బిశ్వనాథ్ పట్నాయక్
బిశ్వనాథ్ పట్నాయక్ గాంధేయవాది, సర్వోదయ, భూదాన్ నాయకుడు. ఒడిషా రాష్ట్రం లోని కుజేంద్రి, బలిగూడ అనే గిరిజన ప్రాంతాల్లో నిస్వార్థమైన, నిర్మాణాత్మకమైన కృషి చేసినందుకు గాను 2008 లో జమ్నాలాల్ బజాజ్ పురస్కారం గెలుచుకున్నాడు. [1]
బిశ్వనాథ్ పట్నాయక్ | |
---|---|
జననం | కుమరాడ, గంజాం | 1916 నవంబరు 11
మరణం | 2010 మే 29 | (వయసు 93)
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భూదానోద్యమం, గిరిజనుల అభ్యున్నతికి కృషి |
తల్లిదండ్రులు | తండ్రి: ఉపేంద్ర పట్నాయక్ |
తొలి జీవితం
మార్చుబిశ్వనాథ్ పట్నాయక్ 1916 నవంబర్ 11 న అప్పటి గంజాం జిల్లాలోని కుమారద గ్రామంలో జన్మించారు. బిశ్వనాథ్ గ్రామం లోని పాఠశాలలో చదువుకున్నాడు. తండ్రి ఉపేంద్ర పట్నాయక్, బిశ్వనాథ్ చిన్నతనం లోనే మరణించగా, తాత ఘనశ్యామ్ పట్నాయక్ అతన్ని పెంచాడు. కొన్నాళ్ళకు అతను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వెళ్లాడు. అక్కడ 8 వ తరగతి వరకు చదువుకున్నాడు. 17 సంవత్సరాల వయస్సులో, తన గ్రామ పాఠశాలలో అనధికారిక ఉపాధ్యాయునిగా ఏడు రూపాయల నెల జీతంతో వృత్తి జీవితం మొదలుపెట్టాడు. అక్కడే అతను గాంధేయవాది గోపబంధు చౌదరి తో ప్రేరితుడై, అతని సహాయకుడిగా పనిచేయడం మొదలు పెట్టాడు. ఖాదీ ఉద్యమాన్ని విస్తరించడానికి చౌదరి అతడిని కోరాపుట్‌కు పంపాడు. పట్నాయక్ 1940 లో కుజేంద్రి వెళ్ళాడు.
నిర్మాణాత్మక కృషి
మార్చుపట్నాయక్ ప్రత్యేక ఉత్కల్ రాష్ట్ర ఉద్యమంలో చేరారు. బనబాసి సేవా సమితిలో పని చేయడం మొదలు పెట్టాడు. [2] ఈ సంస్థను 1972 లో గోపబంధు చౌదరి స్థాపించాడు. పేద గిరిజనుల విద్య, అభ్యున్నతి వంటి పనులపై ఈ సంస్థ కృషి చేసింది. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను స్థాపించింది. గిరిజన పిల్లల అనేక గురుకుల పాఠశాలలను నడిపింది. బిశ్వనాథ్ కోరాపుట్‌లో ఖాదీని బాగా ప్రచారం చేసాడు. అతడిని కోరాపుటియా గాంధీ అని పిలిచేవారు. [3] అంటరానితనానికి వ్యతిరేకంగా అతను పోరాటం చేసాడు. కృపాసింధు హోతా ఆదేశాల మేరకు, షెడ్యూల్డు కులాలు, తెగల ప్రజలు బిశ్వనాథ్ నాయకత్వంలో కుజేంద్రి లోని హిందూ దేవాలయం లోకి ప్రవేశించారు. అతను వినోబా భావేకి సన్నిహితుడు. కోరాపుట్ ప్రాంతంలో భూదాన్ ఉద్యమం మొదలు పెట్టాడు. ఇది బాగా విజయవంతమైంది. [4] [5] [6] అతను క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు.
ప్రజలు అతన్ని "అజ్ఞ్యా" (ఒరియాలో 'సర్') అని పిలిచేవారు.
పురస్కారాలు
మార్చుపట్నాయక్ అందుకున్న పలు పురస్కారాల్లో కొన్ని ఇవి:
- భారతీయ ఆదిమజాతి సేవక్ సంఘ్, 1995 నుండి ఉత్తమ సామాజిక కార్యకర్త పురస్కారం
- జస్టిస్ రాజ్‌కిషోర్ దాస్ సమ్మన్, 1996
- సరళ పురస్కారం, 2002
- రాజీవ్ గాంధీ సద్వాబన పురస్కారం, 2003
- ప్రద్యుమ్న బాల సమ్మన
- కొంధామల సిటిజన్ ఫోరమ్ ఫెలిసిటేషన్ పురస్కారం
- జమ్నాలాల్ బజాజ్ పురస్కారం, 2008 [7]
మరణం
మార్చుబిశ్వనాథ్ పట్నాయక్ 2010 మే 29 న ఒడిశా లోని కంధమాల్ జిల్లా బలిగూడలో మరణించాడు. అతని వయస్సు 93. [8] [9]
మూలాలు
మార్చు- ↑ "Jamnalal Bajaj awards-2008" Jamnalal Bajaj Awards 2008
- ↑ "Banabasi seva samiti" Archived 31 మే 2014 at the Wayback Machine
- ↑ "The Hindu" An article in the Hindu
- ↑ "Orissa Review-2012" Archived 31 మే 2014 at the Wayback Machine An article in Orissa Review ,August 2012
- ↑ "Odisha Review, February - March - 2013" Archived 22 అక్టోబరు 2014 at the Wayback Machine
- ↑ " An article in Utkal Prasanga,July-2014 by Dr. Atul chandra Prodhan- Swadhinata parabarti odishare sabvodaya Andolana" Archived 20 జనవరి 2015 at the Wayback Machine
- ↑ "Jamnalal Bajaj Foundation"
- ↑ "Indian Express"
- ↑ "Outlook"