బిబిసి వరల్డ్ న్యూస్

బిబిసి వరల్డ్ న్యూస్ అనేది బిబిసి యొక్క అంతర్జాతీయ న్యూస్, ప్రస్తుత వ్యవహారాల టెలివిజన్ ఛానెల్. ఇది మరే ఇతర బిబిసి ఛానెల్ ప్రపంచములో మరే ఇతర వార్తా ఛానెల్ కి లేని విధంగా 2015-16 లో షుమారు 9.9 కోట్ల వారపు ప్రేక్షకులను కలిగి ఉంది.[3] 1991, మార్చి 11న బిబిసి వరల్డ్ సర్వీస్ టెలివిజన్ అనే పేరుతో ఐరోపా బయట ప్రారంభించబడిన ఈ ఛానెల్ (1995లో పేరును బిబిసి వరల్డ్ అని, 2008లో బిబిసి వరల్డ్ న్యూస్ అని పేరు మార్చారు) 24 గంటలు ప్రసారాలను అందించే ఛానెల్. ఈ కార్యక్రమాలలో బిబిస్ న్యూస్ బులెటిన్లు, సంక్షిప్త చిత్రాలు, జీవనశైలి కార్యక్రమాలు, ముఖాముఖిలు ఉన్నాయి. ఇతర వార్తా ప్రసార కంపెనీలతో పోటీపడుతున్నా, దీని ముఖ్యమైన భౌగోళిక పోటీదారు CNN ఇంటర్నేషనల్.

బిబిసి వరల్డ్ న్యూస్
ఆవిర్భావము 11 మార్చ్ 1991
Network బిబిసి న్యూస్
యాజమాన్యం బిబిసి
దృశ్య నాణ్యత 16:9 SDTV
ప్రేక్షకుల సంఖ్య వినియోగదారుల వివరాలు:
282 million homes
1.6 million hotel rooms
57 cruise ships
42 airlines
34 mobile phone platforms
78 million viewers per week (June 2008, [1])
నినాదము This is only BBC World, Television BBC International News Channel (1995–1999)
With news and informations 24 hours today (1999–2003)
Putting News First (2003–2008)
International News Television (2008–2010)[2]
దేశం యునైటెడ్ కింగ్డమ్ (for external consumption only)
భాష ఇంగ్లీషు, తెలుగు, మొత్తము 41భాషలు
ప్రసార ప్రాంతాలు ప్రపంచవ్యాప్తం (except the United Kingdom and most of the United States)
ప్రధాన కార్యాలయం లండన్, యునైటెడ్ కింగ్డమ్
Formerly called BBC World Service Television (1991–1994)
BBC World (1994–2008)
Sister channel(s) BBC News
BBC One
BBC Two
BBC Three
BBC Four
BBC Parliament
BBC HD
వెబ్సైటు BBCWorldNews.com
Tata Sky (India) Channel 536


బిబిసి తెలుగు జాలస్థలి

బిబిసి యొక్క స్వదేశీ చానెళ్ళ లాగా కాకుండా, బిబిసి వరల్డ్ న్యూస్ లైసెన్స్ రుసుము చే నిధులు సమకూర్చబడలేదు. దీనికి బదులుగా, ఈ ఛానెల్ కు ప్రచార ప్రకటనల ద్వారా నిధులు సమకూరుతాయి.

2008 ఏప్రిల్ 21న, ఈ ఛానెల్ తన పేరును బిబిస్ వరల్డ్ నుండి బిబిసి వరల్డ్ న్యూస్ అని మార్చుకుంది. ఒక కొత్త వీక్షణా గుర్తింపుతో సహా, బిబిసి ని £550,000 రీబ్రాండ్ చేసే ప్రక్రియలో భాగంగా ఈ పేరు మార్పు జరిగింది. ఆ తరువాత ఈ ఛానెల్ పునర్నిర్మించబడిన బిబిసి న్యూస్ ఛానెల్ యొక్క మునుపటి స్టూడియోకు మారింది.

2 అక్టోబరు 2017 న తెలుగుతో సహా నాలుగు భారతీయ భాషలలో సేవలు మొదలయ్యాయి.

చరిత్ర మార్చు

ప్రభుత్వ పెట్టుబడి లేకుండా బిబిసి వరల్డ్ సర్వీస్ టెలివిజన్ 1991, మార్చి 11 ప్రారంభించబడింది. తొలుత 1900 GMT సమయంలో రోజుకు ఒకసారి ఒక అరగంట వార్తా బులెటిన్ గా మొదలు పెట్టబడింది. ఈ కార్యక్రమ సంపాదకులు వరల్డ్ సవీస్ రేడియో నుండి వచ్చిన జోహన్ "జాన్" రామ్స్లాండ్, దేశీయ బిబిసి టివి నుండి వచ్చిన జాన్ ఎక్సేల్బి మానేజింగ్.

1994, జనవరి 1న, బిబిసి వరల్డ్ సర్వీస్ టెలివిజన్ రెండు స్టేషన్లుగా విడిపోయింది: బిబిసి ప్రైమ్ - చందా అవసరమయ్యే ఒక వినోద ఛానెల్, వార్తలు, ప్రస్తుత వ్యవహారాలపై దృష్టి ఉంచే ఉచిత ప్రసారమైన బిబిసి వరల్డ్. 1994 నుండి, ఈ సేవలు ఎన్నో బ్రాండింగ్ మార్పులకు గురి అయింది. 1994 నుండి 1997 వరకు, ఛానెల్ తన పేరును ప్రదర్శించుటకు తక్కువ గ్రాఫిక్ లను ఉపయోగించింది.

1997, అక్టోబరు 4న కార్పోరేషను కొరకు ఒక కొత్త లోగో వాడబడింది. బిబిసి న్యూస్ కొరకు ఇంకొక పెద్ద పునః ప్రారంభము 1999 లో వచ్చింది. యునైటెడ్ కింగ్ డమ్, బిబిసి వరల్డ్ రెండింటిలో భౌగోళికంగా ఎరుపు, క్రీమ్ రంగులో చేయబడిన ఒకే తీరైన ఆకృతిని ఏర్పాటుచేశారు. "డ్రమ్స్, బీప్స్" అనే శైలిపై ఆధారపడిన ఒక సంగీతమును ప్రవేశపెట్టారు. దీనిని ఇతర వార్తా కార్యక్రమాల యొక్క సాధారణ ఆర్కెస్ట్రా వెర్షనుల విభాగము నుండి వచ్చిన డేవిడ్ లోవె స్వరపరచారు.

అదే 'డ్రమ్స్, బీప్స్' శైలి సంగీతమును కొత్త గ్రాఫిక్ లతో ఉపయోగిస్తూ 2003లో రెండవ మార్పు జరిగింది. ఇది 1999లో జరిగిన దానికంటే ఎంతో తక్కువ కొలతలో ఉంది. ముఖ్యమైన రంగు నలుపు, ఎరుపు వర్ణంలోనికి మారేటప్పుడు సంగీతము స్వల్పంగా మార్చబడింది. స్టూడియోలు ఫ్రోస్ట్ గాజును తెలుపు, ఎరుపు ఆకృతులను రంగుల కొరకు వాడారు.

2008లో ఛానెల్ బిబిసి వరల్డ్ న్యూస్ అని పేరు మార్చబడింది.

ప్రసారం మార్చు

 
2008-2019

ఈ ఛానెల్ రెడ్ బీ మీడియా చే వారి ప్రసార కేంద్రము వద్ద ఉన్న నెట్వర్క్ కేంద్రము నుండి బిబిసి మీడియా విలేజ్ లో ప్రసారము చేయబడుతుంది. ఇది బిబిసి వైట్ సిటి, వైట్ సిటి, పశ్చిమ లండన్ లో ఒక భాగము. సమీప టెలివిజన్ కేంద్రము లోని స్టూడియో N8 నుండి అన్ని వార్తా ప్రసారాలు జరుగుతాయి. బిబిసి వరల్డ్ న్యూస్ యొక్క న్యూస్ గది 1994 వేసవిలో ఏర్పాటుచేసిన బిబిసి యొక్క గ్లోబల్ న్యూస్ హబ్ లో ఒక భాగము. బిబిసి వరల్డ్ న్యూస్ యొక్క న్యూస్ గది రోజంతా పనిచేస్తుంది.

అంతకు పూర్వము, ఈ చానల్ 4:3లో ప్రసారం అయ్యింది, అప్పుడు వార్తలను 14:9 డిజిటల్, అనాలాగ్ పద్ధతిన ప్రసారం చేసేవారు. దీని వల్ల తెరకు పైనా, కింది భాగాలలో నల్లటి పట్టీ కనిపిస్తుంది. 2009 జనవరి 13న 09:57 GMT సమయంలో, BBC వరల్డ్ న్యూస్ తన ప్రసారాలను 16:9 ఫార్మాట్ కు మార్చుకుంది, మొదటగా యాస్ట్రా 1L ఉపగ్రహం ద్వారా ఐరోపా లో,[4] తరువాత యుటెల్సాట్ హాట్ బర్డ్ 6 ఉపగ్రహం ద్వారా 2009 జనవరి 20 నుండి ఆసియా ప్రాంతాలకు వార్తలను ప్రసారం చేసింది.

లభ్యత మార్చు

 
2019-2022

బిబిసి వరల్డ్ న్యూస్ సాధారణంగా ప్రసారానికి ఉచిత (FTA) ఛానలుగా వీక్షించబడుతుంది. ఈ ఛానలు ఐరోపా లోని అన్ని ప్రాంతాలలో, ప్రపంచం లోని చాలా భాగాలలో ఉపగ్రహము ద్వారా లభ్యమౌతుంది. ప్రపంచములో ఎక్కువ భాగములో, అన్ని ఉపగ్రహ, కేబుల్ వేదికలపై కొనసాగింది. భారత దేశములో, 2006, జూన్ 15 వరకు ఇది FTA కాని ఇప్పుడు చందా చెల్లించవలసిన ఛానలు.

యునైటెడ్ కింగ్‌డమ్ మార్చు

ఈ ఛానెల్ యునైటెడ్ కింగ్డంలో అధికారికంగా పూర్తి-సమయ ఛానెల్ కాదు, ఎందుకంటే అది వ్యాపార ప్రకటనల ద్వారా నిర్వహించబడుతుంది కాబట్టి. (బిబిసి యొక్క సొంత చానళ్ళు టెలివిజన్ లైసెన్స్ రుసుముతో నిధులు సమకూర్చుకుంటారు, ఈ విధముగా ప్రసారమయ్యే చానళ్ళను చూస్తున్న ప్రజానీకము, సంస్థలు దాని కోసం రుసుము చెల్లించవలసి ఉంటుంది). అయినప్పటికీ, ఈ ఛానెల్ వివిధ యురోపియన్ ఉపగ్రహాలపై ఉచిత ప్రసార హోదా కలిగి ఉన్నందున, దీనిని అందుకోవడం సులభమే.

బిబిసి వరల్డ్ న్యూస్ వివిధ యూరోపియన్ ఉపగ్రహ వ్యవస్థల పై (ఆస్ట్రా, హాట్బర్డ్ ఉపగ్రహాలతో సహా) 'ఉచిత ప్రసార' లభ్యమవుతున్నది కనుక, యునైటెడ్ కింగ్డంలో ఎవరైనా తమ సొంత డిష్ లను ఆ ఉపగ్రహాల నుండి సంకేతాలు అందుకునే దశలో ఏర్పరిస్తే ఈ ఛానెల్ ను ఉచితంగా చూడవచ్చు.

అంతర్జాల ప్రవేశము మార్చు

బిబిసి వరల్డ్, ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా, క్విక్ టైంను ఉపయోగించి తమ వెబ్సైటుపై ఉండగలిగారు. కాని ఇది నిలిపివేయబడింది. అప్పటినుండి, బిబిసి వరల్డ్ న్యూస్ రియల్ ప్లేయర్ ప్లస్ అనే చందా సేవల ద్వారా ఆన్లైన్ లభ్యమవుతున్నది. కాని ఈ సేవలు, US, UK లేక కెనడాలో లభించవు.

యునైటెడ్ కింగ్డం వెలుపల, లైవ్ స్టేషను ద్వారా లైవ్ ఇంటర్నెట్ స్ట్రీమ్ గా ఉచితంగా చూడవచ్చు. ఒక సమయంలో, యునైటెడ్ స్టేట్స్ కు చెందిన IP ఎడ్రెస్ వాడుతున్న వినియోగదారులను ఛానెల్ ను చూచుటకు అనుమతించలేదు. దీనికి కారణం, లైవ్ స్టేషనుకు ఆ దేశంలో ఈ సేవలు అందించేందుకు అనుమతులు లేకపోవడమే. కాని, 2011 ఏప్రిల్ నాటికి, ఈ వెబ్సైట్ ద్వారా ఈ ఛానెల్ ను చూసే సౌలభ్యం లభించింది.

బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, ఈ ఛానెల్ భూతల ఛానెల్ గానే కాకుండా, మొబైల్ ఫోన్ యందు సబ్‌స్క్రీప్షన్ సేవగా కూడా లభిస్తుంది.

తెలుగు మార్చు

బిబిసి తెలుగు [5] 2017 అక్టోబరు 2 న ప్రారంభమైంది..[6] భారతదేశ 11 భాషల్లో తన సేవలను విస్తరించే దిశగా తొలిగా తెలుగుతో పాటు నాలుగు భాషలలో సేవలు అందిస్తుంది.[7] ప్రధానంగా అంతర్జాల సేవలందించే ఈ మాధ్యమం ఈటీవీ ఛానళ్ల భాగస్వామ్యంతో బిబిసి ప్రపంచం అనే కార్యక్రమం ద్వారా సాంప్రదాయక ప్రసార టెలివిజన్లో ప్రేక్షకులకు చేరువవుతున్నది.

కార్యక్రమాలు మార్చు

ప్రత్యక్ష వార్తా కార్యక్రమాలు:

 • బిబిసి వరల్డ్ న్యూస్ - బిబిసి నుండి తాజా అంతర్జాతీయ వార్తలు.
 • బిబిసి వరల్డ్ న్యూస్ అమెరికా - సమగ్రమైన వార్తలు మరయు మాట్ట్ ఫ్రీ (సోమవారము-గురువారము), కాట్టి కే (శుక్రవారము) లచ్చే విశ్లేషణ. బిబిసి యొక్క వాషింగ్టన్ D.C. స్టూడియో నుండి ప్రసారము చేయబడుతుంది.
 • జియమ్టి - జార్జ్ అలగియ (సోమవారము-గురువారము), స్టీఫెన్ సక్కుర్ (శుక్రవారము) ప్రపంచ వ్యాప్తంగా తాజా వార్తల పురోగతిని, వ్యాపార, క్రీడల సమాచారముతో సహా అందిస్తారు.
 • ఇంపాక్ట్ - ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ప్రభావితం చ్సుస్తుంది కాబట్టి భౌగోళిక వార్తలు. మిషాల్ హుసెయిన్ (సోమవారము-గురువారము), లైసె డోసేట్ (శుక్రవారము) సంచలన వార్తలు, చర్చలు, విశ్లేషణలు అందిస్తారు. వీరు ఆసియా పసిఫిక్ దేశాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి బిబిసి కరెస్పాండెంట్ల సహాయముతో ఈ వార్తలను అందిస్తారు.
 • ది హబ్ - నిక్ గోవింగ్ తన విస్తృతమైన ముఖాముఖి, లోతైన విశ్లేషణలతో ప్రతిరోజూ జరిగే ఘటనలను అంచనా వేస్తారు. దీనితోపాటు ఆ రోజు యొక్క ముఖ్య సంక్షిప్త వార్తలను అందిస్తారు ఇవి దక్షిణ ఆసియా, మధ్య తూర్పు దేశాలలోని ప్రేక్షకులను ప్రభావితం చేస్తాయి.
 • వరల్డ్ న్యూస్ టుడే - తమ రోజువారి కవరేజుకు మరింత లోతైన విశ్లేషణ అవసరమైన ప్రేక్షకుల కొరకు వార్తా కార్యక్రమము. ఐరోపా, మధ్య తూర్పు దేశాలు, ఆఫ్రికాలను దృష్టిలో ఉంచుకొని, జీనాబ్ బదావి (సోమవారము, గురువారము-శుక్రవారము), కిర్స్టి లాంగ్ (మంగళవారము-బుధవారము) అత్యంత క్లిష్టమైన ఘటనలకు ఒక సందర్భమును, అవగాహనను అందిస్తారు.

ఇతర ప్రత్యక్ష కార్యక్రమాలు:

 • ఆసియా బిజినెస్ రిపోర్ట్ - ఇది సింగపూర్ నుండి ప్రత్యక్ష ప్రసారము అవుతుంది. అవసరమైన వ్యాపార సంబంధ వార్తలను అందిస్తుంది
 • ఆసియా టుడే - ఆసియాలోని ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ప్రసారము చేయబడే రోజువారి ప్రస్తుత వ్యవహార కార్యక్రమము. ఈ కార్యక్రమము బిబిసీ కరెస్పాండెంట్ల నుండి నివేదికలు, ప్రముఖ ఆటగాళ్ళ నుండి ముఖాముఖిలు తీసుకొని తయారు చేయబడుతుంది.
 • స్పోర్ట్ టుడే - అన్ని తాజా క్రీడా వార్తలు, ప్రపంచము అంతటి నుండి ఫలితాలు.
 • వరల్డ్ బిజినెస్ రిపోర్ట్ - ప్రపంచ ఆర్థిక కేంద్రాల నుండి విశ్లేషణలతో తాజా వ్యాపార వార్తలు.
 • వరల్డ్ హావ్ యువర్ సే - ప్రతి వారము, బిబిసి వరల్డ్ ప్రేక్షకులు మల్టీమీడియా ఫోన్-ఇన్ కార్యక్రమములో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమము బిబిసి వరల్డ్ సర్వీస్ రేడియో, బిబిసి ఆన్లైన్ లతో పాటుగా ప్రసారము చేయబడతాయి, ప్రేక్షకులు ఆ రోజు ఎంచుకోబడ్డ విషయాలపై తమ అభిప్రాయాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పంచుకోవచ్చు.

ముందుగా రికార్డు చేయబడ్డ కార్యక్రమాలు:

 • ఆఫ్రికా బిజినెస్ రిపోర్ట్ - ఖండము అంతటా నెలసరి వ్యాపారము యొక్క పరిశీలన. ఆఫ్రికా యొక్క ఆర్థిక వ్యవస్థను మారుస్తున్న ప్రజలు, వ్యాపారవేత్తలతో ముఖాముఖి.
 • క్లిక్ - అన్ని తాజా గాడ్జెట్లు, వెబ్సైట్లు, ఆటలు, కంప్యూటర్ పరిశ్రమ వార్తల గురించి సమగ్ర మార్గదర్శకము.
 • డేట్ లైన్ లండన్ -- లండన్ లో మూలాలున్న విదేశీ కరెస్పాండెంట్లలు వారములో జరిగిన అంతర్జాతీయ వార్తల గురించి వారి అభిప్రాయాలను ఇస్తారు.
 • డెవలప్ ఆర్ డై - ఛాలెంజ్లపై పరిశోధనలు, నివేదికలు, వారి సంపదను పెంచుకొనుటకు లేక కొన్ని సార్లు పేదరికము నుండి బయట పడాలని చేసే ప్రయత్నాలలో అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క సమస్యలు, విజయాలు.
 • ఈక్వెస్ట్రియన్ వరల్డ్ - పోటీ కంటే ఎక్కువగా ఈక్వెస్ట్రియన్ వరల్డ్ క్రీడలు, వాటిని చుట్టుకొని ఉన్న జీవనశైలిపై దృష్టి పెడుతుంది.
 • ఫాస్ట్ ట్రాక్ - యాత్ర గురించిన తాజా వార్తలతో ఉన్న ధారావాహిక. ఇది పరిశ్రమ నుండి వచ్చే కార్యక్రమము. వ్యాపారము లేక విశ్రాంతి కొరకు యాత్రలు చేసే ప్రజల కొరకు తాజా ఒప్పందాలు, గమ్యస్థానాలు ఈ కార్యక్రమములో ఉంటాయి.
 • హార్డ్ టాక్ - స్టీఫెన్ సక్కుర్ భౌగోళికంగా వార్తలలో ఉన్న వ్యక్తులతో, ప్రముఖులతో మాట్లాడతారు.
 • ఇండియా బిజినెస్ రిపోర్ట్ - ఇండియా బిజినెస్ రిపోర్ట్ రానున్న వారములో జరగనున్న వ్యాపార విషయాలపై అత్యవసరమైన మార్గదర్శకమును అందిస్తుంది.
 • మిడిల్ ఈస్ట్ బిజినెస్ రిపోర్ట్ - గల్ఫ్ లో జరిగే వాణిజ్య, వ్యాపార, ఆర్థిక విషయాల గురించి కనుగొంటుంది, ఈ ముఖ్యమైన ఆర్థిక ప్రాంతము ఎలా పనిచేస్తుందో తెలపదము, మిగత ప్రపంచముతో ఈ ప్రాంతము ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుపుతుంది.
 • న్యూస్‌నైట్ - జెరేమి పక్స్మాన్ ఆ వారములోని చిత్రాల గురించి తెలుపుతారు, న్యూస్‌నైట్ గురించిన చర్చలు ఉంటాయి.
 • అవర్ వరల్డ్ - ఇందులో ప్రపంచములోని వర్తమాన వ్యవహారాలపై బిబిసి మంచి వార్తా కార్యక్రమాలు ఉంటాయి. భౌగోళిక విషయాల విశదీకరణ, విశ్లేషణ చూపే సంక్షిప్త చిత్రాలు బిబిసి యొక్క జర్నలిజం అత్యున్నతమైనదిగా చూపుతుంది.
 • రిపోర్టర్స్ - బిబిసి యొక్క ప్రపంచ వ్యాప్త కరెస్పాండెంట్ల నెట్వర్కు నుండి వారపు నివేదికలు.
 • రష్యా బిజినెస్ రిపోర్ట్ - బిబిసి యొక్క వ్యాపార నిపుణుల బృందం రష్యా అంతటి నుండి నివేదికలు అందిస్తుంది. ఈ క్లిష్టమైన దేశము గురించి తెలుసుకొంటూ వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య నాయకులౌతున్న కంపెనీల, వ్యాపార నాయకుల గురించి నివేదిక ఇస్తారు.
 • స్పిరిట్ ఆఫ్ యాచింగ్ - ఈ ధారావాహికలో నౌకాయాన ప్రపంచములో జరిగిన ఉత్తేజభరితమైన ఘటనల గురించి వెలిక తీస్తుంది. ఈ చిత్రాలు పోటీల వెనుక ఉన్న మానవ కథనాల గురించి, వాటి వెనుక ఉన్న భావావేశము గురించి, ప్రపంచ తరగతి క్రీడా పోటీలలో పాల్గొనుటకు అవసరమైన అంకితభావమును గురించి తెలుపుతాయి.
 • టాకింగ్ మూవీస్ - టాం బ్రూక్ సినిమా నుండి తాజా వార్తలు, సమీక్షలను హాలీవుడ్, న్యూ యార్క్ ల నుండి నివేదికలతో సహా అందిస్తారు.
 • ది దోహ డిబేట్స్ - కతార్ లో ప్రతి నెల ఆహ్వానించబడిన ప్రసంగకర్తలు, చర్చలో పాల్గొనే అవకాశము ఉన్న ప్రేక్షకుల సమక్షంలో అరబ్, ఇస్లామిక్ వరల్డ్ యొక్క ముఖ్యమైన విషయాల గురించి చర్చలు జరుపుతారు.
 • ది రికార్డ్ ఐరోపా - షిరిన్ వీలర్ చే ఐరోపా యొక్క రాజకీయాలపై లోతైన విశ్లేషణ (ఐరోపా లో మాత్రమే ప్రదర్శింపబడుతుంది; ఇంకా UK లోని బిబిసి పాలమెంటులో కూడా ప్రదర్శింప బడుతుంది).
 • ది వరల్స్ డిబేట్ - ఈ కార్యక్రమము ప్రపంచ వ్యాప్త రాజకీయ, ఆర్థిక, వ్యాపార, కళల, మీడియా, ఇతర విభాగాల ప్రతినిధులకు ముఖ్యమైన ప్రశ్నలను అడుగుతుంది. పానెల్స్, పాల్గొనే ప్రేక్షకులు విషయాలకు సంబంధించిన వాటి గురించి చర్చిస్తారు.
 • థర్డ్ ఐ - పన్నెండు దేశాల ఆర్థిక మూలాధారాల పరిశీలన, బ్యాలెన్స్ షీట్లు, స్టాక్ మార్కెట్లకు అవతల ఆలోచిస్తూ. కొంతమంది అత్యుత్తమ ఆర్థిక, వ్యాపార విలేఖరుల నుండి స్థూల పరిశీలన.
 • థిస్ వీక్ - ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిబిసి యొక్క 250 కరెస్పాండెంట్ల నెట్వర్క్ నుండి వారపు నివేదికలు.
 • యుకె రిపోర్ట్ - యునైటెడ్ కింగ్డం విస్తీర్ణం అంతటా ఉన్న బిబిసి యొక్క రిపోర్టర్ల, కరెస్పాండెంట్ల వారపు నివేదికలు.
 • వీకెండ్ వరల్డ్ - బిబిసి బ్రాడ్కాస్టర్ పడ్డి ఓ కొన్నెల్ చే అందించబడిన వీకెండ్ వరల్డ్, వరల్డ్ న్యూస్ కార్యక్రమాలపై ప్రేక్షకుల యొక్క విమర్శలు, వారాంతములో ప్రసారమయ్యే కార్యక్రమాల యొక్క సంక్షిప్త చిత్రాలు.
 • వరల్డ్ హావ్ యువర్ సే ఎక్స్‌ట్రా - వరల్డ్ హావ్ యువర్ సే ఎక్స్‌ట్రా కార్యక్రమము బిబిసి వరల్డ్ న్యూస్ ప్రేక్షకులను మల్టీ మీడియా ఫోన్-ఇన్ కార్యక్రమములో పాల్గొనుటకు మరొక అవకాశము ఇస్తుంది. ఇది బిబిసి వరల్డ్ సర్వీస్ రేడియో, బిబిసి ఆన్లైన్ లతో పాటుగా ప్రసారము చేయబడుతుంది. ప్రేక్షకులు ఆ రోజు ఎంచుకోబడ్డ విషయముపై తమ అభిప్రాయాలను ప్రపచ వ్యాప్త ప్రేక్షకులతో పంచుకోవచ్చు.

బిబిసి వరల్డ్ న్యూస్ మార్చు

 
బిబిసి వరల్డ్ న్యూస్ స్టూడియో పశ్చిమ లండన్ లోని బిబిసి దూరదర్శన్ కేంద్రములో ఉన్న ప్రధాన న్యూస్ రూమ్ ప్రక్కన ఉంది.

బిబిసి వరల్డ్ న్యూస్ బులెటిన్లు కెనడాలోని CBC న్యూస్ నెట్వర్క్, ఆస్ట్రేలియాలోని ABC న్యూస్ 24 లపై కూడా ప్రసారము చేయబడతాయి.

హీత్రూ ఎక్స్‌ప్రెస్ రైలు మార్గములో లండన్ పడింగ్టన్ నుండి లండన్ హీత్రూ విమానాశ్రయమునకు ప్రయాణించే ప్రయాణీకులకు కూడా ప్రత్యేకంగా రికార్డు చేయబడిన బిబిసి వరల్డ్ న్యూస్ బులెటిన్ ను వారి పదిహేను నిమిషాల ప్రయాణ సమయములో ప్రసారము చేయబడుతుంది. ఈ బులెటిన్ ను "వెల్కం టు బిబిసి వరల్డ్ న్యూస్ ఆన్బోర్డ్ ది హీత్రూ ఎక్స్‌ప్రెస్" అనే పేరుతో ప్రవేశపెట్టబడింది. ఈ సంక్షిప్త బులెటిన్ రోజు రెండుసార్లు సవరించబడుతుంది, రైలులోని రెండు తరగతులలో LCD టెలివిజనులలో చూపించబడుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విమానయాన సంస్థలు కూడా బిబిసి వరల్డ్ న్యూస్ యొక్క రికార్డు చేయబడిన బులెటిను ప్రసారం చేస్తాయి. వీటిలో ముఖ్యాంశాలు కాని లేకపోతే విమానము యొక్క వినోద వ్యవస్థలో అందుబాటులో ఉన్న మొత్తం బులెటిను కాని ప్రసారం చేస్తాయి. బిబిసి వరల్డ్ న్యూస్ కలిగిన విమానయాన సంస్థలు : ఎమిరేట్స్ ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్, కథే పసిఫిక్, కతార్ ఎయిర్వేస్, ఎతిహాడ్ ఎయిర్వేస్, యునైటెడ్ ఎయిర్లైన్స్.. యునైటెడ్ కింగ్డం నుండి బయలుదేరే బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాలలో టేక్-ఆఫ్ అయిన కొద్ది సేపటికి ప్రయాణీకులు ఛానెల్ 1 పై ఈ బులెటినులను చూడవచ్చు. లండన్-హీత్రూ, లాస్ ఏంజిల్స్ (, న్యూ యార్క్-JFK 2009 వేసవి నాటికి) మధ్య తిరిగే విమానాలలో ఎయిర్ ఫ్రాన్స్ కూడా ఫ్రాన్స్ 2 న్యూస్ బదులుగా పూర్తి బులెటినును ప్రసారం చేస్తుంది.[8]

సమర్పకులు మార్చు

వార్తల సమర్పకులు మార్చు

జార్జ్ అలగియ (సోమవారము-గురువారము), స్టీఫెన్ సాకుర్ (శుక్రవారము) GMTను అందిస్తారు, మిశాల్ హుసెయిన్ (సోమవారము-గురువారము), లైసె డౌసెట్ (శుక్రవారము) ఇంపాక్ట్ అందిస్తారు, నిక్ గోవింగ్ ది హబ్ అందిస్తారు, జీనాబ్ బదావి (సోమవారము, గురువారము-శుక్రవారము), క్రిస్టి లాంగ్ (మంగళవారము-బుధవారము) వరల్డ్ న్యూస్ టుడే అందిస్తారు, మాట్ట్ ఫ్రీ (సోమవారము-గురువారము), కాట్టి కే (శుక్రవారము) బిబిసి వరల్డ్ న్యూస్ అమెరిక అందిస్తారు, రోస్ అట్కిన్స్ వరల్డ్ హావ్ యువర్ సే అనే కార్యక్రమాన్ని అందిస్తారు.

బిబిసి వరల్డ్ న్యూస్ అందిచేవారు: మార్టిన్ డెన్నిస్, పీటర్ డోబ్బీ, కోమల డుమోర్, డేవిడ్ ఈడేస్, మైక్ ఎంబ్లె, కరిన్ జియన్నోనే, గీత గురు-మూర్తి, లకి కాకిన్గ్స్, నాగ మంచెట్టి, అద్నాన్ నవాజ్, జమీ రాబర్ట్సన్, బబిత శర్మ, ఓవెన్ థామస్, అలస్టేయిర్ యేట్స్.

అప్పుడప్పుడు కార్యక్రమములను అందించే ఇతరులు: మార్టిన్ క్రోక్సాల్, జేమ్స్ దాక్వేల్, జూలియెట్ డన్లోప్, పోనెహ్ ఘోద్దూసి, డెబొరా మకేంజీ, కాసియా మాడేర, నిషా పిళ్ళై, కేట్ సిల్వర్టన్, టిం విల్కాక్స్.

వ్యాపార సమర్పకులు మార్చు

వ్యాపార సమర్పకులు: తాన్య బెక్కేట్ట్, సల్లి బండాక్, సారా కొబం, సల్లి ఈడెన్, జూలియెట్ ఫాస్టర్, ఆరోన్ హేస్లేహర్స్ట్, జామీ రాబర్ట్సన్, ఓవెన్ థామస్. రికో హైజోన్, శరణ్‌జీత్ లే ఆసియా వ్యాపార నివేదికను, ఆసియా టుడేను సింగపూర్ నుండి అందిస్తారు.

క్రీడా సమర్పకులు మార్చు

క్రీడా సమర్పకులు: మైక్ బుషేల్, రేష్మిన్ చౌదరి, అమండ డేవిస్, సీన్ ఫ్లెచర్, కార్తి జ్ఞానసాగరం, మాట్ట్ గూడ్రీక్, అమేలియా హారిస్, సెలీన హించ్క్లిఫ్ఫే, సంజీవ్ శెట్టి, సారా స్టిర్క్, స్యూ తెఅర్లె.

వాతావరణ సమర్పకులు మార్చు

వాతావరణ సమర్పకులు : దర్రెన్ బెట్ట్, డేనియల్ కర్బెత్ట్, అలెక్స్ దీకిన్, లియం దుట్టన్, క్రిస్ ఫాక్స్, పీటర్ గిబ్స్, జాన్ హంమొండ్, సారా కీత్-లుకాస్, సైమన్ కింగ్, లూసీ లియర్, నిక్ మిల్లర్, సూసన్ పొవెల్, నీనా రిడ్జ్, మాట్ట్ టేలర్, లారా టోబిన్, హెలెన్ విల్లెట్ట్స్, జే వయన్నే.

మాజీ సమర్పకులు మార్చు

చానెలుపై ఇంతకు మునుపు కనిపించిన సమర్పకులు: సమీర అహ్మద్ (ప్రస్తుతము ఛానెల్ 4 న్యూస్ తో), లిండ్సే బ్రన్చార్, టోని ఛాంపియన్, జోనాథన్ చార్లెస్, పీటర్ కో, స్టీఫెన్ కోలే (ప్రస్తుతము AI జజీర ఇంగ్లీష్ తో), దర్శిని డేవిడ్ (ప్రస్తుతము స్కై న్యూస్స్ UK తో), మాయ ఇవెన్, అడ్రియన్ ఫినిఘన్ (ప్రస్తుతము AI జజీర ఇంగ్లీష్ తో) కరెన్ బోవర్మాన్ (ప్రస్తుతము బిబిసి వరల్డ్ ఫీచర్స్ విభాగములో), లిజ్ జార్జ్, జెక్ లించ్, డోనాల్డ్ మెక్ కొమిక్, అనిత మెక్ నాట్ (ప్రస్తుతము AI జజీర ఇంగ్లీష్ తో) కేశిని నవరత్నం, లిజ్ పిక్, రిచర్డ్ క్వెస్ట్, సుసాన్ ఒస్మాన్.

ప్రదర్శన మార్చు

వ్యత్యాసము మార్చు

బిబిసి వరల్డ్ న్యూస్, ఎక్కువ భాగము, ప్రపంచము అంతటా ఒకే ఛానెల్; వ్యాపార ప్రకటనలు మాత్రము దీని భేదాలుగా ఉన్నాయి. అయినప్పటికీ, కొన్ని ప్రాంతీయ కార్యక్రమ వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఇండియన్ ఫీడ్స్, ఐరోపా లో మాత్రమే ప్రసారమయ్యే ది రికార్డ్ ఐరోపా వంటి చాలా కార్యక్రమాలు ప్రత్యేకముగా ప్రాంతీయ వీక్షణము కొరకు తయారు చేయబడతాయి. దీనికి తోడుగా, సింగపూర్ నుండి ప్రసారము అయ్యే ఆసియా వ్యాపార నివేదిక ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, మధ్య తూర్పు దేశాలలో మాత్రమే ప్రసారము చేయబడుతుంది. మిగత ప్రపంచము అంతా వరల్డ్ బిజినెస్ రిపోర్ట్ చూస్తుంది. వరల్డ్ బిజినెస్ రిపోర్ట్ ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, మధ్య తూర్పు దేశాలలో ప్రదర్శింపబడుతుంది, కాని ఆయా దేశాలను బట్టి వేరువేరు సమయాలలో ప్రసారం చేయబడుతుంది. ఇంకా, ఆసియా బిజినెస్ రిపోర్ట్ 0130 BST సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసారము అవుతుంది.

ఇతర చానెళ్లకు లాగానే కేబుల్ లేక సాటేలైట్ అందించేవారు వ్యాపార ప్రకటనలు వేయనప్పుడు, బిబిసి వరల్డ్ న్యూస్ యొక్క చాలా కార్యక్రమాలలోని విరామాలలో తదుపరి కార్యక్రమాల ప్రకటనలు మాత్రమే వస్తాయి. బిబిసి న్యూస్ సమయంలో, వాణిజ్య ప్రకటనలు ఉండవలసిన స్థానంలో ప్రచారం చేయని వార్త కథనాలు ప్రసారమవుతాయి. ఇది BBC వరల్డ్ న్యూస్ యొక్క బ్రాడ్ బ్యాండ్ వర్షన్ల విషయంలోనిది, యునైటెడ్ స్టేట్స్ లోని పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ (PBS) స్టేషన్లలో ప్రసారమయ్యే BBC వరల్డ్ న్యూస్ వర్షన్ల విషయంలోనిది. అయినప్పటికీ, నెట్వర్క్ అంతటా ప్రసారమమ్య్యే కొన్ని భౌగోళిక ప్రచారకాలు, సమర్పణలు ఉన్నాయి.

కౌంట్ డౌన్ వరుసక్రమము మార్చు

దాని ప్రారంభము నుండి, ఇంకా చెప్పాలంటే, బిబిసి న్యూస్ ఛానెల్ తో తన సాహచర్యము నుండి, ప్రతి గంటకు వచ్చే వార్తా బులెటిన్ కొరకు కౌంట్ డౌన్ ఛానెల్ ప్రదర్శన యొక్క లక్షణముగా ఉంది. దీనికి తోడుగా డేవిడ్ లోవె స్వరపరచిన సంగీతము కూడా ఉంటుంది.

ప్రస్తుతము ఉన్న కౌంట్ డౌన్ లో వార్తలను ప్రసారము చేయుటలో పనిచేసిన వివిధ విభాగాలలో ఉన్న రిపోర్టర్లు, సాంకేతిక ఉద్యోగులను కలిగి ఉంటుంది. సిస్టర్ ఛానెల్ అయిన బిబిసి న్యూస్ లాగానే, కౌంట్ డౌన్ ఛానెల్ లోగోతో ముగుస్తుంది.

పురస్కారాలు మార్చు

బిబిసి వరల్డ్ న్యూస్ 2006 నవంబరులో అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ అవార్డ్స్ వద్ద బెస్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానెల్గా పేరుగాంచింది.[9]

సూచనలు మార్చు

 1. "BBC World News announces successes from 07/08 and reveals new tri-media plans". BBC Press Office. 6 May 2008. Retrieved 22 August 2010.
 2. Sweney, Mark (17 November 2008). "BBC World News unveils global promos". The Guardian. UK. Retrieved 27 March 2009.
 3. "BBC – BBC's global audience rises to 372m – Media Centre". Retrieved 31 July 2017.
 4. "BBC World News goes widescreen". YouTube. 13 January 2009. Retrieved 22 August 2010.
 5. "బిబిసి తెలుగు". బిబిసి.
 6. "BBC has launched news services in four Indian languages". Indiantelevison. Retrieved 14 December 2018.
 7. "తెలుగు సహా ప్రాంతీయభాషల్లో విస్తరించనున్న బిబిసి". వన్ ఇండియా. 2016-11-16.
 8. "Disponibles Sur Toutes Nos Destinations" (PDF). Air France. 2009. Retrieved 22 August 2010.
 9. "Key Dates". BBC World News. Archived from the original on 31 మే 2010. Retrieved 22 August 2010.

పోటీదారులు మార్చు

 • అల్ జజీరా ఇంగ్లీష్
 • ఆస్ట్రేలియా నెట్వర్క్
 • CNN ఇంటర్నేషనల్
 • CCTV-9
 • డ్యూయిష్‌వెల్లి
 • యూరోన్యూస్
 • ఫాక్స్ న్యూస్ ఛానెల్ ఇంటర్నేషనల్
 • ఫ్రాన్స్24
 • MVC – MUNDOVISION (ఆంగ్ల న్యూస్ ఛానెల్)
 • రష్యా టుడే
 • ప్రెస్ టివి
 • స్కై న్యూస్ ఇంటర్నేషనల్
 • బ్లూమ్బర్గ్ టెలివిజన్
 • CNBC

బాహ్య లింకులు మార్చు