బిమ్లా బుటి
బిమ్లా బుటి భౌతిక శాస్త్రవేత్త. ఈవిడ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ (ఆనర్స్), ఎంఎస్సీ పూర్తి చేసాక షికాగో విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగంలో చదువును కొంసాగించింది. షికాగోలో ఎస్ చంద్రశేఖర్తో పనిచేసి ప్లాస్మా ఫిజిక్స్ లో పీహెచ్‍డీను 1962లో అందుకుంది. అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వచ్చాక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్ గా పనిచేస్తూ అమెరికాకు తిరిగి వెళ్ళి గోడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (నాసా) లో పని చేయాలని నిర్ణయించుకుంది. 1968 నుండి రెండేళ్ళ పాటు ఐఐటీ ఢిల్లీలో పనిచేసింది. అప్పటికి భౌతికశాస్త్ర పరిశోధన శాలకు సంచాలకుడిగా పనిచేస్తున్న విక్రం సారాభాయ్, ఈమెను PRLలో పని చేయవలసిందిగా ఆహ్వానించాడు. అక్కడ ఆమె 1970 నుండి 1993 వరకూ సహాయాచార్యురాలిగా, ఆచార్యురాలిగా, వరిష్ఠాచార్యురాలిగా, అధిపతిగా పనిచేసింది.[1]
బిమ్లా బూటి | |
---|---|
జననం | 1933 |
పౌరసత్వం | భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
రంగములు | భౌతిక శాస్త్రం; ప్లాస్మా ఫిజిక్స్ |
వృత్తిసంస్థలు | ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ |
చదువుకున్న సంస్థలు | ఢిల్లీ విశ్వవిద్యాలయం అయూనివర్సిటీ ఆఫ్ చికాగో |
పరిశోధనా సలహాదారుడు(లు) | సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ |
ప్రసిద్ధి | భౌతికశాస్త్రవేత్త |
విద్యాపరమయిన , పరిశోధనా సంబంధిత విజయాలు
మార్చుPRLలో ఉండగా ఈమె పరిశోధనాత్మక ప్లాస్మా ఫిజిక్స్ ను మొదలుపెట్టింది. పరిశోధనల స్థాయి పెంచి ఈ చిన్ని సమూహం PRL కన్నా పెద్దది అయి, ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ అనే సంస్థగా అణు శక్తి విభాగం (భారత ప్రభుత్వ సంస్థ) కింద కొత్తగా రూపొందింది. 1985 ఉండి 2003 వరకూ ఇటలీలోని ట్రీఎస్ట్ లో ఉన్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థీరిటికల్ ఫిజిక్స్ కు డైరెక్టర్ గా ఈమె పనిచేసింది. ఎన్నో పరిశోధనా పత్రాలను సమర్పించింది. పైగా నాలుగు పుస్తకాలకు కూడా సంపాదన చేసింది. ఎందరో విద్యార్థులకు శిక్షణనిచ్చింది, నాసాలో పలు విభాగాలలో పనిచేసింది. నాసాలో ఈమె పనిచేసిన విభాగాలు : గోడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, మేరీలాండ్; కాలిఫోర్నియా లోని ఏమ్స్ రీసెర్చ్ సెంటర్ ;, కాలిఫోర్నియా ఫాసడీనాలో ఉన్న జెట్ ప్రొపల్షన్ లేబరేటరీ (JPL). ఆమె ఉద్యోగ విరమణ తరువాత నాలుగేళ్ళు ఫాసడీనాలోని JPL లో గడిపింది.
ఇతర కృషి
మార్చు- 1992-93 లో ప్లాస్మా సైన్స్ సొసైటీ ఆఫ్ ఇండియాను ఏర్పరచి, దానికి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరించడం.
- 1977-1983 వరకూ ఐట్రిపుల్ఈ యొక్క ప్లాస్మా సైన్సెస్ ట్రాన్సాక్షన్స్ కు సహ సంపాదకురాలిగా వ్యవహరించడం.
- 1997-99 వరకూ ఉపాధ్యక్షురాలిగానూ, 1991-94 వరకూ అధ్యక్షురాలి హోదాలోనూ కమిషన్ 49, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్లో వ్యవహరించారు.
- 1996-98 వరకూ ఢిల్లీలోని గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్లో సభ్యురాలిగా ఉన్నారు.
- 1997-99 వరకూ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్లో సభ్యురాలు.
- 1997-99 లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో ఫిజిక్స్ పానెల్ సభ్యురాలిగా వ్యవహరించారు.
- 1991-93 ఐఎన్ఎస్ఏ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నారు.
ఇవి కాక PRLలో పనిచేస్తున్నప్పుడు ఎన్నో కొత్త పురస్కారాలకు వ్యవస్థాపన చేసారు. వీటిలో కొన్ని: యువ శాస్త్రజ్ఞులకు ప్లాస్మా సొసైటీ ద్వారా పురస్కారాలు, ఐఐటీ ఢిల్లీ ద్వారా ఉత్తమ మహిళా పరిశోధకురాలు పురస్కారం స్కాలర్షిప్, స్వర్ణపతకం.
పురస్కారాలు , బిరుదులు
మార్చు- 1977 - విక్రం సారాభాయ్ గ్రహశాస్త్ర పురస్కారం
- 1993 - జవాహర్లాల్ నెహ్రూ శతజయంతి లెక్చర్షిప్ పురస్కారం
- 1994 - ఐఎన్ఎస్ఏ వైను బాప్పు మెడల్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్
- 1996 - యూనివర్సిటీ ఆఫ్ షికాగో వారి ప్రొఫెషనల్ అచీవ్‍మెంట్ సైటేషన్ అవార్డ్
- 2010 - యూఎస్ మెడల్ ఫర్ ఫండమెంటల్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ది ఫిజిక్స్ ఆఫ్ నా లీనియర్ వేవ్స్ అండ్ ఖెయాస్
- ఫెలో ఆఫ్ టి డబ్ల్యూ ఏ ఎస్ (TWAS)
- ఫెలో ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఇండియా)
- ఫెలో ఆఫ్ అమెరికన్ ఫిజికల్ సొసైటీ
- ఫెలో ఆఫ్ ది ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ
ఇవి కాక ఈమెకు TWAS, ది అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఫర్ ది డెవెలపింగ్ వర్ల్డ్, ది నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ (భారతదేశం), అలాహాబాద్, అమెరిచన్ ఫిజికల్ సొసైటీలలో ఫెల్లోషిప్ ఉంది.
మూలములు
మార్చు- ↑ "ఐఎన్ఎస్ఏ వద్ద వ్యాసం". Archived from the original on 2014-03-16. Retrieved 2013-11-13.
వెలుపలి లింకులు
మార్చుమూలాలు
మార్చు- [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా