బాలూ గుప్తే
బాలకృష్ణ పండరీనాథ్ " బాలూ " గుప్తే (1934 ఆగస్టు 30 - 2005 జూలై 5) భారతీయ క్రికెట్ ఆటగాడు, లెగ్ స్పిన్నర్.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బాలకృష్ణ పండరినాథ్ గుప్తే | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బొంబాయి | 1934 ఆగస్టు 30|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2005 జూలై 5 ముంబై | (వయసు 70)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్ బ్రేక్ గూగ్లీ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | సుభాష్ గుప్తే (సోదరుడు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 100) | 1961 జనవరి 13 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1965 మార్చి 5 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2022 జూన్ 3 |
గుప్తే బ్రిటిష్ ఇండియాలో బొంబాయిలో జన్మించాడు. అతను నారీ కాంట్రాక్టర్ నేతృత్వంలో 1960-61లో మద్రాస్‌లోని కార్పొరేషన్ స్టేడియంలో ఫజల్ మహమూద్ నేతృత్వంలోని పాకిస్తాన్‌పై తొలి టెస్టు ఆడాడు. 1960-61, 1964-65 మధ్య భారతదేశం తరపున మూడు టెస్టులు ఆడాడు. అతని ఫస్ట్ క్లాస్ కెరీర్ 1953-53 నుండి 1967-68 వరకు బాంబే, బెంగాల్, రైల్వేస్ తరపున జరిగింది. బాలూ గుప్తే 70 సంవత్సరాల వయస్సులో 2005 జూలై 5న బొంబాయిలో అనారోగ్యంతో మరణించాడు.
అతను భారతదేశానికి ఆడిన అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన సుభాష్ గుప్తేకి తమ్ముడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్
మార్చుబాలు గుప్తే ఫస్ట్-క్లాస్ ఆట జీవితం 1953-54 సీజన్ నుండి 1969-70 సీజన్ వరకు కొనసాగింది. భారత దేశీయ క్రికెట్‌లో బాంబే, బెంగాల్, రైల్వేస్‌లకు ఆడి అనూహ్య విజయాలు సాధించాడు. తన అన్నయ్య లెగ్-స్పిన్నర్ సుభాష్ గుప్తే క్రీడా శైలికి ఎక్కువగా అనుకూలంగా ఉండేవాడు. దేశీయ క్రికెట్‌లో గొప్ప సనాతన లెగ్ స్పిన్నర్ అయినప్పటికీ అంతర్జాతీయ వేదికలపై అన్నయ్యలా రాణించలేకపోయాడు.
1962-63 సీజన్‌లో, అతను దిలీప్ ట్రోఫీ ఫైనల్‌లో వెస్ట్ జోన్ సభ్యునిగా 55 పరుగులకు 9 వికెట్లు తీసుకున్నాడు. సౌత్ జోన్‌పై ఈ గణాంకాలు ఇప్పటివరకు పోటీలో అత్యుత్తమంగా పరిగణించబడతాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 417 వికెట్లు తీశాడు. రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో అతడు ఒకడు. 23.47 సగటుతో 255 వికెట్లు తీశాడు.
అంతర్జాతీయ క్రికెట్
మార్చుఅతను తన కెరీర్ మొత్తంలో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. అతను 1961 జనవరి 13 న పాకిస్తాన్ జట్టుపై తన తొలి టెస్టు ఆడాడు. 1965 మార్చి 5 న అతను కోల్‌కతాలో న్యూజిలాండ్ జట్టుతో చివరి టెస్టులో పాల్గొన్నాడు. నాలుగేళ్లలో అతను పాల్గొన్న మూడు టెస్టులూ స్వదేశంలో ఆడినవే.
1960-61 సీజన్‌లో ఫజల్ మహ్మద్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించింది. మద్రాసులోని కార్పొరేషన్ స్టేడియంలో నారీ కాంట్రాక్టర్ కెప్టెన్సీలో ఆడాడు. సుభాష్ గుప్తేను మద్రాస్ టెస్ట్ నుండి తొలగించబడినప్పుడు, బాలూను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఆ మ్యాచ్‌లో అతనికి వికెట్లేమీ పడలేదు. బ్యాటింగ్ పిచ్‌పై 35 ఓవర్లు బౌలింగు చేసి, 116 పరుగులు ఇచ్చి, వికెట్లేమీ తీసుకోలేదు.
దేశీయ క్రికెట్‌లో అతని అత్యుత్తమ క్రీడా నైపుణ్యానికి గుర్తింపుగా, అతన్ని జాతీయ జట్టులోకి తిరిగి తీసుకున్నారు. మూడేళ్ల తర్వాత అతను పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరిగిన కాన్పూర్ టెస్టు కోసం తీసుకున్నారు. ఈసారి అతను విఫలమయ్యాడు. ఆ తర్వాతి సీజన్‌లో కోల్‌కతాలో న్యూజిలాండ్‌కి వ్యతిరేకంగా మరో టెస్టు ఆడాడు. అతను ఆడిన మొత్తం మూడు టెస్టుల్లోనూ కలిపి మూడు వికెట్లు మాత్రమే తీశాడు.[2]
సుదీర్ఘ అనారోగ్యం తర్వాత బాలు గుప్తే, 2005 జూలై 5 న, 70 ఏళ్ల వయసులో ముంబైలో కన్నుమూశాడు.
మూలాలు
మార్చు- ↑ List of India Test Cricketers
- ↑ "Baloo Gupte Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-28.