బిలాల్ ఆసిఫ్

పాకిస్తానీ క్రికెటర్, గాయకుడు-గేయరచయిత

మహ్మద్ బిలాల్ ఆసిఫ్ (జననం 1985, సెప్టెంబరు 24) పాకిస్తానీ క్రికెటర్, గాయకుడు-గేయరచయిత.[2] పాకిస్తాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

బిలాల్ ఆసిఫ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మహ్మద్ బిలాల్ ఆసిఫ్
పుట్టిన తేదీ (1985-09-24) 1985 సెప్టెంబరు 24 (వయసు 38)
సియాల్‌కోట్, పంజాబ్, పాకిస్తాన్
ఎత్తు6 ft 3 in (191 cm)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
బంధువులుజాహిద్ సయీద్ (మామ)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 233)2018 అక్టోబరు 7 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2018 డిసెంబరు 3 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 206)2015 అక్టోబరు 3 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2015 నవంబరు 11 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011–presentSialkot
2015Sialkot Stallions
2016క్వెట్టా గ్లేడియేటర్స్
2018–లాహోర్ కలందర్స్
2019/20–presentసెంట్రల్ పంజాబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 5 3
చేసిన పరుగులు 73 40
బ్యాటింగు సగటు 9.12 13.33
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 15 38
వేసిన బంతులు 1174 132
వికెట్లు 16 5
బౌలింగు సగటు 26.50 19.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 6/36 5/25
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/–
మూలం: Cricinfo, 22 January 2021

2018 ఆగస్టులో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ద్వారా 2018–19 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[3][4]

వ్యక్తిగత జీవితం మార్చు

మహ్మద్ బిలాల్ ఆసిఫ్ కువైట్‌లో ఉన్న ఎలక్ట్రీషియన్ తండ్రి కుమారుడు, దేశీయ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ జాహిద్ సయీద్ మేనల్లుడు బిలాల్ ఆసిఫ్ మూలాలు దస్కా శివార్లలో, సియాల్‌కోట్‌కు సమీపంలో ఉన్న అల్లో మహర్ షరీఫ్ గ్రామానికి చెందినవి. మహ్మద్ బిలాల్ ఆసిఫ్ ఆర్ట్స్‌లో పట్టా పొందాడు. పాటలు పాడేవాడు.[5]

క్రికెట్ రంగం మార్చు

దేశీయ క్రికెట్ మార్చు

ట్వంటీ20 మ్యాచ్‌లో 114తో అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆసిఫ్ రికార్డు సృష్టించాడు.[6][7]

2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్తాన్ కప్ కోసం సింధు జట్టులో ఎంపికయ్యాడు.[8][9] టోర్నమెంట్ సమయంలో సింధుకు జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్, నాలుగు మ్యాచ్‌లలో ఆరు అవుట్‌లు చేశాడు.[10] 2019 మార్చిలో, 2019 పాకిస్తాన్ కప్ కోసం ఫెడరల్ ఏరియాస్ జట్టులో ఎంపికయ్యాడు.[11][12]

2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ టోర్నమెంట్ కోసం సెంట్రల్ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[13][14] 2021 జనవరిలో, 2020–21 పాకిస్తాన్ కప్ కోసం సెంట్రల్ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[15][16]


అంతర్జాతీయ క్రికెట్ మార్చు

2015 జూలైలో శ్రీలంక పర్యటన కోసం పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[17] 2015, అక్టోబరు 3న జింబాబ్వేపై పాకిస్తాన్ తరపున తన వన్డే అరంగేట్రం చేసాడు.[18]

2015 అక్టోబరు 5న జింబాబ్వేతో జరిగిన తన రెండవ వన్డేలో బిలాల్ తన మొదటి అంతర్జాతీయ ఐదు వికెట్ల పంటను సాధించాడు. బ్యాటింగ్ లో 39 బంతుల్లో 38 పరుగులు చేశాడు.[19][20] అయితే, మ్యాచ్ తర్వాత అనుమానాస్పద బౌలింగ్ చర్యగా నివేదించబడ్డాడు.[21] ఇతని బౌలింగ్ యాక్షన్‌పై మూల్యాంకనం చేసిన తర్వాత, ఇంగ్లాండ్‌తో పర్యటన కోసం అక్టోబరు 19న పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు తిరిగి పిలిపించబడ్డాడు.[22] ఐసీసీ 30 అక్టోబర్ 2015న క్లియర్ చేసింది.[23]

2017 సెప్టెంబరులో, శ్రీలంకతో సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు, కానీ అతను ఆడలేదు.[24] 2018 సెప్టెంబరులో, ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[25] 2018, అక్టోబరు 7న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ తరపున తన అరంగేట్రం చేశాడు.[26] టెస్టుల్లో అరంగేట్రంలోనే ఐదు వికెట్లు తీసిన పాకిస్థాన్ తరఫున 11వ బౌలర్ అయ్యాడు.[27]

2020 జూన్ లో, కరోనా-19 మహమ్మారి సమయంలో ఇంగ్లండ్‌కు పాకిస్తాన్ పర్యటన కోసం నలుగురు రిజర్వ్ ఆటగాళ్ళలో ఒకరిగా ఎంపికయ్యాడు.[28]


సంగీత రంగం మార్చు

2020లో పంజాబీ ట్రాక్ అఖియాన్ విడుదలతో గాయకుడు-గేయరచయితగా తన వృత్తిని ప్రారంభించాడు.[29]

2021లో పాకిస్తాన్ సూపర్ లీగ్ కోసం అనధికారిక గీతమైన యే హై పిఎస్ఎల్ ను వ్రాసి పాడాడు.[30]

మూలాలు మార్చు

  1. "Cricketer Bilal Asif gets serious about singing, to release debut track". Geo Super. 19 January 2020. The 6'3 cricketer [...]
  2. "Bilal Asif". ESPN Cricinfo. Retrieved 3 July 2015.
  3. "PCB Central Contracts 2018–19". Pakistan Cricket Board. Retrieved 6 August 2018.
  4. "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPN Cricinfo. Retrieved 6 August 2018.
  5. Umar Farooq (5 October 2018), "Who is Bilal Asif?", ESPNCricinfo.
  6. "Records | Twenty20 matches | Batting records | Most runs in debut match | ESPN Cricinfo". Cricinfo. Retrieved 28 March 2017.
  7. "Group A: Abbottabad Falcons v Sialkot Stallions at Faisalabad, May 15, 2015 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 28 March 2017.
  8. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 21 April 2018.
  9. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 21 April 2018.
  10. "Pakistan Cup 2018, Sindh: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 4 May 2018.
  11. "Federal Areas aim to complete hat-trick of Pakistan Cup titles". Pakistan Cricket Board. Retrieved 25 March 2019.
  12. "Pakistan Cup one-day cricket from April 2". The International News. Retrieved 25 March 2019.
  13. "PCB announces squads for 2019–20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
  14. "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 4 September 2019.
  15. "Pakistan Cup One-Day Tournament promises action-packed cricket". Pakistan Cricket Board. Retrieved 7 January 2021.
  16. "Pakistan Cup One-Day Tournament: Fixtures Schedule, Teams, Player Squads – All you need to Know". Cricket World. Retrieved 7 January 2021.
  17. "Mohammad Irfan returns to ODI squad". ESPNcricinfo. ESPN Sports Media. 3 July 2015. Retrieved 3 July 2015.
  18. "Pakistan tour of Zimbabwe, 2nd ODI: Zimbabwe v Pakistan at Harare, Oct 3, 2015". ESPN Cricinfo. Retrieved 3 October 2015.
  19. "Pakistan vs Zimbabwe third ODI". ESPNcricinfo. ESPN Cricinfo. 5 October 2015. Retrieved 5 October 2015.
  20. "Bilal Asif five-for rolls Zimbabwe for 161". ESPNcricinfo. ESPN Cricinfo. 5 October 2015. Retrieved 5 October 2015.
  21. "Bilal Asif reported for suspect action". ESPN Cricinfo. Retrieved 6 October 2015.
  22. "Bilal to join Pakistan squad, Azhar to return home". ESPNcricinfo. ESPN Sports Media. 19 October 2015. Retrieved 19 October 2015.
  23. "Bilal Asif cleared by ICC after testing". ESPNcricinfo. ESPN Sports Media. 30 October 2015. Retrieved 30 October 2015.
  24. "Uncapped Hamza, Sohail picked for SL Tests". ESPN Cricinfo. Retrieved 23 September 2017.
  25. "Mohammad Amir dropped for two-Test series against Australia". ESPN Cricinfo. Retrieved 27 September 2018.
  26. "1st Test, Australia tour of United Arab Emirates at Dubai, Oct 7–11 2018". ESPN Cricinfo. Retrieved 7 October 2018.
  27. "Pakistan vs Australia, 1st Test: Bilal Asif's Six-Wicket Haul Puts Pakistan In Command On Day Three". NDTV. Retrieved 9 October 2018.
  28. "Haider Ali the new face as Pakistan name 29-man squad for England Tests and T20Is". ESPN Cricinfo. Retrieved 12 June 2020.
  29. Fatima, Komal (21 January 2020). "Presenting Bilal Asif, a cricketer, songwriter and a singer". Bol News. Retrieved 26 December 2022.
  30. Khan, Aizbah (15 February 2021). "Cricketer Bilal Asif Releases New Anthem For PSL Fans". Bol News. Retrieved 17 January 2023.

బాహ్య లింకులు మార్చు