బాలన్ మాధవన్ ఒక భారతీయ ప్రకృతి పరిరక్షణ ఫోటోగ్రాఫర్. అతను ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ కన్జర్వేషన్ ఫోటోగ్రాఫర్స్ సీనియర్ ఫెలో.[1]

బాలన్ మాధవన్
జాతీయతభారతీయుడు
విద్యబి.ఎ.
వృత్తిఫోటోగ్రాఫర్
జీవిత భాగస్వామిలతా మంగేష్
తల్లిదండ్రులు
  • ఎన్.మాధవన్ పిళ్లై (IFS) (తండ్రి)
  • వల్సలా దేవి (తల్లి)

కెరీర్

మార్చు

ఆయన ఎన్ మాధవన్ పిళ్లై ఫౌండేషన్ ఫర్ కన్జర్వేషన్ కమ్యూనికేషన్ [2] ని నడుపుతున్నాడు, ఇది అటవీ మార్గదర్శకులు, కార్మికులకు వార్షిక మాధవన్ పిళ్లై కన్జర్వేషన్ అవార్డును ప్రదానం చేస్తుంది.[3]

2017లో ఆయన ఫోటో యాత్రలో భాగంగా అంటార్కిటికాకు వెళ్లాడు.[4] ఆయన నాయకత్వం వహించిన యాత్రకు సంబంధించిన ఛాయాచిత్రాల ప్రదర్శన తిరువనంతపురంలో జరిగింది.[5] 2009లో ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ కన్జర్వేషన్ ఫోటోగ్రాఫర్స్ సభ్యత్వానికి మాధవన్ ఆహ్వానించబడ్డాడు.[6]

ప్రచురణలు

మార్చు
  • సాంక్చురీ ఫర్ ది సోల్ ఆఫ్ కేరళ టూరిజం[7]
  • పెరియార్ ఇన్ హెర్ ఎలిమెంట్స్[8]
  • వాటర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్[8]

అవార్డులు

మార్చు

1992లో ఆయన కీజో యమాజీ యుఎన్ఈపీ ఫోటోగ్రఫీ బహుమతిని అందుకున్నాడు. ఈ పోటీని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, కానన్ ఇంక్ సంయుక్తంగా నిర్వహించాయి. "మీ ప్రపంచంపై దృష్టి పెట్టండి (Focus on your world)" అనే ఇతివృత్తాన్ని పొందుపరిచారు. 1992 జూన్ 5న రియో డి జనీరోలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో బహుమతులు ప్రకటించబడ్డాయి.

మూలాలు

మార్చు
  1. "Balan Madhavan". International League of Conservation Photographers. Retrieved 2 March 2018.
  2. "Balan Madhavan". constantcontact.com. iLCP. Retrieved 2 March 2018.
  3. "Nature Caught on camera". The Hindu. 6 September 2010. Retrieved 2 March 2018.
  4. "Postcards from Antarctica". The Hindu. Retrieved 2 March 2018.
  5. "Antarctica in Frames". The New Indian Express. Express News service. 11 January 2018. Retrieved 2 March 2018.
  6. "Board of Directors". conservationphotographers.com. International League of Conservation Photographres. Retrieved 6 March 2018.
  7. "A sense of space". The Hindu. Retrieved 2 March 2018.
  8. 8.0 8.1 "Lifescapes". www.evolveback.com. Retrieved 2 March 2018.