బార్బడాస్‌లో హిందూమతం
బార్బడాస్‌లో హిందూమతం మైనారిటీ మతం. దేశ జనాభాలో హిందువులు 0.46% మంది ఉన్నారు. [1]
జనాభా వివరాలు
మార్చు1990 నాటికి బార్బడోస్ జనాభాలో హిందువులు 0.24% ఉన్నారు, ఇది 2000లో 0.34%కి పెరిగింది [2] 2010 జనాభా లెక్కల ప్రకారం 0.46%కి పెరిగింది. [3]
సంవత్సరం | హిందువుల జనాభా | హిందువుల శాతం | శాతం పెరుగుదల |
---|---|---|---|
1990 | 603 | 0.24% | |
2000 | 840 | 0.34% | +0.1% |
2010 | 1055 | 0.46% | +0.12% |
బార్బడాస్‌లోని చాలా మంది హిందువులు సెయింట్ మైఖేల్, క్రైస్ట్ చర్చిలలో నివసిస్తున్నారు. బార్బడోస్ జనాభాలో తూర్పు భారతీయులు 1.3% ఉన్నప్పటికీ, 0.46% మాత్రమే హిందువులు. [4]
సమకాలీన సమాజం
మార్చుబార్బడాస్ లోని హిందువులు ప్రధానంగా కేవలం 80 సింధీ కుటుంబాల కు చెందినవారు. వారిలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఒక మందిరం ఉంటుంది. అనేక సంవత్సరాలుగా సింధీలు హిందూ మతాన్ని సజీవంగా ఉంచారు. వారు హిందూ దేవతలను, భగవద్గీత, గురు గ్రంథ్ సాహిబ్‌లను కూడా పూజిస్తారు. బార్బడాస్‌లోని మెజారిటీ హిందువులు బియాస్ మహారాజ్ చరణ్‌సింగ్‌జీ (పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా), శ్రీ సత్య సాయి బాబా లేదా సాధు వాస్వానీ అనుచరులు. వీరిలో చాలా మంది శాకాహారులు, మద్యపానం చెయ్యరు. [5]
సెయింట్ మైఖేల్ లోని వెల్చెస్‌లో హిందూ దేవాలయం ఉంది. [6] బార్బడాస్‌లోని హిందువులు హోలీ లేదా ఫాగ్వా వంటి హిందూ పండుగలను జరుపుకుంటారు. [7]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2017-01-18. Retrieved 2019-01-09.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2018-02-05. Retrieved 2019-01-09.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2017-01-18. Retrieved 2019-01-09.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2017-01-18. Retrieved 2019-01-09.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ https://www.hinduismtoday.com/magazine/november-1998/1998-11-bhangra-in-barbados/
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-05. Retrieved 2022-01-21.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-05. Retrieved 2022-01-21.