బిందు (కాలింపాంగ్)

భారతదేశంలోని గ్రామం
(బిందు, కాలింపాంగ్ నుండి దారిమార్పు చెందింది)

బిందు, భారతదేశం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, కాలింపాంగ్ జిల్లా, కాలింపాంగ్ సబ్‌డివిజన్, గోరుబతన్ సిడి బ్లాక్‌లోని గ్రామం. ఇది ఇండో-భూటాన్ సరిహద్దులో ఉంది,[1] భారతదేశ రెండవ పురాతన ఆనకట్ట కలిగిన జలధకా నది ఒడ్డున ఉంది. ఇది జల్పాయిగురి నగరానికి 85 కి.మీ దూరంలో ఉంది.

బిందు
బిందు is located in West Bengal
బిందు
బిందు
భారతదేశం, పశ్చిమ బెంగాల్‌లో స్థానం
బిందు is located in India
బిందు
బిందు
బిందు (India)
Coordinates: 27°05′53″N 88°52′18″E / 27.09806°N 88.87167°E / 27.09806; 88.87167
దేశం( భారతదేశం)
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాకాలింపాంగ్
భాషలు
 • అధికారిక భాషలునేపాలీ, ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-WB
Vehicle registrationWB

భౌగోళికం

మార్చు

బిందు గ్రామం 27°05′53″N అక్షాంశం, 88°52′18″E రేఖాంశం వద్ద ఉంది.

వివరణ

మార్చు

బిందు, భూటాన్ సరిహద్దులో భారతదేశం వైపున ఉన్న చివరి గ్రామం. ఇది జలధకా నది, కొండలు, అడవులతో కూడిన ప్రకృతి దృశ్యానికి ప్రసిద్ధి చెందింది.[2] బిందు వద్ద మూడు ప్రవాహాల సంయోగం ఉంది. సిక్కింలోని చిన్న హిమనదీయ సరస్సు కుపుప్ సరస్సు నుండి ఉద్భవించే ఈ మూడు ప్రవాహాలను బిందు ఖోలా, దూద్ పోఖ్రీ , జల్ధకా అని పిలుస్తారు.[2] సంయుక్త ప్రవాహాలు బిందు వద్ద కలసి జలధక నది ఏర్పడుతుంది. జల్ధకా నదిపై బిందు డ్యామ్ అని పిలువబడే ఒక ఆనకట్ట ఉంది,[3] ఇది ఝలాంగ్ వద్ద ఉన్న జలధకా హైడల్ ప్రాజెక్ట్‌కు నీటి సరఫరాను నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది. ఇది భూటాన్‌ను దాటడానికి వంతెనగా పనిచేస్తుంది. అయితే కాలినడకన మాత్రమే ఈ ఆనకట్టను దాటవచ్చు.ఇక్కడ హైడల్ ప్రాజెక్టు కూడా ఉంది. ఇది గరిష్ట ప్రవాహానికి లోనైతే మొత్తం 44 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.

పంటలు

మార్చు

ఈ గ్రామంలో వివిధ తెగల ప్రజలు నివసిస్తున్నారు.[4] ఇక్కడ  నారింజ, ఏలకులు పండిస్తారు. ఇవి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి చేయబడతాయి.

మూలాలు

మార్చు
  1. "Explore The Last Village On Indo-Bhutan Border In West Bengal: Bindu". Whats Hot. Retrieved 2023-08-06.
  2. 2.0 2.1 "Bindu - The last point of West Bengal to North". www.indyatour.com. Retrieved 2019-04-08.
  3. "Bindu Dam- West Bengal". 1001 Things About North Bengal, North East India & Bhutan. Retrieved 2023-08-06.
  4. "Bindu Dooars, Tourist interest places in Bindu, Offbeat destinations in Dooars. | North Bengal Tourism". northbengaltourism.com. Retrieved 2020-02-12.