బి. గురునాథరెడ్డి

బోడిమల్ల గురునాథ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అనంతపురం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

బి. గురునాథరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
ముందు బి. నారాయణ రెడ్డి
తరువాత వి. ప్రభాకర్ చౌదరి
నియోజకవర్గం అనంతపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1950
పెనకలపాడు (హనకనహల్‌), కణేకల్లు మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు లక్ష్మన్న, తిప్పమ్మ
బంధువులు బి. నారాయణ రెడ్డి (అన్నయ్య)
నివాసం అరవిందనగర్‌, అనంతపురం

రాజకీయ జీవితం

మార్చు

బి. గురునాథరెడ్డి రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తన సోదరుడు బి. నారాయణ రెడ్డి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో అనంతపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యాడు. బి.గురునాథరెడ్డి వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం 2012లో ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీని విడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

బి. గురునాథరెడ్డి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు, ఆయన అనంతరం వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[1] గురునాథరెడ్డి 2017 నవంబర్ 30న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[2][3] అనంతరం 2018లో తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4]

మూలాలు

మార్చు
  1. Sakshi (28 August 2015). "బాబు స్వార్థానికి రాష్ట్రం బలి". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
  2. Suryaa (1 December 2017). "Ex MLA GurunathReddy joins TDP". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
  3. Deccan Chronicle (27 November 2017). "Former MLA Gurunath Reddy set to quit YSRC and join Telugu Desam" (in ఇంగ్లీష్). Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
  4. "వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి". 31 December 2018. Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.