బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్

భారతీయ రాజకీయవేత్త

బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్ (బి. జి. ఖేర్ గానూ ప్రఖ్యాతులు) (మరాఠీ: बाळासाहेब गंगाधर खेर) (1888 ఆగస్టు 24 – 1957 మార్చి 8[1][2]) బొంబాయి రాష్ట్ర (ఇప్పటి గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలతో కలిసివుండేది) మొట్టమొదటి ముఖ్యమంత్రి (ప్రీమియర్ గా అప్పట్లో ప్రఖ్యాతం[3]). 1954లో భారత ప్రభుత్వం నుంచి ఆయన పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. బి.జి.ఖేర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. ఆయన మర్యాదకరమైన ప్రవర్తనను, మంచి లక్షణాలను గుర్తిస్తూ ప్రజలు ఖేర్ ను సజ్జన్ గా పిలిచేవారు. ఖేర్ పండితుడు, సుప్రసిద్ధ వక్త.

తొలినాళ్ళ జీవితంసవరించు

బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్ 1888 ఆగస్టు 24న కర్హాదె బ్రాహ్మణ కుటుంబంలో రత్నగిరిలో జన్మించారు.[4][4] జమ్ఖాండి రాష్ట్రంలో కుంద్గోల్లో తన చిన్నతనం గడిపారు. ఆ తర్వాత గోపాలకృష్ణ గోఖలే సూచనతో పుణెలో న్యూ ఇంగ్లీష్ స్కూల్లో చదువుకోవడానికి మారారు. తర్వాత 1908లో విల్సన్ కళాశాలలో ఉన్నత శ్రేణిలో బి.ఎ. డిగ్రీ పొందారు. సంస్కృతంలో మొదటి స్థానం పొందినందుకు భావ్ దాజి లాద్ బహుమతి పొందారు.[5]

బి.జి.ఖేర్, మణిలాల్ నానావతితో కలిసి మణిలాల్ ఖేర్ & కో అనే న్యాయ సంస్థను స్థాపించారు. 1918 జూన్ 7 నుంచి ప్రాక్టీసు ప్రారంభించారు. ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ సర్ ఫ్రాంక్ సి.వో.బీమన్ ఈ సంస్థ ప్రారంభోత్సవానికి విచ్చేయడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సంస్థ పేరు తర్వాత మణిలాల్ ఖేర్ అంబాలాల్ అండ్ కో అని పేరుమార్చారు.[6]

రాజకీయ రంగంలోసవరించు

1922లో స్వరాజ్ పార్టీ బొంబాయి బ్రాంచ్ కి కార్యదర్శిగా నియమితులవడంతో ఆయన రాజకీయ రంగంలోకి ప్రవేశించారు.[1] ఉప్పు సత్యాగ్రహం సమయంలో ఆయన అరెస్టై, 8 నెలల కఠిన కారాగారశిక్ష, జరిమానా జరిగింది. 1932లో మళ్ళీ అరెస్టు అయ్యి, మరో రెండు సంవత్సరాల పాటు కఠిన శిక్షతో పాటు జరిమానా పొందారు.

1937లో బొంబాయి ప్రావిన్సుకు ఆయన తొలి ప్రధానిగా ఎన్నికయ్యారు, 1939 అక్టోబరు వరకూ పదవిలో కొనసాగారు. 1940లో అరెస్టు అయి, ఖైదు అయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయనను అరెస్టు చేశారు. తిరిగి 1942 ఆగస్టులో ఖైదు అయ్యారు. ఆయన 1944 జూలై 14లో జైలు నుంచి విడుదల చేశారు.

ఆయన తిరిగి 1946 మార్చి 30లో బొంబాయి ప్రావిన్సుకు ప్రధానమంత్రి అయ్యారు. పూనా విశ్వవిద్యాలయం (ఇప్పుడు పూణె విశ్వవిద్యాలయం) ఏర్పాటుకు ఆయన కృషిచేశారు. ఖేర్ భవన్ గా విశ్వవిద్యాలయంలో స్థాపకుడైన ఖేర్ ను గౌరవిస్తూ ఓ భవనానికి పేరుపెట్టుకున్నారు. పదవిలో 1952 ఏప్రిల్ 21 వరకూ ఉన్నారు.

1957 మార్చి 8న పుణెలో ఆయన మరణించారు.

నోట్స్సవరించు

  1. 1.0 1.1 "This Day That Age". Chennai, India: The Hindu. 9 March 2007.
  2. "Indian autographers - Bal Gangadhar Kher". Indianautographs.com. Retrieved 2012-09-05.
  3. India's Struggle for Independence Bipan chandra. p. 332.
  4. 4.0 4.1 Growing Up Untouchable in India: A Dalit Autobiography - Vasant Moon, Gail Omvedt - Google Books. Books.google.com. Retrieved 2012-09-05.
  5. "B.G. Kher". Indian Post website.
  6. "Manilal Kher Ambalal & Co. - Advocates, Solicitors and Notary - About us - History". Mkaco.com. 1918-06-07. Archived from the original on 2017-07-08. Retrieved 2012-09-05.