బిషన్ లాల్ సైనీ (జననం 1954) హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాదౌర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

బిషన్ లాల్ సైనీ

పదవీ కాలం
2019 – 2024
తరువాత శ్యామ్ సింగ్ రాణా
పదవీ కాలం
2009 – 2014
తరువాత శ్యామ్ సింగ్ రాణా
నియోజకవర్గం రాదౌర్

వ్యక్తిగత వివరాలు

జననం 1954
రాదౌర్, హర్యానా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్

రాజకీయ జీవితం

మార్చు

బిషన్ లాల్ సైనీ ఐఎన్ఎల్‌డీ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 ఎన్నికలలో రాదౌర్ నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ పై 4,395 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత 2014 ఎన్నికలలో టికెట్ దక్కకపోవడంతో ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ కరణ్ దేవ్ పై 2,541 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

బిషన్ లాల్ సైనీ 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ శ్యామ్ సింగ్ రాణా చేతిలో 13,132 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]

మూలాలు

మార్చు
  1. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  2. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Radaur". Retrieved 26 October 2024.