బింద్యారాణి దేవి

బింద్యారాణి దేవి భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టర్. ఆమె 2022లో జరిగిన కామ‌న్వెల్డ్ గేమ్స్‌లో మహిళల 55 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది.[2]

బింద్యారాణి దేవి
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుబింద్యారాణి దేవి సొరొఖైభం
జాతీయతభారతీయురాలు
జననం (1999-01-27) 1999 జనవరి 27 (వయసు 25)
ఇంఫాల్ వెస్ట్, మణిపూర్, భారతదేశం[1]
క్రీడ
క్రీడవెయిట్‌లిఫ్టింగ్
పోటీ(లు)55 కేజీ

క్రీడా జీవితం మార్చు

బింద్యారాణి దేవి 2016లో మలేషియాలోని పెనాంగ్‌లో జరిగిన ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి 10వ స్థానంలో నిలిచింది. ఆమె ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో జరిగిన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 54 కేజీల మహిళల 55 కేజీల క్లీన్ & జెర్క్ ఈవెంట్‌లో స్వర్ణ పతాకం గెలిచింది. బింద్యారాణి కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్స్ 2021లో రజత పతకాన్ని గెలుచుకుంది, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022కి నేరుగా అర్హత సాధించి, మహిళల 55 కేజీల విభాగంలో రజత పతకం గెలిచింది.[3]

బింద్యారాణి దేవి 2023 ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలిచింది.[4]

ఇవి కూడా చుడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Commonwealth Games 2022 squad: Full list of athletes in Indian weightlifting team". Sportstar (in ఇంగ్లీష్). 18 July 2022. Retrieved 3 August 2022.
  2. Sakshi (31 July 2022). "భారత్‌ ఖాతాలో నాలుగో పతకం.. వెయిట్‌లిప్టింగ్‌లో బింద్యారాణికి రజతం". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
  3. Namasthe Telangana (1 August 2022). "వెండి కొండ బింద్యారాణి". Retrieved 1 August 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. The Hindu (6 May 2023). "India's Bindyarani Devi wins silver at Asian Championships" (in Indian English). Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.