21968 , జూలై 2 |
వృత్తి | నటి, టీవీ హోస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1987–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సందీప్ భాటియా (1998–1999) (విడాకులు) |
భాగస్వామి | కమలహాసన్ (2005–ప్రస్తుతం) |
పిల్లలు | సుబ్బులక్ష్మి (జ. 1999) |
గౌతమి, జెంటిల్మన్ సినిమాలో ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్ చేసిన చికుబుకు రైలే పాట చాలా ప్రాచుర్యము పొందినది.
గౌతమి నటించిన తెలుగు చిత్రాలుసవరించు
- దయామయుడు (1987)
- శ్రీనివాస కల్యాణం
- అగ్గి రాముడు
- అన్న
- విచిత్ర సోదరులు (1989)
- అన్న-తమ్ముడు (1990)
- జంటిల్ మేన్ (1993)
- సీక్రేట్ ఏజెంట్ (కమల్ హసన్ & అర్జున్ లతో)
- డియర్ బ్రదర్