బిషంబర్ సింగ్

హర్యానా రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు

బిషంబర్ సింగ్ వాల్మీకి (జననం 8 నవంబర్ 1969) హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బవానీ ఖేరా నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

బిషంబర్ సింగ్ వాల్మీకి

పదవీ కాలం
2014 – 2024
ముందు రాంకిషన్ ఫౌజీ
తరువాత కపూర్ సింగ్ వాల్మీకి
నియోజకవర్గం బవానీ ఖేరా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

బిషంబర్ సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో బవానీ ఖేరా నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి దయా భూర్తనపై 2,559 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2019 ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాంకిషన్ ఫౌజీపై 10,895 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

ఆయన 19 మార్చి 2024 నుండి సెప్టెంబర్ 5 వరకు నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పని చేసి,[3][4] 2024 ఎన్నికలలో టికెట్ దక్కకపోవడంతో 2024 సెప్టెంబర్ 05న బీజేపీకి రాజీనామా చేశాడు.[5]

మూలాలు

మార్చు
  1. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. Deccan Herald (19 March 2024). "Haryana cabinet expanded with eight new ministers, no place for Anil Vij" (in ఇంగ్లీష్). Retrieved 4 November 2024.
  4. ETV Bharat News (19 March 2024). "रागिनी के शौकीन, हारमोनियम बजाने में माहिर, जानिए कौन हैं पहली बार मंत्री बने विशंबर वाल्मीकि" (in హిందీ). Retrieved 4 November 2024.
  5. punjabkesari (5 September 2024). "Haryana: मंत्री बिशम्बर वाल्मीकि ने BJP से दिया इस्तीफा, कल ही काटी गई थी टिकट - mobile". Retrieved 4 November 2024.