బి. సుమీత్ రెడ్డి

బి. సుమీత్ రెడ్డి తెలంగాణా ప్రాంతానికి చెందిన బ్యాడ్‌మింటన్ క్రీడాకారుడు. ఇతడు రంగారెడ్డి జిల్లా గుంగుల్ లో 1991,సెప్టెంబర్ 26 న జన్మించాడు. ఇతడు 2001లో తన 15వ యేట బ్యాడ్మింటన్ క్రీడ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. ఇతడు 2007లో తొలిసారిగా ఆసియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశించాడు. మొదట ఇతడు సింగిల్స్ మాత్రమే ఆడినా గాయం కారణంగా డబుల్స్‌లో ప్రవేశించి రాణించాడు.[2] మొదట ఇతని జోడీ టి.హేమనాగేంద్ర బాబు కాగా ప్రస్తుతం మను అత్రి ఇతని జంటగా ఉన్నాడు.ఇతడు 2014 ఆసియా క్రీడలలో పాల్గొన్నాడు. 2016 ఆగష్టు నుండి ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టులో ఉన్నాడు.

బి. సుమీత్ రెడ్డి
వ్యక్తిగత సమాచారం
జన్మనామంSumeeth Reddy Buss
జననం (1991-09-26) 1991 సెప్టెంబరు 26 (వయసు 32)[1]
గుంగల్
నివాసముతెలంగాణ
దేశం భారతదేశం
వాటంకుడిచేతి
పురుషుల డబుల్స్
అత్యున్నత స్థానం17 (12/31/2015)
ప్రస్తుత స్థానం19 (4/28/2016)
BWF profile

గణాంకాలు మార్చు

విభాగం ఆడినవి గెలిచినవి ఓడినవి
సింగిల్స్ 16 9 7
డబుల్స్ 159 87 72
మిక్స్‌డ్ డబుల్స్ 2 0 2

విజయాలు మార్చు

క్ర.సం సంవత్సరం టోర్నమెంట్ విభాగం భాగస్వామి
1 2013 టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ [3] పురుషుల డబుల్స్ మను అత్రి
2 2014 టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ [4] పురుషుల డబుల్స్ మను అత్రి
3 2015 లాగోస్ ఇంటర్నేషనల్ 2015[5] పురుషుల డబుల్స్ మను అత్రి

వ్యక్తిగత జీవితం మార్చు

2019 ఫిబ్రవరిలో తన తోటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డితో సుమీత్ రెడ్డి వివాహం జరిగింది.[6][7]


ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. బ్యాడ్మింటన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ప్రొఫైల్[permanent dead link]
  2. క్రీడా, విలేఖరి (3 August 2015). "రాకెట్ పదునిక డబుల్". నమస్తే తెలంగాణ. Archived from the original on 7 ఆగస్టు 2015. Retrieved 31 July 2016.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. http://bwf.tournamentsoftware.com/sport/matches.aspx?id=C2E03245-B3FD-4279-A52F-79EB70A934BA&d=20131215
  4. http://bwf.tournamentsoftware.com/sport/matches.aspx?id=67056CB2-0028-4223-BA4F-4C2415CAFBC8&d=20141214
  5. http://bwf.tournamentsoftware.com/sport/winners.aspx?id=C594E8CF-7954-4337-9E77-C06429D76AE3
  6. "Badminton aces N Sikki Reddy and B Sumeeth reddy tie the knot in Hyderabad in a star-studded wedding". Times Now. Retrieved 2022-06-23.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. Adivi, Sashidhar (2019-02-25). "To New beginnings!". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2022-06-23.