బీరకాయ పోపు కూర బీరకాయ కూరగాయ ముక్కలతో చేయబడిన శాకాహారం వంటకం. చాలా మందికి " బీరకాయ కూర " తెలిసే ఉంటుంది. ఎక్కువ మంది తినే ఉంటారు. ముందుగా బీరకాయలు పీలరుతో పెచ్చు తీసుకోవాలి. ముక్కలులో చేదు ఉందో లేదో చిన్నముక్క రుచి చూసుకోవాలి.[1]

బీరకాయ కూర
కూర పోపు సామాను
బీరకాయలు

కావలసినవి మార్చు

బీరకాయలు లేతవి.

కావాల్సిన పదార్థాలు మార్చు

  1. పచ్చి మిరపకాయ
  2. జీలకర్ర
  3. ఉప్పు
  4. నూనె
  5. ఆవాలు
  6. ఎండు మిర్చి
  7. చాయామినపప్పు

కూరకు పోపు సామాను మార్చు

ఈ తాలింపు (పోపు) 2 - 4 మందికి సరిపోతుంది. (ఫోటో) ఉదా: బెండకాయ, బీరకాయ, పొట్లకాయ, అరటికాయ.

తయారీ విధానం మార్చు

బీరకాయ ఒక మాదిరిగా సన్నటి ముక్కలుగా తరుగుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి, ముక్కల లోని నీళ్ళను పిండాలి. ఫోటోలో చూపిన పోపు సామాను వేడి చేసిన నూనెలో దోరగా వేయించుకోవాలి. కారం కావాలనుకునే వారు ఇందులోనే గుండ్రంగా తరిగిన రెండు పచ్చి మిరపకాయలు ముక్కలు వేసి వేయించి, తరువాత నీళ్ళు పిండిన బీరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. పోపు, ముక్కలు బాగా కలిసేటట్లు గరిటతో బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్ లో ఉంచి ముక్కలను బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా ముక్కలు ఉడికిన తర్వాత అవసరమైతే చాలా కొద్దిగా ఉప్పు వేసి, సరిపడా ఎండుకారం వేసి కూరను కలియబెట్టి దింపేయాలి. [2] [3]

బీరకాయలు, ఉల్లిపాయలు వేసుకొని కూర ఈ విధగానూ చేసుకోవచ్చును.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-29. Retrieved 2020-01-14.
  2. https://www.lekhafoods.com/te/south-indian-recipes/andhra-recipes/andhra-veg-curry-recipes/beerakaya-koora/
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-01-31. Retrieved 2018-03-22.

చిత్రమాలిక మార్చు