బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన, పునరావాస కేంద్రం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధనా, పునరావాస కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం చేత నడుపబడుతున్న సేవా సంస్థ.
ఇది 1985 సంవత్సరం తిరుపతిలో స్థాపించబడింది. ఈ సంస్థ ఆర్థోపెడిక్స్ (శల్యవైద్యం) రంగంలో అనేక విధాలుగా జన్మతా కలిగిన లోపాలు, సెరిబ్రల్ పాల్సీ రోగులు, పోలియో వ్యాధిగ్రస్థులకు విలువైన చికిత్సలనందిస్తూ, నిరుపేదల సేవలో అంకితభావంతో సేవచేస్తున్నది. ఈ కేంద్రంలో 250 పడకల సామర్ధ్యంతో, నాలుగు ఆపరేషన్ థియేటర్లతో ఎయిర్ కండిషన్ తో కూడిన ఆసుపత్రి ఉంది.
చరిత్ర
మార్చుబాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన , పునరావాస కేంద్రం1994 లో BIRRD ట్రస్ట్‌గా మార్చబడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజల నుంచి వచ్చే విరాళాలకు సమానంగా సరిపోయే గ్రాంట్‌ను ఈ సంస్థకు అందచేస్తుంది . BIRRD కు దాతల నుంచి విరాళాలకు భారత ఆదాయపు పన్ను చట్టం క్రింద 100% మినహాయింపు ప్రతిపాదన వీరి పరిశీలనలో ఉంది. BIRRD ఆంధ్రప్రదేశ్‌లో పోలియో బాధిత పిల్లలకు సంబంధించిన విషయ డేటాను స్వచ్ఛంద సంస్థల సహకారంతో సేకరిస్తున్నారు, ఈ డేటా పరిశీలన తరువాత జిల్లా స్థాయిలో రోగులను పరీక్షిస్తారు, ఇప్పటికే మూడు జిల్లాలను ఈ పథకం అమలు చేస్తున్నారు.[1] తిరుమల తిరుపతి దేవస్థానము వారు BIRRD ఆసుపత్రికకు రోగులను దృష్టి లో ఉంచుకొని అదనపు ఆపరేషన్ థియేటర్లను కట్టాలని నిర్ణయించుకొన్నది. ప్రస్తుతము దక్షిణాది ప్రజలే గాక ఉత్తరాది నుంచి వచ్చే రోగులు కూడా ఎక్కువగా వస్తున్నారు.[2]
మూలాలు
మార్చు- ↑ "BALAJI INSTITUTE OF SURGERY, RESEARCH AND REHABILITATION FOR THE DISABLED". tirumala.org/. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 12 February 2021.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ operation theatres, BIRRD to get more (February 10, 2021). "BIRRD to get more operation theatres". divya-bharat.com/. Archived from the original on 12 ఫిబ్రవరి 2021. Retrieved 12 February 2021.