బారా షహీద్ దర్గా (నెల్లూరు)

(బారా షహీద్ దర్గా నుండి దారిమార్పు చెందింది)

దాదాపు 1200 సంవత్సరాల క్రితం అంటే సా.శ. 551 లో ఇస్లాం మత ప్రచారం కోసం సౌదీ నుంచి, మక్కా షరీఫ్‌ నుంచి 12 మంది తరఖ్‌మాన్ల్‌ అనబడే వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కర్ణాటకలో హైదర్‌అలీ పరిపాలన, నెల్లూరులో నవాబుల పరిపాలన ఉండేది. వారు దేశంలో పర్యటిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద వారికి, ఇస్లామేతరులకు, మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో తరఖ్‌మాన్‌లు ప్రాణ త్యాగం చేశారు. అలా ప్రాణత్యాగం చేసిన వారిలో 12 మంది (బారాశహీద్‌లు) మొండాలను వారు వాహనాలుగా ఉపయోగించిన గుర్రాలు తీసుకుని వచ్చి నెల్లూరులోని దర్గామిట్ట నెల్లూరు చెరువు వద్ద పడేశాయి. ఆ మొండాలు భూమిలో కలిసి అక్కడే వారు సమాధులయ్యారు. భక్తులు ఆ ప్రదేశం లోనే వారికి సమాధులు వరుసగా నిర్మించి ఆరాధించడం మొదలెట్టారు.

బారా షహీద్ దర్గా ముఖద్వారం
బారాషహిద్ దర్గా వద్ద వేచివున్న దర్శకులు

ప్రతి సంవత్సరం ఇక్కడ మొహరం నెలలో జరిగే గంధ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది భక్తులు హాజరవుతుంటారు.

ఎలా చేరుకోవాలి

మార్చు

నెల్లూరు బస్టాండ్ నుంచి 1 కి.మీ . దూరంలో ఉంది

ఇవి కూడా చూడండి

మార్చు

రొట్టెల పండుగ, నెల్లూరు

బయటి లింకులు

మార్చు