బి. నారాయణ రెడ్డి

బోడిమల్ల నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అనంతపురం నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

బి. నారాయణ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1994
1999 - 2009
ముందు కె. రామకృష్ణ
తరువాత బి. గురునాథ రెడ్డి
నియోజకవర్గం అనంతపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1947 ఫిబ్రవరి 16
పెనకలపాడు (హనకనహల్‌), కణేకల్లు మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు లక్ష్మన్న, తిప్పమ్మ
బంధువులు బి. గురునాథరెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డి (సోదరులు)
నివాసం అరవిందనగర్‌, అనంతపురం

రాజకీయ జీవితం

మార్చు

బి. నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత 1994లో ఓడిపోయి ఆ తర్వాత 1999, 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

బి. నారాయణ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2017 మే 7న మరణించాడు.[1][2]

మూలాలు

మార్చు
  1. Sakshi (7 May 2017). "బీఎన్‌ఆర్‌ కన్నుమూత". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
  2. Sakshi (8 May 2017). "మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మృతి". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.