బి. కోడూరు

ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా బి. కోడూరు మండలం లోని గ్రామం
(బి.కోడూరు నుండి దారిమార్పు చెందింది)

బి.కోడూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనివైఎస్‌ఆర్ జిల్లా, బి. కోడూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

బి. కోడూరు
—  రెవిన్యూయేతర గ్రామం  —
బి. కోడూరు is located in Andhra Pradesh
బి. కోడూరు
బి. కోడూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°52′41″N 78°58′41″E / 14.878°N 78.978°E / 14.878; 78.978
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం బి.కోడూరు

గ్రామచరిత్ర మార్చు

1830ల నాడే ఈ గ్రామం వసతులు కలిగివుండేది. వ్యాపారస్తులు ఉండి అన్ని సరుకులు దొరికే పేటస్థలంగా ఉండేది. ఇక్కడ యాత్రికుల కోసం సత్రం ఉండేది. కోడూరు దగ్గరలో అడవి ఉండేది. యాత్రాచరిత్రకారుడు 1830ల నాడు ఈ గ్రామాన్ని గురించి వ్రాస్తూ గ్రామంలో అన్ని కులాల వారూ ఉన్నా బ్రాహ్మణుల ఇళ్ళుండేవి కాదని, ప్రక్కన ఉన్న కోడూరి అగ్రహారంలో ఉన్నా వారు సహకరించేవారు కాదని వ్రాశారు.[1]

గ్రామనామచరిత్ర మార్చు

గ్రామ నామ వివరణ మార్చు

కోడూరు అనే గ్రామనామం కోడు అనే పూర్వపదం, ఊరు అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కోడు అనే పదం జలసూచి కాగా ఊరు అనే పదం జనపదసూచి. కోడుకు అర్థం చిన్న నది లేదా నదియొక్క శాఖ లేదా ఊరి దగ్గర నీటిపల్లం లేదా కొండాకోన.[2] బి అనే అక్షరం సంక్షిప్తంగా వేరేదో పదాన్ని సూచిస్తోంది.

మూలాలు మార్చు

  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 232. Retrieved 10 March 2015.

వెలుపలి లంకెలు మార్చు