బి.డి. ఇనామ్‌దార్
దానప్పగౌడ బసనగౌడ ఇనామ్‌దార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కిత్తూరు నియోజకవర్గం నుండి ఐదుసార్లు కర్ణాటక శాసనసభకు ఎన్నికై సమాచార సాంకేతిక మంత్రిగా పని చేశాడు.
దానప్పగౌడ బసనగౌడ ఇనామ్‌దార్ | |||
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
| |||
పదవీ కాలం 1983 – 1989 | |||
నియోజకవర్గం | కిత్తూరు | ||
---|---|---|---|
పదవీ కాలం 1994 – 1999 | |||
నియోజకవర్గం | కిత్తూరు | ||
పదవీ కాలం 1999 – 2004 | |||
నియోజకవర్గం | కిత్తూరు | ||
పదవీ కాలం 2013 – 2018 | |||
నియోజకవర్గం | కిత్తూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
మరణం | 2023 ఏప్రిల్ 25 మణిపాల్ ఆసుపత్రి, బెంగళూరు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా పార్టీ | ||
సంతానం | 2 కుమారులు, 1 కుమార్తె |
రాజకీయ జీవితం
మార్చుడి.బి. ఇనామ్‌దార్ 1983లో జనతాపార్టీ అభ్యర్థిగా కిత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆయన 1983, 1985లో జనతా పార్టీ అభ్యర్థిగా, 1994, 1999, 2013లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి దేవరాజ అరస్, ఎస్.ఎం.కృష్ణ, ఎస్. బంగారప్ప మంత్రివర్గాలలో మంత్రిగా పని 1989, 2004, 2008, 2018లో ఓటమి పాలయ్యాడు. డి.బి. ఇనామ్‌దార్ మొత్తం 9 ఎన్నికల్లో పోటీ చేసి ఐదు ఎన్నికల్లో విజయం సాధించాడు.
మరణం
మార్చుదానప్పగౌడ బసనగౌడ ఇనామ్‌దార్ ఊపిరితిత్తులు, కాలేయం వ్యాధులతో బాధపడుతూ 2023 మార్చిలో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 25న ఆరోగ్యం విషమించడంతో మరణించాడు.[1][2][3] ఇనామ్‌దార్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన బెళగావి జిల్లా కిత్తూరు సమీపంలోని నెగినాల్‌లో ఏప్రిల్ 26న నిర్వహించారు.[4]
మూలాలు
మార్చు- ↑ The New Indian Express (26 April 2023). "Gentleman politician DB Inamdar passes away at 74" (in ఇంగ్లీష్). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ The Hindu (25 April 2023). "Minister who started IT.Com D.B. Inamdar is no more" (in Indian English). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ The Times of India (26 April 2023). "Ex-min DB Inamdar dies at 74". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ The New Indian Express (27 April 2023). "Thousands bid adieu to DB Inamdar" (in ఇంగ్లీష్). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.