బసప్ప జయ (1944 సెప్టెంబరు 3 - 2021 జూన్ 3), సాధారణంగా బి. జయ అని పిలుస్తారు, కన్నడ సినిమాలో ప్రసిద్ధి చెందిన భారతీయ నటి.[1] దర్శకత్వం వైపు కూడా మళ్ళిన ఆమె 200లకి పైగా చిత్రాలలో నటించింది.[2] గౌడ్రు చిత్రంలో తన నటనకు గాను, 2004-05 ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

బి. జయ
జననం1944 సెప్టెంబరు 3
కొల్లేగల్, మైసూర్ రాజ్యం
మరణం2021 జూన్ 3(2021-06-03) (వయసు 76)
బెంగళూరు, భారతదేశం
వృత్తినటి
పురస్కారాలుఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం

కెరీర్

మార్చు

జయ కర్ణాటక రాష్ట్రంలోని ప్రస్తుత చమరాజనగర్ జిల్లాలోని కొల్లెగల్ కు చెందినది. ఆమె మహాదేవమ్మ, బసప్ప దంపతులకు ఏడుగురు పిల్లలలో నాల్గవది. ఆమె తండ్రి 100కి పైగా చిత్రాలలో నటించిన రంగస్థల కళాకారుడు. జయ తన తండ్రిని అనుసరించి రంగస్థలానికి, ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. 1950ల నుండి ప్రారంభించి, 1992 వరకు ఆమె వేదికపై పనిచేసింది. ఆమె భక్త ప్రహ్లాద్ (1958) చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది.

జయ 'ప్రథిగ్నే', 'బెట్టడ హులీ', 'న్యాయవే దేవురు', 'గౌడ్రు' చిత్రాలకు అవార్డులను గెలుచుకుంది, వీటిలో చివరిది ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు తెచ్చి పెట్టింది.

జయ 2021 జూన్ 3న బెంగళూరులో వయస్సు సంబంధిత వ్యాధులతో మరణించింది.[3]

పాక్షిక ఫిల్మోగ్రఫీ

మార్చు
భక్త ప్రహ్లాద (1958) నగువ హూవు (1971)
దశావతారా (1960) న్యాయవే దేవరు (1971)
నాగార్జున (1961) శ్రీ కృష్ణ రుక్మిణి సత్యభామ (1971)
విధి విలాస (1962) థాయ్ దేవరు (1971)
చంద్ర కుమార (1963) జగ మెచ్చిదా మగా (1972)
కన్యారత్న (1963) కుల్లా ఏజెంట్ 000 (1972)
మన మెచ్చిదా మదాడి (1963) సిపాయి రాము (1972)
సతీ శక్తి (1963) భరత రత్న (1973)
వాల్మీకి (1963) దేవరు కొట్టా తంగి (1973)
వీర కేసరి (1963) గంధడ గుడి (1973)
చిన్నద గొంబే (1964) మూరువారే వజ్రాలు (1973)
ప్రతిజ్ఞే (1964) స్వయంవర (1973)
శివగంగే మహాత్మే (1964) బంగారద పంజర (1974)
బెరత జీవా (1965) సంపతిగే సవాల్ (1974)
బెట్టాడ హులి (1965) శ్రీ శ్రీనివాస కళ్యాణ (1974)
చంద్రహాస (1965) దారి తప్పిన మగా (1975)
ఇదే మహాసుదినా (1965) దేవర గుడి (1975)
సతీ సావిత్రి (1965) మహదేశ్వర పూజా ఫల (1975)
మంత్రాలయ మహాత్మే (1966) శుభమంగళ (1975)
ప్రేమమయి (1966) బహద్దూర్ గండు (1976)
ఎమ్మె తమ్మన్నా (1966) మక్కల భాగ్య (1976)
బీడి బసవన్న (1967) ప్రేమద కనికే (1976)
బెల్లిమోడ (1967) రాజా నాన్న రాజా (1976)
గంగే గౌరి (1967) బబ్రువాహన (1977)
భాగ్యద బాగిలు (1968) బనశంకరి (1977)
గౌరీ గండ (1968) భాగ్యవంతరు (1977)
మన్నిన మగా (1968) గిరి కాన్యే (1977)
మైసూర్ తంగా (1968) పవన గంగ (1977)
మక్కలే మనేగే మాణిక్య (1969) కిలాడి కిట్టు (1978)
నమ్మ మక్కలు (1969) వసంత లక్ష్మి (1978)
ఓడహుట్టిదవరు (1969) వంశ జ్యోతి (1978)
ఎరడు ముఖ (1969) సీతారాము (1979)
అరిషిన కుంకుమ (1970) రహస్య రాత్రి (1980)
కల్లారా కల్లా (1970)...జయ గౌడ్రు (2004)
శ్రీ కృష్ణదేవరాయ (1970) ఆటో శంకర్ (2005)
బాల బంధన (1971) మిలానా (2007)
భలే అదృష్టవో అదృష్ట (1971) హ్యాట్రిక్ హోడి మగా (2009)
హెన్ను హొన్ను మన్ను (1971) ఐతలక్కడి (2010)
హూ బిసిలు (1971) మురారి (2015)
కసిద్రే కైలాస (1971) కల్పన 2 (2016)
కుల గౌరవ (1971) సినిమా మై డార్లింగ్ (2016)
ముక్తి (1971)

మూలాలు

మార్చు
  1. "Three cinema veterans get Kannada Rajyotsava Awards". ibnlive.in.com. Archived from the original on 4 February 2015. Retrieved 1 February 2015.
  2. Top 10 Women Directors of Telugu Cinema, Nettv4u (India), retrieved 12 June 2024
  3. "ಹಿರಿಯನಟಿ ಬಿ. ಜಯಾ ನಿಧನ" [Kannada actress B. Jaya dead]. Prajavani (in Kannada). 3 June 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)