బిపిన్ చంద్ర సుప్రసిద్ధ చరిత్రకారుడు. జాతీయోద్యమం, సమకాలీన చరిత్ర, మతతత్వ వ్యతిరేక ఉద్యమాలపై రచనలు చేశారు.

బిపిన్ చంద్ర

జననం మార్చు

ఈయన హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రావ్యాలీ లో మే 27, 1928లో జన్మించారు.

విద్యాభ్యాసం మార్చు

లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేశారు.

పదవులు మార్చు

  • 1993లో యూజీసీ సభ్యునిగా పనిచేశారు.
  • 2002-12 మధ్య నేషనల్ బుక్ ట్రస్ట్ ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు.
  • ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చరిత్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు.

భారత స్వాతంత్ర్యోద్యమంపై బిపిన్ చంద్రకు ఎనలేని పాండిత్యం ఉంది. మహాత్మా గాంధీపై ఆయన సాధికారత సాధించారు.

విశేషాలు మార్చు

చరిత్ర పుస్తకాలు పాఠశాలలు, కాలేజీల సిలబస్‌లో చోటుసంపాదించుకున్నాయి. ఈయన రచించిన చరిత్ర పుస్తకాలూ పాఠశాలలో, కళాశాలలో సిలబస్ గా ఉన్నాయి

రచనలు మార్చు

  • ద మేకింగ్ ఆఫ్ మోడరన్ ఇండియా: ఫ్రమ్ మార్క్స్ టు గాంధీ
  • ద ఇండియన్ లెఫ్ట్: క్రిటికల్ అప్రైజల్
  • ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఎకనమిక్ నేషనలిజం
  • ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ: జేపీ మూవ్‌మెంట్ అండ్ ది ఎమర్జెన్సీ

పురస్కారాలు మార్చు

  • భారత ప్రభుత్వం ఇతనికి 2010లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది[1].

మరణం మార్చు

ఆగష్టు 30, 2014 ఉదయం గుర్గావ్ లోని ఆయన స్వగృహంలో నిద్రలోనే తుది శ్వాస విడిచారు.

మూలాలు మార్చు

  1. పద్మభూషణ్ పురస్కారం#2010