గోపబంధు చౌదరి

భారతీయ సామాజిక కార్యకర్త.స్వాతంత్ర్య సమరయోధుడు.

గోపబంధు చౌదరి, (1895 మే 8 - 1958 ఏప్రిల్ 29) [1] భారతదేశంలోని, ఒడిషా రాష్ట్రం, కటక్లో జన్మించాడు. అతను ఒక భారతీయ సామాజిక కార్యకర్త. స్వాతంత్ర్య సమరయోధుడు. గోపబంధు సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమాలలో పాల్గొన్నాడు.[2]

గోపబంధు చౌదరి
జననం(1895-05-08)1895 మే 8
మరణం1958 ఏప్రిల్ 29(1958-04-29) (వయసు 62)
విద్యాసంస్థప్రెసిడెన్సీ యూనివర్సిటీ, కోల్‌కతా
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిరమాదేవి చౌదరి

జీవితం తొలిదశలో

మార్చు

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా ఖేరసా గ్రామంలో గోకులానంద చౌధురికి గోపబంధు జన్మించాడు. అతని తండ్రి భూస్వామి కుటుంబానికి చెందినవాడు.ప్రముఖ న్యాయవాది.[3] ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేసిన నబకృష్ణ చౌదరి అతనికి తమ్ముడు.అతను 1912లో అప్పటి ప్రెసిడెన్సీ కళాశాల, కోల్‌కాతా నుండి గణితంలో బి.ఎ.లో పట్టభద్రుడయ్యాడు. అతను 1914 లో అదే కళాశాల నుండి ఉన్నత స్థాయి పట్టభద్రతను పొందాడు.191లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి తన ప్రాథమిక న్యాయపట్టాను పొందాడు.[4] విద్యాభ్యాసం తర్వాత అతను బ్రిటిష్ ప్రభుత్వంలో ఉప న్యాయాధికారిగా చేరాడు. గోపబంధు 1914లో మధుసూదన్ దాస్ మేనకోడలు రమాదేవి చౌదరిని వివాహం చేసుకున్నాడు [5]

స్వాతంత్ర్యోద్యమంలో

మార్చు

1919 లో రాజకీయ కార్యకలాపాలు, అధ్యయనాల కోసం ఉద్దేశించిన కటక్‌లో భారతీ మందిర లైబ్రరీ స్థాపనలో ఇతరులతో సంబంధం ఏర్పరచుకున్నాడు. 1920 లో అతను జాజ్‌పూర్‌లో డిప్యూటీ మేజిస్ట్రేట్, బరువా, బారిలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాడు. అక్కడి ప్రాంతాల ప్రజల అసలైన బాధతో అతను కదిలిపోయాడు. ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు సబ్ డివిజనల్ అధికారి అతడిని అంగీకరించని వాస్తవానికి విరుద్ధంగా నివేదిక సమర్పించమని కోరాడు.తత్ఫలితంగా అతను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.[6] తన జీవితాంతం ప్రజల సేవలో గడపాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఒడిశా ప్రజలను ఆశ్చర్యపరిచిన అపూర్వమైన చర్య.ప్రముఖ నవలా రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అతని జీవిత చరిత్రకారుడు గోపీనాథ్ మొహంతి మాటల్లో గోపబంధు చౌదరిని గురించి ఇలా అన్నాడు.

 "ఒరిస్సాలో ప్రకంపనలు వచ్చాయి. దాదాపు అన్ని వార్తాపత్రికలు ఈ సంఘటనను నివేదించాయి. ప్రజలు అతని వద్దకు పరుగులు తీశారు. స్నేహితులు, బంధువులు ఆశ్చర్యపోయారు. వారు అలాంటి అసాధారణ దశకు కారణాలను కనుగొనడానికి వచ్చారు. స్వాతంత్ర్యోద్యమంలో ఉన్న వ్యక్తులు అతడిని అభినందించడానికి వచ్చారు. వారు మాట్లాడుతున్న ప్రతిచోటా, 'గోప బాబు రాజీనామా చేశారు".[7]

అతని రాజీనామా ఒక ధైర్యమైన నిర్ణయం, ఒక అసాధారణమైన అడుగు, అతడిని వెంటనే భారత స్వాతంత్ర్య ఉద్యమం మధ్యలోకి తీసుకువచ్చాయి. జనాభాలో చాలామంది అతని రాజీనామా గొప్ప త్యాగం అని భావించినప్పటికీ, అతను ఎన్నడూ దానిని త్యాగంగా భావించలేదు.[8] అతను తనపని ప్రదేశంగా జగత్‌సింగ్‌పూర్‌ను ఎంచుకున్నాడు. అతను 1922 జనవరిలో అలకా నది ఒడ్డున ప్రసిద్ధ "అలకాశ్రమ"కు పునాదివేశాడు.[9] ఆశ్రమానికి అనుబంధంగా ఒక పాఠశాల స్థాపించాడు. పాఠశాల ద్వారా విద్యను అందించడంతో పాటు, పరిశుభ్రత పనిని నేర్పింది. మలేరియా, కలరా వంటి అంటు వ్యాధులతో పోరాడటానికి కార్యక్రమాలను అమలు చేసింది.[10] 1921లో అతను భారత జాతీయ కాంగ్రెసుకు ఒరిస్సా తరుపున ప్రాతినిధ్యం వహించాడు. భారత జాతీయ కాంగ్రెసుకు ఒరిస్సా తరుపున ప్రాతినిధ్యం వహించడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్‌కు ప్రాచుర్యం కల్పించడం దాని సంస్థాగత స్థావరాన్ని విస్తరించడంలో అతను కాంగ్రెస్ కార్యాలయానికి బాధ్యత వహించాడు. ఒరిస్సాలో కాంగ్రెస్ స్థాపనను నిర్వహించాడు.[2]

తన రాజకీయ ఆలోచనలో, అతను మహాత్మా గాంధీపై అచంచల విశ్వాసం కలిగిన అంకితభావంతో ఉన్న కాంగ్రెస్ సభ్యుడు.[11] అతను తనకు అధికారం కావాలని ఎప్పుడూ కోరుకోలేదు.బ్రిటిష్ నుండి స్వాతంత్ర్యం సాధించడానికి బలమైన కాంగ్రెస్ కీలకమైందని అతని నమ్మకం.అందువల్ల కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే అతని లక్ష్యంగా భావించాడు. అతను ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.అధికారానికి దూరంగా ఉండే కాంగ్రెస్ కార్యకర్తల బృందానికి నాయకత్వం వహించాడు.వారందరూ కాంగ్రెసును బలోపేతానికి కృషి చేసారు.[12] అతనికి స్వాతంత్ర్య ఉద్యమం, మహాత్మా గాంధీ నాయకత్వం అత్యంత ముఖ్యమైన పరిగణనలుగా భావించాడు కాబట్టి, ఉత్కల్ సమ్మేలానీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక భాషా ప్రావిన్స్ కోసం పోరాడటానికి అతనికి ఆసక్తికలిగింది. అయితే, ఈఆలోచనను వ్యతిరేకించిన ఉత్కల్ సమ్మిలానీ సభ్యుల బృందం కొందరు వ్యతిరేకించారు. చివరికి చౌదరి రెండు వర్గాలతో రాజీపడలేక,1924లో ఉత్కల్ సమ్మేలానీకి రాజీనామా చేశాడు.[13]

1934లో, మహాత్మా గాంధీ ఒరిస్సాలో పాదయాత్ర చేపట్టాడు.అతను తన ప్రయాణ సమయంలో సందర్శించిన ప్రదేశాలలో ఒకటి పూర్వపు కటక్ జిల్లాలోని జాజ్‌పూర్ ఉపవిభాగంలో బారి అనే ఒక మారుమూల గ్రామం ఉంది.బారీ గ్రామం, దాని పరిసర ప్రాంతాలు క్రమం తప్పకుండా వరదల తాకిడికి గురై, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.అతను ప్రభుత్వ సేవలో ఉన్న రోజుల్లో అక్కడ పనిచేసాడు.అతనికి ఆ ప్రాంతంతో బాగా పరిచయం ఉంది.అటువంటి ప్రదేశాలలో ఒకదాన్ని ఎంచుకోవాలని, ప్రజలతో కలిసి పనిచేయడానికి అక్కడే ఉండాలని గోపబంధుకు గాంధీ సూచించారు.గోపబంధు బారీ గ్రామాన్ని ఎంచుకున్నాడు. అతను 1934 ఆగస్టు13 న తన కుటుంబంతో, కొంతమంది ఇతర అనుచరులతో బారీలో స్థావరాన్ని ఏర్పాటు చేశాడు.అతను కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నప్పుడు, క్రియాశీల రాజకీయాలకు వీడ్కోలు పలికాడు [2]

బారీలో, అతను గ్రామాల శుభ్రత గురించి దళితులకు బోధించడం, భూ యజమానుల దోపిడీకి వ్యతిరేకంగా దళితులను శక్తివంతం చేయడం వంటి అనేక సామాజిక పునర్నిర్మాణాలను చేపట్టాడు.అతను చర్మ శుద్ధి తయారీ, మొలాసిస్ ఉత్పత్తి, ఖాదీ తయారీ, సబ్బు, కాగితం ఉత్పత్తి చేసే మొదలైన చిన్న తరహా పరిశ్రమల యూనిట్లు ఏర్పాటును చేపట్టాడు. అతను స్థానిక ప్రజలను తేనెటీగల పెంపకం, డైరీ ఫామ్, బుట్టలు, పరుపుల ఉత్పత్తి వంటి వృత్తిలోకి ప్రోత్సహించాడు. ఇంకా అతను టమోటా, కాలీఫ్లవర్ మొదలైన కొత్త కూరగాయలను పండించడానికి వివిధ పండ్ల మొక్కలను నాటడానికి రైతులకు శిక్షణ ఇచ్చాడు. అతను ప్రారంభించిన కూరగాయలను పండించే పద్ధతి ఇప్పటికీ బారి, దాని సమీప ప్రాంతాల్లో కొనసాగుతోంది. గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తన పనితోపాటు, అతను కులాంతర సామరస్యాన్ని కూడా తీసుకురావాలనుకున్నాడు.1936 లోనే బల్‌దేవ్‌జియు దేవాలయంలోకి అంటరానివారిని అనుమతించమని గ్రామస్తులను ఒప్పించాడు.[2] అతను మహాత్మా గాంధీ జీవిత చరిత్ర "సత్యంతో నా ప్రయోగాలు" ఒడియా, "సత్యర ప్రయోగ" అనే గ్రంధాన్ని అనువదించాడు. [14]

స్వాతంత్ర్యం తరువాత

మార్చు

భారతదేశానికి 1947 లో స్వాతంత్ర్యం వచ్చింది. అతను స్వాతంత్ర్యానికి ముందు ప్రారంభించిన బారీలో తన పనిని కొనసాగించాడు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన పట్ల అతను నిరాశ చెందాడు. దానికి భావనగా అతను 1952 ఎన్నికలను బహిష్కరించాడు.ఆచార్య వినోబా భావే నేతృత్వంలోని భూదాన్ ఉద్యమంలో చేరాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Gopabandhu Choudhuri". veethi.com. Retrieved 2021-09-13.
  2. 2.0 2.1 2.2 2.3 "GOPABANDHU CHOWDHURI: A Declassed Gandhite". Home. 1930-11-23. Retrieved 2019-08-09.
  3. Mishra, P.K. (1979). The Political History of Orissa, 1900-1936. Oriental Publishers & Distributors. p. 224. Retrieved 2019-08-09.
  4. Orissa (India). Public Relations Dept; Orissa (India). Home Dept (1986). Orissa Review. Home Department, Government of Orissa. p. 56. Retrieved 2019-08-09.
  5. Chandrababu, B.S.; Thilagavathi, L. (2009). Woman, Her History and Her Struggle for Emancipation. Bharathi Puthakalayam. p. 313. ISBN 978-81-89909-97-0. Retrieved 2019-08-11.
  6. "Gopabandhu Choudhury and His Gandhian Programmes". OdishaPlus. 2020-05-08. Retrieved 2021-09-13.
  7. Mohanty, Gopinath (1985). Dhuli Matira Santha. Cuttack, Odisha: Vidyapuri. p. 47.
  8. Mohanty, Gopinath (1985). Dhuli Matira Santha. Cuttack, Odisha: Vidyapuri. p. 46.
  9. Mohanty, G.; Patnaik, J.K.; Ratha, S.K. (2003). Cultural heritage of [Orissa]. Cultural Heritage of Orissa. State Level Vyasakabi Fakir Mohan Smruti Samsad. p. 561. ISBN 978-81-902761-4-6. Retrieved 2019-08-09.
  10. Nayak, P.K. (2003). History of modern political movements. Akansha Pub. House. p. 123. ISBN 978-81-87606-40-6. Retrieved 2019-08-09.
  11. Mohanty, Gopinath (1985). Dhuli Matira Santha. Cuttack, Odisha: Vidyapuri. p. 122.
  12. Mohanty, Gopinath (1985). Dhuli Matira Santha. Cuttack, Odisha: Vidyapuri. p. 226.
  13. Acharya, P. (2008). National Movement and Politics in Orissa, 1920-1929. SAGE Series in Modern Indian History. SAGE Publications. p. 79. ISBN 978-93-5280-260-9. Retrieved 2019-08-09.
  14. Datta, A. (1988). Encyclopaedia of Indian Literature: Devraj to Jyoti. Sahitya Akademi. p. 1360. ISBN 978-81-260-1194-0. Retrieved 2019-08-11.

వెలుపలి లంకెలు

మార్చు