బీర్బల్
రాజా బీర్బల్, Raja Birbal (1528-1586), అక్బర్ ఆస్థానం లోని "నవరత్నాలలో" ఒక రత్నం. అక్బరు రాజదర్బారు, ప్రభుత్వంలో ఒక మహామంత్రి కూడానూ. అక్బర్ ఇతడిని తన అనుంగునిగా, విశ్వాసపాత్రుడిగా పరిగణించి తన సలహాదారునిగా నియమించుకొన్నాడు. బీర్బల్ మహామేధావి, చతురుడు, హాస్యభరితుడు, తన సంబద్ధ చాతుర్యానికి, సున్నిత హాస్యానికి, అతిసున్నిత విమర్శకూ చక్కటి ఉదాహరణ. బీర్బల్ తో సంభాషించి గెలవడాని మహామహులు తంటాలు పడేవారు. అక్బర్ ఆస్థానంలోగల ఇంకో చతురుడు ముల్లా దో పియాజా, ఇతను తొట్రుపాటు గలవాడు. బీర్బల్ తొణికేవాడు గాదు. ఈ స్థిరత్వం ప్రజలకు ఇంకా ముగ్దుణ్ణి చేసేవి. అక్బర్ కాలంలో అక్బర్ తరువాత, అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాడు బీర్బల్ మాత్రమే నంటే అతిశయోక్తి గాదు. చరిత్రకూడా ఇతడికి సమోన్నత గౌరవమిచ్చి, సరియగు స్థానమిచ్చింది.
ప్రారంభ సంవత్సరాలు
మార్చుతన బాల్యంపేరు "మహేశ్ దాస్", మధ్యప్రదేశ్, సిద్ధి జిల్లా, సిహావల్ తహ్సీల్ లోని ఘోఘరా గ్రామంలో జన్మించాడు. ఇతడు కాయస్థ బ్రాహ్మణ ఇంటిలో పెరిగి పెద్దవాడయ్యాడు. ఇతడు కవి, రచయిత. ఇతని హాస్యము, మేధ, అక్బర్ ఆస్థానంలో మంత్రిహోదా పొందేవరకూ తీసుకెళ్ళింది. అక్బర్ ఇతడికి రాజా అనే బిరుదిచ్చి గౌరవించాడు.
మరణం
మార్చురాజా బీర్బల్, మలందరీ కనుమలో జరిగిన యుద్ధంలో మరణించాడు. అక్బర్ కు ఇతడి మరణం తీవ్రంగా కలచివేసింది. చాలా కాలంవరకూ, శోకిస్తూనే ఉన్నాడు. అక్బర్, బీర్బల్ ల మధ్య గల బాంధవ్యం అలాంటిది.
ఇతర పఠనాలు
మార్చు- బీర్బల్ 50 హాస్యకథలు (ISBN 81-7806-050-7), రచయిత క్లిఫోర్డ్ సాహ్నీ (ముద్రణ: పుస్తక్ మహల్, ఢిల్లీ)
- మీ సమస్యలు తీర్చుకోండి రచయిత: లూయిస్ S. R. వాస్ (ISBN 81-223-0800-7)
Unravelling in the Court of Akbar, the well-known Birbal stories illustrate the minister’s sagacity and problem-solving acumen. The Ninth Gem of the Mughal Crown By: James Moseley