బిస్మత్ ఆక్సీక్లోరైడ్

బిస్మత్ ఆక్సీక్లోరైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్థం.బిస్మత్, ఆక్సిజన్, క్లోరిన్ పరమాణువుల సంయోగం వలన ఈ సమ్మేళనపదార్థ మేర్పడినది.బిస్మత్ ఆక్సీక్లోరైడ్ యొక్క రసాయన సంకేత పదం BiOCl.ఈ సంయోగ పదార్థాన్ని పురాతన కాలం నుండి, పురాతన ఇజిప్టుచరిత్ర కాలంనుండి మానవుడు ఉపయోగించిన దాఖాలాలు ఉన్నాయి.

బిస్మత్ ఆక్సీక్లోరైడ్
పేర్లు
ఇతర పేర్లు
bismuthyl chloride
bismuth oxochloride
bismuth oxide chloride
bismuth(III) oxide chloride
bismoclite
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7787-59-9]
SMILES Cl[Bi]=O
ధర్మములు
BiOCl
సాంద్రత 7.36 (meas.), 7.78 g/cm3 (calc.)[1]
insoluble
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Tetragonal, tP6
P4/nmm, No. 129
a = 0.3887 nm, c = 0.7354 nm
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

బిస్మత్ ఆక్సీక్లోరైడ్ కు ఉన్న ఇతర పేర్లు మార్చు

  • బై బిస్మథైల్ క్లోరైడ్ (bismuthyl chloride)
  • బిస్మత్ ఆక్షోక్లోరైడ్ (bismuth oxochloride)
  • బిస్మత్ ఆక్సైడ్ క్లోరైడ్ (bismuth oxide chloride)
  • బిస్మత్ (II) ఆక్సైడ్ క్లోరైడ్ (bismuth (III) oxide chloride)
  • బిస్మోక్లిట్ (bismoclite)

భౌతిక లక్షణాలు మార్చు

భౌతిక స్థితి మార్చు

బిస్మత్ ఆక్సీక్లోరైడ్ తెల్లని ఘన పదార్థం.

సాంద్రత మార్చు

బిస్మత్ ఆక్సీక్లోరైడ్ సాంద్రత 7.78 గ్రాములు/సెం.మీ3

ద్రావణీయత మార్చు

బిస్మత్ ఆక్సీక్లోరైడ్ నీటిలో కరుగదు.

ప్రకృతి లో ఉనికి మార్చు

బిస్మత్ ఆక్సీక్లోరైడ్ ప్రకృతిలో అరుదైన ఖనిజం బిస్మోక్లిట్ (bismoclite) రూపంలో లభించును. బిస్మోక్లిట్ అనునది మాట్లోకైట్ ఖనిజ గుంపునకు చెందినది.

అణుసౌష్టవం మార్చు

బిస్మత్ ఆక్సీక్లోరైడ్అణువు చతుర్బుజ కోణసౌష్టవం కల్గి ఉంది.బిస్మత్ ఆక్సీక్లోరైడ్ అణువు పొరలుగా Cl, Bi3+, O2 అయాన్ గా ఏర్పడి ఉండును. (పటంలో బిస్మత్=గ్రే, ఆక్సిజన్=ఎరుపు, క్లోరిన్=పచ్చరంగు).ఈ అయాన్‌లు Cl-Bi-O-Bi-Cl-Cl-Bi-O-Bi-Cl, గా ఉండి, ఒకటి వదలి ఒకటి చొప్పున (alternating) అనయాన్ Cl-, O2- లు, కేటాయాన్ Bi3+ ఉండును.ఈ రకంగా పొరలుగా ఉండటం వుండటం వలన pearlescent వంటి లక్షణాలను కల్గి ఉంది.

సంశ్లేషణ –, చర్యలు మార్చు

బిస్మత్ క్లోరైడ్ జలవిశ్లేషణ ద్వారా నీటితో చర్య వలన బిస్మత్ అక్సీక్లోరైడ్ ఏర్పడును.

BiCl3 + H2O → BiOCl + 2 HCl

బిస్మత్ అక్సీక్లోరైడ్ ను 600 °C దాటి వేడి చేసినపుడుఅది అర్ప్పేసంయోగ పదార్థంగా (Bi24O31Cl10) మారును.ఇది సంక్లిష్టమైన లేయర్ నిర్మాణం కల్గి ఉంది.

ఉపయోగాలు మార్చు

బిస్మత్ ఆక్సీక్లోరైడ్ను పురాతన ఈజిప్ట్ కాలము నుండి కూడా కాస్మెటిక్స్ (cosmetics) లలో ఉపయోగించేవారు.ముత్యం వంటి రంగు కల్గిన దీనిని ఐ షాడో (eye shadow) హెయిర్ స్ప్రే లో, పౌడర్లలో, గోళ్ళరంగులో, ఇతర సౌందర్యద్రవ్యాలలో/వస్తువుఉత్పత్తులలో (cosmetic products) ఉపయోగిస్తారు

బిస్మత్ ఆక్సీక్లోరైడ్ కు సమాంతరమైన బిస్మత్ఆక్సినైట్రేట్ అను సంయోగ పదార్థాన్ని తెలుపు రంగు పదార్థంగా ఉపయోగిస్తారు.

మూలాలు/ఆధారాలు మార్చు

  1. Anthony, John W.; Bideaux, Richard A.; Bladh, Kenneth W. and Nichols, Monte C. (ed.). "Bismoclite". Handbook of Mineralogy (PDF). Vol. III (Halides, Hydroxides, Oxides). Chantilly, VA, US: Mineralogical Society of America. ISBN 0-9622097-2-4. Retrieved December 5, 2011.{{cite book}}: CS1 maint: multiple names: editors list (link)