బాస్టియాన్ ఫ్రాన్సిస్కస్ విల్హెల్మస్ డి లీడ్ (జననం 1999 నవంబరు 15) డచ్ క్రికెట్ ఆటగాడు. [1] [2] అతని తండ్రి, టిమ్ డి లీడ్, నెదర్లాండ్స్ తరపున 29 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. [3]

బాస్ డి లీడ్
2023 లో డర్హం తరఫున ఆడుతూ డి లీడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బాస్టియాన్ ఫ్రాన్సిస్కస్ విల్‌హెల్మస్ డి లీడ్
పుట్టిన తేదీ (1999-11-15) 1999 నవంబరు 15 (వయసు 25)
నూట్‌డార్ప్, నెదర్లాండ్స్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రBatting ఆల్ రౌండరు
బంధువులుTim de Leede (father)
Babette de Leede (cousin)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 61)2018 ఆగస్టు 1 - నేపాల్ తో
చివరి వన్‌డే2023 జూలై 7 - స్కాంట్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.5
తొలి T20I (క్యాప్ 38)2018 జూన్ 12 - ఐర్లాండ్ తో
చివరి T20I2022 నవంబరు 6 - దక్షిణాఫ్రికా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.5
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2022MI Emirates
2023–presentడర్హమ్‌
2023Northern Superchargers
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 30 31 6 39
చేసిన పరుగులు 765 610 340 897
బ్యాటింగు సగటు 27.32 30.50 85.00 24.91
100లు/50లు 1/2 0/4 1/3 1/2
అత్యుత్తమ స్కోరు 123 91* 103 123
వేసిన బంతులు 777 336 606 925
వికెట్లు 24 27 14 27
బౌలింగు సగటు 32.08 16.62 30.42 35.77
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/52 3/19 4/76 5/52
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 14/– 4/– 16/–
మూలం: Cricinfo, 6 September 2023

కెరీర్

మార్చు

అతను 2017 సెప్టెంబరు 29న జింబాబ్వేలో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా రాయల్ నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డ్ XI (KNCB XI) కొరకు లిస్టు A క్రికెట్‌లో ప్రవేశించాడు. [4] 2017 నవంబరు 29న 2015–17 ICC ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో నమీబియాపై నెదర్లాండ్స్ తరపున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసాడు.[5]

2018 ఫిబ్రవరిలో గాయం కారణంగా స్టెఫాన్ మైబర్గ్ టోర్నమెంటు నుండి తప్పుకోవడంతో, అతన్ని 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ కోసం నెదర్లాండ్స్ జట్టులోకి తీసుకున్నారు. [6] 2018 జూన్‌లో అతను 2018 నెదర్లాండ్స్ ట్రై-నేషన్ సిరీస్ కోసం నెదర్లాండ్స్ ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎంపికయ్యాడు. [7]

డి లీడ్, 2018 జూన్ 12న ఐర్లాండ్‌పై T20I రంగప్రవేశం చేసాడు.[8] 2018 జూలైలో, నేపాల్‌తో జరిగిన సిరీస్ కోసం నెదర్లాండ్స్ వన్‌డే జట్టుకు ఎంపికయ్యాడు. [9] అతను 2018 ఆగస్టు 1న నేపాల్‌పై నెదర్లాండ్స్ తరపున తన వన్‌డే రంగప్రవేశం చేసాడు.[10]

2019 జూలైలో, అతను యూరో T20 స్లామ్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభ ఎడిషన్‌లో రోటర్‌డ్యామ్ రైనోస్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు. [11] [12] అయితే, మరుసటి నెలలో ఆ టోర్నీని రద్దు చేసారు.[13]

2021 సెప్టెంబరులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం డచ్ జట్టులో డి లీడ్ ఎంపికయ్యాడు.[14]

2022 ఆగస్టులో డి లీడ్ కొత్త ILT20 పోటీలో MI ఎమిరేట్స్ జట్టు కోసం ఆడతాడని ప్రకటన వచ్చింది. [15]


2023 జూలైలో అతను 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయరులో స్కాట్లాండ్‌పై 5-52 తీసుకుని ఆ పై తన మొదటి వన్‌డే శతకం సాధించాడు. 2023లో భారతదేశంలో జరిగే క్రికెట్ ప్రపంచ కప్‌కు నెదర్లాండ్స్‌ అర్హత సాధించడంలో తోడ్పడ్డాడు.[16]

మూలాలు

మార్చు
  1. "Bas de Leede". ESPN Cricinfo. Retrieved 29 September 2017.
  2. "Bas de Leede, Netherlands – Age: 21". Emerging Cricket. 9 October 2021. Retrieved 10 October 2021.
  3. "Bas de Leede To Follow In Big Footsteps - Netherlands V Nambia". Cricket World. Retrieved 29 November 2017.
  4. "2nd Match, KNCB XI tour of Zimbabwe at Harare, Sep 29 2017". ESPN Cricinfo. Retrieved 29 September 2017.
  5. "ICC Intercontinental Cup at Dubai, Nov 29-Dec 2 2017". ESPN Cricinfo. Retrieved 29 November 2017.
  6. "Bas de Leede replaces injured Stephen Myburgh in Netherlands squad". International Cricket Council. Retrieved 21 February 2018.
  7. "Three new faces as Netherlands begin post-Borren era". ESPN Cricinfo. Retrieved 7 June 2018.
  8. "1st Match, Netherlands Tri-Nation T20I Series at Rotterdam, Jun 12 2018". ESPN Cricinfo. Retrieved 12 June 2018.
  9. "Selecties Nederlands XI voor Lord's en Nepal". KNCB. Retrieved 23 July 2018.
  10. "1st ODI, Nepal tour of England and Netherlands at Amstelveen, Aug 1 2018". ESPN Cricinfo. Retrieved 1 August 2018.
  11. "Eoin Morgan to represent Dublin franchise in inaugural Euro T20 Slam". ESPN Cricinfo. Retrieved 19 July 2019.
  12. "Euro T20 Slam Player Draft completed". Cricket Europe. Archived from the original on 19 జూలై 2019. Retrieved 19 July 2019.
  13. "Inaugural Euro T20 Slam cancelled at two weeks' notice". ESPN Cricinfo. Retrieved 14 August 2019.
  14. "Dutch ICC Men's T20 World Cup squad announced". Royal Dutch Cricket Association. Retrieved 10 September 2021.
  15. "Dutch cricketer Bas de Leede signs for Mumbai Indians". Royal Dutch Cricket Association. Retrieved 17 August 2022.
  16. "Bas de Leede shoots his shot to ignite Netherlands party". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-07.